For Look Young : జలమే జీవనాధారం. ప్రపంచంలో నీటితోనే ప్రాణుల మనుగడ ఉంటుంది. మనిషి అయినా జంతువు అయినా నీళ్లు కచ్చితంగా తాగాల్సిందే. నీరు తాగని ప్రాణి ఉండదు. దీంతో నీటి వల్ల మనకు అనేక లాభాలున్నాయి. మంచినీళ్లు తాగడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. నలభై ఏళ్లు దాటిన తరువాత కూడా మనం యవ్వనంగా కనిపించాలంటే నీరే ప్రధానం. మన శరీరం కూడా ఎక్కువ భాగం నీటితో కూడకుకుని ఉంటుంది.
నీరు ఎలా తాగాలి?
మంచినీళ్లు తాగడంలో కూడా నియమాలు ఉంటాయి. నీళ్లు ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదు. అన్నం తినేటప్పుడు అసలు తాగకూడదు. అన్నం తిన్నాక గంటన్నర ఆగి నీళ్లు తాగాలి. ఇలా నీళ్లు తాగడం అలవాటుగా చేసుకోవాలి. అప్పుడే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. నీళ్లు తాగడం వల్ల మనకు చాలా రకాల ప్రయోజనాలు దాగి ఉంటాయి.
నీళ్లు తాగకపోతే ఏమవుతుంది?
నీళ్లు తాగకపోతే మనం తిన్న ఆహారాలు జీర్ణం కావు. దీంతో అజీర్తి సమస్య ఏర్పడుతుంది. కడుపులో మలినాలు పేరుకుపోతాయి. దీంతో అనారోగ్యం దరి చేరుతుంది. ఇలా మంచినీళ్లు మన జీవితానికి తోడ్పడతాయి. దాహం వేసినప్పుడు నీళ్లు ఒకేసారి తాగకూడదు. కొంచెం కొంచెం తాగితే మంచిది. నీళ్లు తాగితే పలు రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
చల్లని నీళ్లు తాగకూడదు
ఎండాకాలంలో కూడా చల్లని నీళ్లు తాగకూడదు. ఫ్రిజ్ వాటర్ అసలే తాగొద్దు. కుండలో నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యం కలుగుతుంది. ఉదయం పూట కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత గోరు వెచ్చని నీళ్లు తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. నీళ్లు తాగడం వల్ల మనకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.