IPL 2024 – CSK : చెన్నై సూపర్ కింగ్స్ గత సీజన్ లో కప్పు కొట్టి తన సత్తా చాటుకుంది. ధోని సారథ్యం లో ఆడుతున్న ఈ టీమ్ ఐపిఎల్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు అత్యుత్తమమైన పర్ఫామెన్స్ ని ఇస్తూ వస్తుంది. ధోని లాంటి ఒక లెజెండరీ కెప్టెన్ ఈ టీమ్ లో ఉండటం ఈ టీమ్ ని ముందు ఉండి నడిపించడం కూడా ఈ టీమ్ కి చాలా వరకు ప్లస్ అవుతుంది…
ఇక ఇది ఇలా ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ చాలా మంచి ప్లేయర్లతో చాలా స్ట్రాంగ్ గా ఉంది. అయినప్పటికీ ఫారన్ ప్లేయర్స్ గా ఎవరెవరిని టీం లోకి తీసుకుంటారనే విషయం మీదనే పలు రకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇక ఇప్పటికే చెన్నై టీమ్ లో చాలా మంది ఫారన్ ప్లేయర్స్ ఉన్నారు. అందులో ప్రధానంగా రచిన్ రవీంద్ర, మెయిన్ అలీ, డారెల్ మిచెల్, మిచెల్ సంట్నార్, డెవిన్ కాన్వే, మతిషా పతిరానా లాంటి స్టార్ ప్లేయర్లు ప్లేయింగ్ 11 లో ఆడటానికి పోటీ పడుతున్నారు. మరి ప్లేయింగ్ 11 లో ఫారన్ ప్లేయర్స్ నలుగురు మాత్రమే ఆడతారు కాబట్టి ఎవరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.
ఇంకా కొంతమంది ఫారన్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ వీళ్ళని దాటుకొని వాళ్లకు అవకాశం రావాలంటే చాలా కష్టం. కాబట్టి వీళ్లల్లో ఎవరికి అవకాశం వస్తుంది అనేది క్లారిటీ లేదు. అయితే వీళ్ళలో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడించే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఆ ప్లేయర్ ఎవరు అనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తానికైతే చెన్నై సూపర్ కింగ్స్ టీం ఎవరికీ అర్థం కాకుండా వ్యూహాలు రచించడంలో ఎప్పుడు ముందుంటుంది.
ఎందుకంటే ఆ టీం కి ఉన్న ప్రధాన బలం ధోని కాబట్టి ఆయనే దగ్గరుండి అన్ని చూసుకుంటాడు. ఒకసారి ధోని డిసైడ్ అయ్యాడు అంటే చెన్నై యాజమాన్యం కూడా అందులో చిన్న మార్పు కూడా చేయదనే విషయం మనకు తెలిసిందే…. అందుకే ధోని ప్లేయింగ్ 11 లో ఎవరిని బరిలోకి దింపుతాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ సీజన్ ధోని కి లాస్ట్ సీజన్ కాబోతుంది అనేది స్పష్టం గా అర్థం అవుతుంది. ఇక మరి ఈసారి కూడా ధోని చెన్నై కి కప్పు అందిస్తాడా లేదా అనేది చూడాలి…అలాగే ఈ సీజన్ లోనే చెన్నై టీమ్ కి ఇక మీదట పర్మనెంట్ కెప్టెన్ గా ఎవరు ఉంటారు అనేది కూడా తెలియాల్సి ఉంది…