ICC World Cup 2023 : వన్డే వరల్డ్ కప్ కు రంగం సిద్ధమవుతోంది. ఈ ఏడాది అక్టోబర్ నెల నుంచి భారత్ వేదికగా వరల్డ్ కప్ జరగనుంది. ఈ వరల్డ్ కప్ కోసం 10 జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. వరల్డ్ కప్ కు సమయం దగ్గర పడుతున్న కొద్ది ఎవరు గెలిచే అవకాశం ఉంది అన్న దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ వరల్డ్ కప్ లో పది జట్లు పోటీ పడుతున్నాయి. వీటిలో ఓ నాలుగు జట్లకు మాత్రం వరల్డ్ కప్ గెలిచే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హోమ్ గ్రౌండ్స్ లో ఆడుతుండడం భారత జట్టుకు కలిసి వస్తుందని, ఈ జాబితాలో టాప్ లో భారత్ ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.
భారత్ లో జరగనున్న వరల్డ్ కప్ కు జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ ఐదు నుంచి నవంబర్ 19 వరకు ఈ మెగా టోర్నీ నిర్వహించేందుకు అనుగుణంగా బిసిసిఐ ఏర్పాట్లు పూర్తి చేసింది. ర్యాంకుల ఆధారంగా ఈ వరల్డ్ కప్ లో ఆడే ఎనిమిది జట్లు ఇప్పటికే అర్హత సాధించగా, రెండు జట్లను క్వాలిఫైయర్ మ్యాచులు ద్వారా ఎంపిక చేశారు. క్వాలిఫైయర్ మ్యాచులు ద్వారా శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు బెర్తులు దక్కించుకున్నాయి. ఈ వరల్డ్ కప్ లో ఆడే జట్లను పరిశీలిస్తే.. ఇండియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి.
వరల్డ్ కప్ గెలిచే అవకాశాలు ఏ జట్లకు..
వరల్డ్ కప్ గెలవడం ప్రతి జట్టుకు కల. ఆ కలను నెరవేర్చుకునే అవకాశం నాలుగేళ్లకు ఒకసారి వస్తుంది. ఈ ఏడాది వరల్డ్ కప్ సాధించడమే లక్ష్యంగా పది జట్లు బరిలోకి దిగుతున్నాయి. అయితే, వీటిలో ఒక నాలుగు జట్లకు మాత్రం కప్ గెలిచే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. వీటిలో భారత్ జట్టుకు వరల్డ్ కప్ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే భారత జట్టు స్వదేశంలో ఆడేటప్పుడు అన్ని విభాగాల్లోనూ అత్యంత బలంగా ఉంటుంది. భారత్ ను స్వదేశంలో ఓడించడం చాలా కష్టం. హోమ్ గ్రౌండ్స్ లో బ్యాటింగ్ తోపాటు బౌలింగ్ విభాగంలోనూ రాణించ గల సత్తా భారత్ సొంతం. ముఖ్యంగా ప్రత్యర్థి ఎంత బలంగా ఉన్నా స్పిన్ మంత్రంతో చుట్టేయగల సామర్థ్యం భారత బౌలర్లకు సొంతం. అదే సమయంలో బ్యాటింగ్ లోను అద్వితీయమైన ప్రతిభ చాట గల సమర్థులు జట్టులో ఉన్నారు. దీంతో భారత్ హాట్ ఫేవరెట్ గా ఈ ఏడాది జరుగుతున్న వరల్డ్ కప్ లో బరిలోకి దిగుతోంది. వరల్డ్ కప్ ఎక్కడ జరిగిన బలంగా కనిపించే జట్టు ఆస్ట్రేలియా. వేదిక ఏదైనా, దేశం ఎక్కడైనా తమదైన రోజున చిచ్చరపిడుగుల్లా చెలరేగిపోయే తత్వం ఆస్ట్రేలియా జట్టుది. ఈ జట్టు కూడా ఈ ఏడాది వరల్డ్ కప్ లో ఫేవరెట్ గానే బరిలోకి దిగుతోంది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో అత్యంత పటిష్టంగా ఉండడం ఈ జట్టుకు కలిసి వస్తుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుత ఫామ్ ను చూస్తే.. తప్పకుండా ఆస్ట్రేలియా జట్టు సెమీ ఫైనల్ కు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇంగ్లాండ్ జట్టు కూడా బలంగానే కనిపిస్తోంది. ఈ జట్టు తమదైన రోజున విధ్వంసం సృష్టించే సామర్థ్యం కలిగినదే. బౌలింగ్ విభాగంలో పటిష్టంగా ఈ జట్టు కనిపిస్తోంది. బ్యాటింగ్ విభాగంలోనూ బలంగానే ఉన్నప్పటికీ యాషెస్ సిరీస్ లో మాత్రం దారుణంగా విఫలమవుతుంది ఈ జట్టు. అయితే, అత్యంత బలమైన జట్టును వరల్డ్ కప్పుకు ఇంగ్లాండ్ జట్టు పంపించనుంది. దీంతో ఇంగ్లాండ్ జట్టు కూడా హాట్ ఫేవరెట్ జాబితాలో ఉంది. ఇక ఆసియా ఖండంలో ఎక్కడ మ్యాచ్ జరిగిన బలంగా కనిపించే మరో జట్టు పాకిస్తాన్. ప్రస్తుతం ఆ జట్టు అనామక జట్టుగా కనిపిస్తున్నప్పటికీ.. భారత్ మాదిరిగా ఉప ఖండం పిచ్ లపై తమదైన రోజున చెలరేగిపోయే అవకాశం ఉంది. పాకిస్తాన్ మాదిరిగానే ఇంచుమించుగా భారత్ లోను పిచ్ లు ఉంటాయి. ఇది కూడా పాకిస్తాన్ జట్టుకు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. అదే విధంగా ఆ జట్టులో అత్యంత వేగంగా బౌలింగ్ చేసే నాణ్యమైన బౌలర్లు కూడా ఉండడం భారత్ కు కలిసి వస్తుంది.
ఈ జట్లకు మెరుగైన అవకాశాలు..
ఇకపోతే దక్షిణాఫ్రికా జట్టు కూడా తమదైన రోజున రెచ్చిపోయే సామర్థ్యం కలిగిన జట్టే. ఈ జట్టు కూడా బలంగానే కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దక్షిణాఫ్రికా జట్టు అత్యంత బలంగా ఉంది. ఈ జట్టుకు కూడా అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇకపోతే న్యూజిలాండ్ జట్టు హాట్ ఫేవరెట్ జట్లలో ఒకటి. కానీ, ప్రస్తుతం ఆ జట్టులోని కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడటంతో ఎంత వరకు ప్రభావం చూపిస్తుందన్నది అర్థం కావడం లేదు. కానీ ఈ జట్టు కూడా మెరుగైన ప్రదర్శన చేసే సామర్థ్యం కలిగినదే. ఇక ఉప ఖండంలోని మరో జట్టు శ్రీలంక. కొన్నాళ్ల నుంచి క్రికెట్ లో తీవ్ర ఒడుదుడుకులను ఎదుర్కొంటున్న ఈ జట్టు.. ఆసియా కప్ లో అండర్ డాగ్స్ గా బరిలోకి దిగి టైటిల్ గెలిచి తమ సత్తాను చాటింది. వరల్డ్ కప్ లో కూడా అటువంటి ప్రదర్శన చేస్తే సెమీఫైనల్ వరకు వెళ్లే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. చూడాలి మరో మూడు నెలల్లో ప్రారంభం కానున్న వరల్డ్ కప్ లో ఏ జట్టు ఎటువంటి ప్రదర్శన చేయనుందో.