Sirivennela: ఇటీవల ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆనారోగ్యంతో బాధపడుతున్నారని సోషల్‌మీడియాలో వార్తలు వినిపించాయి. ఆయన ఆరోగ్యం క్షీణించిందని అన్నారు. అయితే, ఈ విషయంపై స్పందంచిన ఆయన కుటుంబ సభ్యులు.. వార్తలు ఖండించారు. అయితే, ప్రస్తుతం సిరివెన్నెల కేవలం న్యుమోనియాతో బాధపడుతున్నారని.. కిమ్స్ ఆసుపత్రిలో చేర్చి.. చికిత్స అందిస్తున్నామని అన్నారు. అయితే, కంగారు పడాల్సిన పనిలేదని వైద్యులు చెప్పినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Also Read: సిరివెన్నెల ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవం
కాగా, సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్యానికి సంబంధించి కిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. ఆయన బాగానే ఉన్నారని.. కంగారు పడాల్సిన పనిలేదని అన్నారు. నవంబరు 24న ఆయన న్యుమోనియాతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు ఆయన. ఈ క్రమంలోనే సిరివెన్నెల ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తామని వైద్యులు చెప్పారు.
సిరివెన్నెల సినిమాతో సినీ ప్రస్థానం మొదలు పెట్టి.. అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా అంటూ జనాన్ని నిగ్గదీసి అడిగి.. తన పదసంపద ఒంపుల్లో ప్రేమ, బాధ, కరుణ, రౌద్రం.. ఇలా నవరసాలను పండంచిన వ్యక్తి సిరివెన్నెల. ఏదైనా పాట రాయాలంటే..పెన్ను సిరాలోంచి అక్షరాలు తూటాల్లా దూసుకెళ్లి వస్తుంటాయి. ప్రతి మనసును కదిలించి.. నిద్ర లేకుండా చేస్తాయి. అంతటి శక్తి ఆయన రచనా సాహిత్యానికి ఉంది. ఇప్పటికీ ఎన్నో నిద్రలేన రాత్రుల్లో.. చీకటి పొరల్ని చీల్చుకుని వచ్చే వెలుగులా తన అక్షరాల్ని జనాలపై సంధస్తున్నారు సిరివెన్నెల.
Also Read: కమల్ ఆరోగ్యంపై వైద్యులు స్పందన.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే?