https://oktelugu.com/

Odi World Cup 2023: వరల్డ్ కప్ లో సెమీస్ కు చేరే జట్లు ఏవీ.. సెమీస్‌లో భారత్‌ను ఢీ కొనేది ఎవరు..?

టీమ్ లా పరిస్థితి ఇలా ఉంటే నెక్స్ట్ నెంబర్ ఫోర్ పొజిషన్ లో సెమీస్ కి వచ్చే టీమ్ ఏది అనే దానిమీద ఒక క్లారిటీ రావడం లేదు...ఇక ఈ ఒక్క బెర్త్ కోసం దాదాపు 5 టీములు పోటీ పడుతున్నాయి. ఇక అందులో ముఖ్యంగా పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్గనిస్తాన్ టీమ్ లా మధ్య మాత్రం పోటీ విపరీతంగా ఉందనే చెప్పాలి.

Written By: , Updated On : November 7, 2023 / 04:04 PM IST
Odi World Cup 2023

Odi World Cup 2023

Follow us on

Odi World Cup 2023: ప్రస్తుతం 2023 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియన్ టీం వరుసగా 8 మ్యాచ్ లను గెలిచి ఈ టోర్నీ లో సెమీ ఫైనల్ కి క్వాలిఫై అయిన మొదటి టీం గా కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక అందులో భాగంగానే సౌతాఫ్రికా టీం నంబర్ 2 పొజిషన్ లో కొనసాగుతుంది. ఇక నెంబర్ 3 ప్లేస్ లో ఆస్ట్రేలియన్ టీం 10 పాయింట్లతో కొనసాగుతుంది. సౌతాఫ్రికా టీం కూడా అఫీషియల్ గా సెమి ఫైనల్ కీ క్వాలిఫై అయింది.ఇక థర్డ్ పొజిషన్ లో ఉన్న ఆస్ట్రేలియన్ టీం కూడా సెమీ ఫైనల్ కి ఆల్మోస్ట్ క్వాలిఫై అవుతుంది కానీ నెంబర్ 2 పొజిషన్ లో సౌతాఫ్రికా ఉంటుందా, లేదా ఆస్ట్రేలియా ఉంటుందా అనేది తెలియాలంటే ఇంకా ఒక రోజు వెయిట్ చేయాలి…

ఇక ఈ టీమ్ లా పరిస్థితి ఇలా ఉంటే నెక్స్ట్ నెంబర్ ఫోర్ పొజిషన్ లో సెమీస్ కి వచ్చే టీమ్ ఏది అనే దానిమీద ఒక క్లారిటీ రావడం లేదు…ఇక ఈ ఒక్క బెర్త్ కోసం దాదాపు 5 టీములు పోటీ పడుతున్నాయి. ఇక అందులో ముఖ్యంగా పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్గనిస్తాన్ టీమ్ లా మధ్య మాత్రం పోటీ విపరీతంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఈ టోర్నీ లో అందరూ కూడా తనదైన రీతిలో అదరగొడుతున్నారు.

ఇక ఆస్ట్రేలియా తన తదుపరి మ్యాచ్ లను ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ మీద ఆడాల్సి ఉంది. ఇందులో ఏదో ఒక టీమ్ పైన మ్యాచ్ గెలిచిన కూడా ఆస్ట్రేలియా సెమీస్ కి వెళ్తుంది. కానీ నెంబర్ 2 పొజిషన్ లో ఉండాలంటే మాత్రం ఆ రెండు మ్యాచ్ లు గెలవాల్సి ఉంటుంది…

ఇక న్యూజిలాండ్ టీమ్ కి ఒక మ్యాచ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది దాంతో శ్రీలంక మీద ఆడే మ్యాచ్ లో న్యూజిలాండ్ టీమ్ భారీ విజయాన్ని సాధించాలి. లేకపోతే న్యూజిలాండ్ ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది…వీళ్ళు మొదట నాలుగు మ్యాచ్ లు గెలిచి ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్ ల్లో ఓడిపోయారు…దాని వల్లనే వీళ్ల సెమీస్ బెర్త్ అనేది కష్టం గా మారింది.

ఇక పాకిస్థాన్ టీమ్ విషయానికి వస్తే ఈ టీమ్ 8 మ్యాచ్ లు ఆడితే అందులో 4 మ్యాచ్ ల్లో మాత్రమే విజయం సాధించింది. ఇక ఇంగ్లాండ్ తో ఆడాల్సిన ఒక మ్యాచ్ లో పాకిస్థాన్ భారీ విజయం సాధిస్తే పాకిస్థాన్ టీమ్ సెమీస్ కి వెళ్తుంది. లేకపోతే మిగితా జట్ల విజయాల మీద డిపెండ్ అయి ఉంటుంది…

ఇక ఆఫ్గనిస్తాన్ టీమ్ విషయానికి వస్తే ఈ టీమ్ 4 విజయాలను అందుకొని మంచి ఫామ్ లో ఉంది.ఇక ఇలాంటి క్రమంలో అఫ్గాన్ టీమ్ ఆస్ట్రేలియా సౌతాఫ్రికా లా మీద మ్యాచ్ లు ఆడాల్సి ఉంది ఇక ఇలాంటి క్రమంలో ఈ రెండు మ్యాచ్ లు గెలిస్తేనే అఫ్గాన్ సెమీస్ కి చేరుకుంటుంది…

నెదర్లాండ్స్ టీమ్ ని చూసుకుంటే సౌతాఫ్రికా లాంటి పెద్ద టీమ్ ని సైతం మట్టి కరిపించిన నెదర్లాండ్స్ టీమ్ కూడా ఇంగ్లాండ్,ఇండియా మీద ఆడే మ్యాచ్ ల్లో భారీ విజయాలను అందుకోవాల్సి ఉంటుంది…

ఇక మొదటి ప్లేస్ లో ఉన్న టీమ్ నాలుగోవ ప్లేస్ లో ఉన్న టీమ్ తో సెమీస్ లో పోటి పడాల్సి ఉంటుంది.కాబట్టి ఇండియా తో పోటి పడే టీముల్లో పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్గనిస్తాన్ టీములు ఉన్నాయి. వీటిలో ఏ టీమ్ సెమీస్ చేరుకుంటుందొ చూడాలి…