https://oktelugu.com/

Pushpa: పుష్ప ప్రీరిలీజ్​ ఈవెంట్​ ముఖ్య అతిథిగా ప్రభాస్​?

Pushpa: ఐకాన్​స్టార్​ అల్లు అర్జున్​ హీరోగా దర్శకుడు సుకుమార్​ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్​ నేపథ్యంలో సాగే ఈ కథలో బన్నీ ఓ పల్లెటూరి మొరటోడి లుక్​లో కనిపించనున్నారు. సుకుమార్​ తొలిసారి పాన్​ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తోన్న సినిమా ఇది. ఇందులో రష్మిక హీరోయిన్​గా కనిపించనుంది. కాగా, ఇందులో సమంత ఓ స్పెషల్​ సాంగ్​లో కనిపించనున్న సంగతి తెలిసిందే.  కాగా, డిసెంబరు 6న ఈ సినిమా ట్రైలర్​ను విడుదల చేయనున్నట్లు నిన్న అనౌన్స్ కూడా చేశారు. దీంతో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 30, 2021 / 10:38 AM IST
    Follow us on

    Pushpa: ఐకాన్​స్టార్​ అల్లు అర్జున్​ హీరోగా దర్శకుడు సుకుమార్​ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్​ నేపథ్యంలో సాగే ఈ కథలో బన్నీ ఓ పల్లెటూరి మొరటోడి లుక్​లో కనిపించనున్నారు. సుకుమార్​ తొలిసారి పాన్​ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తోన్న సినిమా ఇది. ఇందులో రష్మిక హీరోయిన్​గా కనిపించనుంది. కాగా, ఇందులో సమంత ఓ స్పెషల్​ సాంగ్​లో కనిపించనున్న సంగతి తెలిసిందే.  కాగా, డిసెంబరు 6న ఈ సినిమా ట్రైలర్​ను విడుదల చేయనున్నట్లు నిన్న అనౌన్స్ కూడా చేశారు. దీంతో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

    Prabhas and Allu Arjun

    Also Read: బాలీవుడ్ లో మల్టీస్టారర్ కి రెడీ అవుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

    ఈ క్రమంలోనే   ఈ సినిమా ప్రీ రిలీజ్​ ఈవెంట్​లోనూ భారీగా ప్లాన్​ చేస్తున్నట్లు సమచాారం. ఈ కార్యక్రమానికి రెబల్ స్టార్ ప్రభాస్​ను ముఖ్య అతిథిగా ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్​లోనే గ్రాండ్​గా ఈ ఈవెంట్​ను నిర్వహించనున్నారట. కాగా, దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్​కు మంచి క్రేజ్​ ఉంది. అలాంటి వ్యక్తిని ఈ సినమా ప్రమోషన్స్​కు వాడుకుంటే మరింత క్రేజ్​ వస్తుందని సుకుమార్ భావిస్తున్నట్లు సమాచారం.

    మరి దీనికి ప్రభాస్​ ఓకే చెప్తారా లేదా చూడాలి. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు. మరోవైపు, చిన్న, పెద్ద సినిమాలను ప్రోత్సహిస్తున్నాారు కూడా. ఇటీవలే రొమాంటిక్ సినిమా ప్రమోషన్స్​లోకూడా తన వంతు చేయి అందించారు. మరి బన్నీకి కూడా అండగా నిలుస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. డిసెంబరు 12న ఈ వేడుకను నిర్వహించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబరు 17న పాన్​ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది.

    Also Read: ప్రమోషన్స్​ కోసం రంగంలోకి దిగుతున్న ‘పుష్ప’రాజ్