Project K : వాట్ ఈజ్ ప్రాజెక్ట్ కే?… టీ షర్ట్ ఉచితంగా కావాలా? ఇలా చేయండి!

ఈ రోజు సాయంత్రం 7:11 నిమిషాలకు మరోసారి టీ షర్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కాబట్టి వెంటనే లింక్ క్లిక్ చేస్తే వాట్ ఈజ్ ప్రాజెక్ట్ కే టీ షర్ట్ లభించే ఆస్కారం కలదు.

Written By: Shiva, Updated On : July 9, 2023 11:24 am
Follow us on

Project K : ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్లాప్ టాక్ తెచ్చుకున్న చిత్రాలు కూడా వందల కోట్ల వసూళ్లు రాబడతాయి. ఇక ఒక హిట్ పడితే ప్రభాస్ మూవీ వసూళ్లకు ఆకాశమే హద్దు. అందుకు బాహుబలి సిరీస్ నిదర్శనంగా నిలిచాయి. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ నెగిటివ్ టాక్ తో కూడా బాక్సాఫీస్ దుమ్ముదులిపాయి. అయితే ప్రభాస్ అప్ కమింగ్ చిత్రాలు మాత్రం ఫ్యాన్స్ ని నిరాశపరచవని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. సలార్, ప్రాజెక్టు కే ఫ్యాన్స్ దాహం తీర్చే చిత్రాలు అవుతాయనే మాట గట్టిగా వినిపిస్తోంది.

ముఖ్యంగా ప్రాజెక్ట్ కే మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి, విడుదలకు మరో ఆరు నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో ప్రమోషన్స్ షురూ చేశారు. అభిమానుల కోసం ప్రాజెక్ట్ కే టీమ్ టీ షర్ట్స్ తీసుకొచ్చారు. వాట్ ఈజ్ ప్రాజెక్ట్ కే? అని రాసున్న టీ షర్ట్స్ ప్రభాస్ ఫ్యాన్స్ ఉచితంగా పొందవచ్చు. అందుకు వాళ్ళు చేయాల్సిందల్లా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడమే.

వైజయంతి మూవీస్ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ లో ఒక లింక్ షేర్ చేశారు. ఆ లింక్ పై క్లిక్ చేస్తే సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ మనకు కావాల్సిన సైజులో టీ షర్ట్ ఆర్డర్ చేస్తే ఇంటికి డెలివరీ అవుతుంది. అయితే అదంత ఈజీ కాదు. కోట్లలో ఉన్న ప్రభాస్ అభిమానులు టీ షర్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి క్షణాల్లో స్టాక్ అయిపోతుంది. ఫస్ట్ స్టాక్ అయిపోయింది. రెండో స్టాక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

వాట్ ఈజ్ ప్రాజెక్ట్ కే అనే క్యూరియాసిటీని జనాల్లో పెంచి, సినిమాకు మరింత ప్రచారం కల్పించేందుకు టీమ్ ఇలా చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 7:11 నిమిషాలకు మరోసారి టీ షర్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కాబట్టి వెంటనే లింక్ క్లిక్ చేస్తే వాట్ ఈజ్ ప్రాజెక్ట్ కే టీ షర్ట్ లభించే ఆస్కారం కలదు. కాగా ప్రాజెక్ట్ కే మూవీ 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. కమల్ హాసన్, దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు.