https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: నామినేషన్స్ లో టాప్ కంటెస్టెంట్… షాకింగ్ ఎలిమినేషన్ దిశగా షో!

మిగిలిన ముగ్గురిలో రతిక కి ఎక్కువ ఓట్లు పడటంతో ఆమె నామినేట్ అయింది. దీంతో పదో వారంలో మొత్తం ఐదుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. శివాజి, భోలే షావలి, గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్, రతిక రోజ్ నామినేషన్ లిస్ట్ లో ఉన్నారు.

Written By: , Updated On : November 7, 2023 / 04:02 PM IST
Bigg Boss 7 Telugu

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ పదవ వారం నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఎప్పటిలానే కంటెస్టెంట్స్ మధ్య గొడవలు జరిగాయి. రాజమాతలు అశ్విని, శోభా, ప్రియాంక, రతిక అందరి వాదనలు విన్నారు. తర్వాత వారు ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకుని శివాజీ, భోలే, గౌతమ్ ని నామినేట్ చేశారు. ఇక ప్రిన్స్ యావర్ సరైన కారణం చెప్పలేక తనను తాను సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత అశ్విని, శోభా, రతిక, ప్రియాంక మధ్య నామినేషన్ జరిగింది. శోభా కెప్టెన్ కావడంతో ఆమె నామినేషన్ నుంచి సేఫ్ అయింది.

ఇక మిగిలిన ముగ్గురిలో రతిక కి ఎక్కువ ఓట్లు పడటంతో ఆమె నామినేట్ అయింది. దీంతో పదో వారంలో మొత్తం ఐదుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. శివాజి, భోలే షావలి, గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్, రతిక రోజ్ నామినేషన్ లిస్ట్ లో ఉన్నారు. కాగా సోమవారం రాత్రి 10 .30 నిమిషాలకు ఓటింగ్ లైన్స్ ప్రారంభం అయ్యాయి. తాజా సమాచారం ప్రకారం.. శివాజీ అత్యధిక ఓటింగ్ నమోదు చేసుకుని మొదటి స్థానంలో ఉన్నాడు.

ఆ తర్వాత రెండో స్థానంలో గౌతమ్ కృష్ణ కొనసాగుతున్నాడు. ఇక భోలే ఊహించని విధంగా ఓటింగ్ నమోదు చేసుకుని మూడో ప్లేస్ లో ఉన్నాడు.కాగా టాప్ కంటెస్టెంట్ అయిన యావర్ డేంజర్ జోన్ లో ఉన్నాడు. రతిక ఇంకా యావర్ ఓటింగ్ లో స్వల్ప తేడాతో డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ వారం అందరూ టాప్ కంటెస్టెంట్స్ నామినేషన్ లో ఉండటంతో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది.

కాగా చివరి రెండు స్థానాల్లో ఉన్న రతిక ఇంకా యావర్ డేంజర్ జోన్ లో కొనసాగుతున్నారు. ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. యావర్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గేమ్ బాగా ఆడతాడు కాబట్టి అతనికి ఓట్లు పడే అవకాశం. ఇక రతిక విషయానికి వస్తే ఆమె హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చి చేసిందేమి లేదు.. ముచ్చట్లు చెప్పడం తప్ప. ఈ వారం కూడా అలాగే ఉంటే.. రతిక బ్యాగులు సర్దుకుని బయలుదేరాల్సిందే. ఇక 9వ వారం తేజ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.