Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో రచయితల కొరత ఉందా..? ఇంతకు ముందులా క్వాలిటీ కథలు ఎందుకు రావడం లేదు…

ఒకప్పుడు ఒక దర్శకుడి దగ్గర ఇద్దరు ముగ్గురు రైటర్లు ఉండేవారు. ఒక స్టోరీని వాళ్లు వెర్షన్స్ లాగా తీసుకొని ముగ్గురు మూడు వెర్షన్స్ రాస్తూ వచ్చేవారు. అలా చేయడం వల్ల ఒక కథ ను వివిధ రకాల ధోరణిలో చూసే అవకాశం ఉంటుంది. ఇక దాంట్లో ఏదైతే బెస్ట్ గా ఉంటుందో ఆ స్క్రిప్ట్ ని తీసుకోవడానికి అవకాశం ఉండేది... కానీ ఇప్పుడు కథ రచయిత, దర్శకుడు ఒక్కడే కావడం వల్ల అతనికి నచ్చినట్టుగా ఒక కథ రాసుకొని అదే సినిమాగా తెరకెక్కిస్తున్నాడు.

Written By: Gopi, Updated On : July 8, 2024 3:05 pm

Tollywood

Follow us on

Tollywood: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి కథలతో సినిమాలు వచ్చేవి. కానీ ప్రస్తుతం ఉన్న రోజుల్లో వస్తున్న సినిమా కథల్లో ఏ మాత్రం వైవిధ్యం లేకుండా దర్శకులు సినిమాలను చేస్తున్నారు. విజువల్ గా సినిమాని ఎంత ఎత్తుకు తీసుకెళ్లిన కూడా అందులో కథ అనేది కీలకపాత్ర వహిస్తూ ఉంటుంది. కాబట్టి అది సరిగ్గా లేకపోతే మాత్రం ఎంత పెద్ద సినిమా అయిన కూడా బోల్తా కొట్టాల్సిందే.

మరి ఇలాంటి సమయంలో మన దర్శక నిర్మాతలు కథల మీద ఎందుకు ఫోకస్ పెట్టడం లేదు. ఇండస్ట్రీలో రచయితల కొరత ఎక్కువగా ఉందా? ఎందుకు ఇలాంటి నాసిరకం కథలతో సినిమాలు వస్తున్నాయి అనే అంశం మీదనే చాలా మంది సినీ మేధావులు చాలా రోజుల నుంచి చర్చలు కొనసాగిస్తున్నారు…

ఇక ఒకప్పుడు ఒక దర్శకుడి దగ్గర ఇద్దరు ముగ్గురు రైటర్లు ఉండేవారు. ఒక స్టోరీని వాళ్లు వెర్షన్స్ లాగా తీసుకొని ముగ్గురు మూడు వెర్షన్స్ రాస్తూ వచ్చేవారు. అలా చేయడం వల్ల ఒక కథ ను వివిధ రకాల ధోరణిలో చూసే అవకాశం ఉంటుంది. ఇక దాంట్లో ఏదైతే బెస్ట్ గా ఉంటుందో ఆ స్క్రిప్ట్ ని తీసుకోవడానికి అవకాశం ఉండేది… కానీ ఇప్పుడు కథ రచయిత, దర్శకుడు ఒక్కడే కావడం వల్ల అతనికి నచ్చినట్టుగా ఒక కథ రాసుకొని అదే సినిమాగా తెరకెక్కిస్తున్నాడు.

దానివల్ల కథల్లో గాని, సీన్స్ లో గాని వైవిధ్యం అయితే కనిపించడం లేదు. ఒక కథ మీద ఇద్దరు, ముగ్గురు రచయితలు వర్క్ చేస్తే కథ అనేది ఫైనల్ గా ది బెస్ట్ అవుట్ ఫుట్ అయితే వస్తుంది. అలా కాకుండా ఒక్కరి వెర్షన్ లో మాత్రం రాస్తే నాసిరకం కథలు వస్తాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… చూడాలి మరి ఇప్పటికైనా మన తెలుగు సినిమాల కథల్ని ఇంకొంచెం బెటర్ మెంట్ చేసి రాయగలుగుతారా లేదా అనేది…