PAK vs SA : ఈ ముక్కోణపు వన్డే సిరీస్ లో తొలి మ్యాచ్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు ఘన విజయం సాధించింది. వాస్తవానికి ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ గెలుస్తుందని సంకేతాలు కనిపించాయి. పైగా సొంతమైదానం కావడంతో ఆ జట్టుకు విపరీతమైన అడ్వాంటేజ్ ఉంది. అయినప్పటికీ దానిని ఆ జట్టు వినియోగించుకోలేక పోయింది. బౌలింగ్లో చివరి ఓవర్లలో దారుణంగా తరబడింది. ఇక బ్యాటింగ్లో అయితే.. ఒక్క ఓపెనర్ మినహా మిగతా ఆటగాళ్లు చేతులెత్తేశారు. న్యూజిలాండ్ స్పిన్ బౌలర్లు పాకిస్తాన్ జట్టు పతనాన్ని శాసించారు. దీంతో సొంత గడ్డపై.. అది కూడా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న తరుణంలో పాకిస్తాన్ చేతులారా ఓటమిని కొని తెచ్చుకోవడం విశేషం. ఈ పరిణామం ఆ దేశ అభిమానులను సైతం నివ్వెర పరుస్తోంది. ” ఈ మ్యాచ్ లోనే ఇలా తడబడితే.. ఛాంపియన్స్ ట్రోఫీలో ఎలా ఆడతారు? 2017లో మాదిరిగా విజేతగా నిలుస్తారా? అది సాధ్యమవుతుందా? ఆటగాళ్ళ కు ఏమాత్రం ఆసక్తి లేనట్టు కనిపిస్తోంది. ఇలా అయితే ఎలా అంటూ” పాక్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఏకి పడేస్తున్నారు.
సౌత్ ఆఫ్రికాది అదే పరిస్థితి
ఇక ఈ సిరీస్ లో రెండవ వన్డేలో న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా జట్లు తలపడ్డాయి. అయితే సౌత్ ఆఫ్రికా కూడా పాకిస్తాన్ మాదిరిగానే అత్యంత నాసిరకమైన ఆట తీరు ప్రదర్శించింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు అన్ని విభాగాలలో సత్తా చాటి.. విజయాన్ని దక్కించుకుంది. మొత్తంగా ఈ సిరీస్ లో ఫైనల్ వెళ్లిపోయింది.. ఇక ఈ సిరీస్ లో మరో ఫైనలిస్ట్ ను నిర్ణయించే మ్యాచ్ బుధవారం జరగనుంది. కరాచీ నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాల నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది..
జట్ల అంచనా ఇదే
పాకిస్తాన్
బాబర్ అజాం, ఫఖార్ జమాన్, సౌద్ షకీల్, తయ్యాబ్ తాహిర్, షహీమ్ అష్రఫ్, కమ్రాన్ గులాం, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా, మహమ్మద్ రిజ్వాన్, ఉస్మాన్ ఖాన్, ఆబ్రార్ అహ్మద్, అకిఫ్ జావేద్, హారీస్ రౌఫ్, మహమ్మద్ హస్నైన్, నసీంషా, షాహిన్ ఆఫ్రిది.
దక్షిణాఫ్రికా
జేసన్ స్మిత్, మాథ్యూ బ్రిట్జ్కే, తెంబా బవుమా(కెప్టెన్), టోనీ డీ జోర్జీ, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్, సేనురన్ ముత్తుస్వామి, వియాన్ ముల్డర్, హెన్రిచ్ క్లాసెన్, మీకా ఈల్ ప్రిన్స్, ఇతాన్ బాష్, గిడియన్ పీటర్స్, జూనియర్ దలా, క్వేనా మఫాక, లుంగీ ఎంగిడి, మిహ్లాలీ మోప్వాంగ్వానా తబ్రైజ్ షమ్సీ.
గూగుల్ అంచనా ప్రకారం ఈ మ్యాచ్లో పాకిస్తాన్ గెలవడానికి 71%, న్యూజిలాండ్ గెలవడానికి 29% అవకాశాలున్నాయి.