https://oktelugu.com/

Ishan Kishan: ఇషాన్ కిషన్ పై నిషేధం విషయంలో తప్పేవరిది?

కాంట్రాక్ట్ నుంచి తొలగించడంతో కిషన్ తొలిసారిగా స్పందించాడు. "ఇటువంటి పరిణామాల గురించి నేను పెద్దగా ఆలోచించను. నా స్టామినా ఏంటో నిరూపించుకునేందుకే ప్రయత్నిస్తా. ఏమైంది? ఏం జరిగింది? అని చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు బాగుందని నేను చెప్పడం లేదు. కానీ కష్టంగా గడుస్తోంది. గత ఆరు నెలలుగా నేను తీవ్రమైన డిప్రెషన్ కు గురయ్యా. నేను ఉత్తమ ప్రదర్శన చేస్తున్నాను. అయినప్పటికీ రిజర్వ్ బెంచ్ కి పరిమితం కావాల్సి వస్తోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : July 8, 2024 / 03:01 PM IST

    Ishan Kishan

    Follow us on

    Ishan Kishan: ఇషాన్ కిషన్.. టీమిండియాలోకి తారాజువ్వలా దూసుకు వచ్చిన ఆటగాడు. వన్డేలో డబుల్ సెంచరీ సాధించాడు. టి20 లలోనూ సత్తా చాటాడు. కానీ దురదృష్టవశాత్తు కొన్ని టోర్నీలలో విఫలమయ్యాడు. దూకుడు ప్రవర్తనను కొనసాగించాడు. ఇది సహజంగానే బీసీసీఐ పెద్దలకు ఆగ్రహం తెప్పించింది. దీంతో అతడిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించారు. ఫలితంగా అతడికి భారత జట్టులోకి ద్వారాలు ముగుసుకుపోయాయి.. మళ్లీ అతడు జట్టులోకి రావాలి అంటే కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాలి. ఈ నిబంధనను కిషన్ పాటించలేదు. అందువల్లే అతడిని బీసీసీఐ పక్కన పెట్టిందని తెలుస్తోంది. తాను విపరీతంగా ప్రయాణాలు చేశానని.. అలసటకు గురయ్యానని, విశ్రాంతి కావాలని అప్పట్లో బీసీసీఐ పెద్దలను కిషన్ కోరాడు అలా విశ్రాంతి తీసుకోకుండా దుబాయ్ వెళ్లి పార్టీల్లో పాల్గొన్నారు. ఈ దృశ్యాలు బీసీసీఐ పెద్దల దృష్టికి రావడంతో ఒక్కసారిగా అతని కెరియర్ డోలాయమానంలో పడింది. దేశవాళి క్రికెట్ ఆడాలని సూచించినప్పటికీ కిషన్ ఆ సూచనలను పక్కన పెట్టడం..ఐపీఎల్ కోసం సిద్ధం కావడంతో బీసీసీఐ కాంట్రాక్ట్ నుంచి తొలగించింది.

    కాంట్రాక్ట్ నుంచి తొలగించడంతో కిషన్ తొలిసారిగా స్పందించాడు. “ఇటువంటి పరిణామాల గురించి నేను పెద్దగా ఆలోచించను. నా స్టామినా ఏంటో నిరూపించుకునేందుకే ప్రయత్నిస్తా. ఏమైంది? ఏం జరిగింది? అని చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు బాగుందని నేను చెప్పడం లేదు. కానీ కష్టంగా గడుస్తోంది. గత ఆరు నెలలుగా నేను తీవ్రమైన డిప్రెషన్ కు గురయ్యా. నేను ఉత్తమ ప్రదర్శన చేస్తున్నాను. అయినప్పటికీ రిజర్వ్ బెంచ్ కి పరిమితం కావాల్సి వస్తోంది..ఇలాంటి సమయంలో నన్ను నా కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే అర్థం చేసుకున్నారని” ఇషాన్ వ్యాఖ్యానించాడు..

    ఇషాన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో స్పోర్ట్స్ వర్గాల్లో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. వాస్తవానికి కిషన్ పై ప్రయోగించిన నిబంధనల అస్త్రం..ఇతర ఆటగాళ్ళ పై బీసీసీఐ చూపించలేదని తెలుస్తోంది. కొంత మంది ఆటగాళ్ళ కు వెసలు బాటు ఇవ్వడం బీసీసీఐ కే చెల్లిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి కిషన్ దుబాయ్ వెళ్లినప్పుడు.. బీసీసీఐ గట్టిగా మందలించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.. అప్పుడు అతడిని వదిలేసి.. తీరా ఐపిఎల్ ముందు సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించడంతో బీసీసీఐ విమర్శలు ఎదుర్కొన్నది. ప్రస్తుతం ఇప్పుడు కిషన్ చేసిన వ్యాఖ్యలతో మరింత ఇబ్బందికర పరిస్థితిని చవిచూస్తోంది. మరి బిసిసిఐ వర్సెస్ ఇషాన్ కిషన్ మధ్య కోల్డ్ వార్ కు ఎప్పుడు శుభం కార్డు పడుతుందో వేచి చూడాల్సి ఉంది.