Allu Arjun : హీరోగా అల్లు అర్జున్ కెరీర్ పీక్స్ లో ఉంది. ఆయన పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. జాతీయ అవార్డు అందుకున్న ఫస్ట్ టాలీవుడ్ హీరోగా రికార్డులకు ఎక్కాడు. అల్లు అర్జున్ కి కోట్లలో అభిమానులు ఉన్నారు. అలాంటి అల్లు అర్జున్ కి ఓ తీరని కోరిక ఉందట. అదేమిటో తెలుసా?
గాడ్ ఫాదర్స్ ఉన్నప్పటికీ పరిశ్రమలో ఎదగాలంటే టాలెంట్ ఉండాలి. ప్రతిభ, ప్రత్యేకత లేకపోతే స్టార్ హీరో కిడ్స్ అయినప్పటికీ కెరీర్ ఉండదు. రెండు మూడేళ్ళలో పరిశ్రమ నుండి చెక్కేస్తారు. చిరంజీవి మేనల్లుడు, అల్లు రామలింగయ్య మనవడు అయిన అల్లు అర్జున్ మెగా హీరోగా విపరీతమైన అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నాడు. అల్లు అర్జున్ లో ఉన్న ప్రత్యేకత గొప్ప డాన్సర్. దేశంలోనే టాప్ డాన్సర్స్ లో అల్లు అర్జున్ ఒకరు. టాలీవుడ్ లో ఎన్టీఆర్-అల్లు అర్జున్ నువ్వా నేనా అని పోటీపడతారు.
ఇతర రాష్ట్రాల్లో మార్కెట్ ఏర్పాటు చేసుకున్న ఫస్ట్ హీరో అల్లు అర్జున్. ఆయనకు కేరళలో అభిమాన సంఘాలు ఉన్నాయి. అల్లు అర్జున్ నటించిన సినిమాల మలయాళ వెర్షన్ కూడా విడుదల చేస్తారు. ఇక పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. నార్త్ ఆడియన్స్ అల్లు అర్జున్ అంటే పడి చస్తున్నారు. అందుకు పాట్నా లో జరిగిన పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిదర్శనం. ఏకంగా రెండు లక్షలకు పైగా అభిమానులు ఆ వేడుకకు హాజరయ్యారు.
అల్లు అర్జున్ అందుకున్న మరో అరుదైన ఘనత జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకోవడం. తెలుగు సినిమా చరిత్రలో జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న ఏకైక హీరో అల్లు అర్జున్. ఇంతటి ఘన కీర్తి సాధించిన అల్లు అర్జున్ కి ఒక తీరని కోరిక ఉందట. ఆ విషయంలో ఆయన ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారట. అదేమిటంటే.. తాతయ్య అల్లు రామలింగయ్యతో నటించడం. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోలేదన్న బాధ అల్లు అర్జున్ ని వేదనకు గురి చేస్తుందట.
ఆర్య మూవీలో ఒక చిన్న పాత్ర అయినా ఆయన చేత చేయించాలి అనుకున్నారట. కానీ కుదరలేదట. ఆ సినిమాలో తాతయ్య తో పాత్ర చేయించకుండా ఎందుకు నిర్లక్ష్యం చేశానని అల్లు అర్జున్ బాధపడుతుంటాడట. కాగా అదే ఏడాది అల్లు రామలింగయ్య కన్నుమూశారు. నాకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వచ్చినట్లు ఆయనకు తెలిస్తే ఎంతో సంతోషించేవారు. తాతయ్య లేరనే బాధ కూడా ఉందని అల్లు అర్జున్ అన్నారు. అల్లు రామలింగయ్య మరణించిన నేపథ్యంలో ఆయనతో కలిసి నటించాలన్న అల్లు అర్జున్ కోరిక ఎప్పటికీ తీరేది కాదు.