IPL Auction 2022: దుబాయ్ వేదికగా ఐపీఎల్-2021 రసవత్తరంగా సాగింది. కరోనా ఆంక్షల మధ్యే జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ప్రపంచ క్రికెట్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఐపీఎల్ 2021లో ఎనిమిది జట్లు పాల్గొనగా 2022లో పది జట్లు పాల్గొనబోతున్నాయి. కొత్తగా ఆహ్మదాబాద్, లక్నో జట్లు రాబోతున్నాయి. ఈక్రమంలోనే ఐపీఎల్ 2022 సీజన్ కు సంబంధించి మెగా వేలానికి ప్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి.
ఐపీఎల్ 2022 వేలంపాటలు జనవరిలో మొదలు కానున్నాయి. అయితే ప్రాంచైజీ జట్టు అంటిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను ప్రకటించేందుకు నేడే చివరి తేది. ఒక్కో ప్రాంచైజీ జట్టు గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను అంటిపెట్టుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఆయా ప్రాంచైజీలు ఏయే ఆటగాళ్లను అంటిపెట్టుకుంటాయి? మరెవరినీ వేలంపాటలో పెట్టబోతున్నాయనేది మాత్రం ఆసక్తిని రేపుతోంది.
క్రికెట్ విశ్లేషకుల అంచనాల మేరకు.. ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్ శర్మ, పేసర్ బుమ్రా, పోలార్డ్, సూర్య కుమార్ యాదవ్ లను అంటిపెట్టుకునే అవకాశం కన్పిస్తుంది. ఇషాన్ కిషన్, హర్దిక్ పాండ్యాలను వేలంపాటలో తిరిగి దక్కించుకోవాలని ఆ జట్టు యాజమాన్యం భావిస్తోస్తుందని సమాచారం.
ఢిల్లీ విషయానికొస్తే రిషబ్ పంత్, పృథ్వీ షా, అక్షర్ పటేల్, ఎన్రిచ్ నార్జ్ లను అంటిపెట్టుకోనుండగా అశ్విన్, కాగిసో రబాడలను వేలంలో దక్కించుకోవాలని భావిస్తోంది. చైన్నె జట్టులో మహేంద్ర సింగ్ ధోని, రవీంద్ర జడేజా, రుతురాజ్, మెయిన్ అలీ ఉండే అవకాశం కన్పిస్తుంది. పంజాబ్ కింగ్స్ లో కేఎల్ రాహుల్, అర్ష్ దీప్ సింగ్, రవి బిష్ణోయ్ ఉండటం ఖాయంగా కన్పిస్తోంది.
Also Read: హతవిధీ.. ఒక్క వికెట్ తీయలేక ఓడిన భారత్
కోలకత్తా నైట్ రైడర్స్ లో వరుణ్ చక్రవర్తి, అండ్రీ రసెల్, వెంకటేష్ అయ్యర్, సునిల్ నరైన్ ఖాయం కానుండగా మెర్గాన్, శుభ్మన్ గిల్ లను వేలంపాటలో దక్కించుకోవాలని యాజమాన్యం భావిస్తోంది. రాజస్థాన్ రాయల్స్ జట్టులో సంజు శాంసన్, జోస్ బట్లర్ ఉండనున్నారని తెలుస్తోంది.
రాయల్ ఛాలెంజ్ జట్టులో విరాట్ కోహ్లీ, చాహెల్, మాక్స్ వెల్ ఉండటం ఖాయంగా కన్పిస్తోంది. హైదరాబాద్ జట్టులో కేన్.విలియమ్స్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్ చుట్టుతా జట్టును నిర్మించాలని భావిస్తుందట. మొత్తానికి నేటితో ప్రాంచైజీ జట్టులు ఏయే ఆటగాళ్లను అంటిపెట్టుకోనుందో తెలిపోనుంది.
Also Read: టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ పనితీరుతో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి..?