Captain Virat Kohli: త్వరలోనే ఇండియన్ క్రికెట్ టీం దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. బీసీసీఐ ఆదేశాల మేరకు చేతన్ శర్మ నేతృత్వంలోనే సెలక్షన్ కమిటీ కొత్త జట్టును ఎంపిక చేయనుంది. కోహ్లీ కెప్టెన్సీపై గత కొంతకాలంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో పర్యటించే జట్టుకు కోహ్లీని కెప్టెన్ గా కొనసాగిస్తారా? లేదా అన్న ఉత్కంఠత నెలకొంది.
కోహ్లీ రికార్డు వ్యక్తిగతంగా బాగున్నప్పటికీ అతడి కెప్టెన్సీలో ఒక్క ఐసీసీ టోర్నమెంట్ కూడా గెలువకపోవడం లోటుగా మారింది. దీంతో అతడిని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించి రోహిత్ శర్మకు కెప్టెన్సీ చేయాలనే డిమాండ్ గత కొంతకాలంగా విన్పిస్తోంది. ఇటీవల టీ-20 వరల్డ్ కప్ లో టీంఇండియా గ్రూప్ దశలోనే వెనుదిరిగిన నేపథ్యంలో ఈ విమర్శలు మరింత ఎక్కువయ్యాయి.
ప్రస్తుతానికి టీంఇండియా వన్డే, టెస్టు జట్టుకు కోహ్లీనే సారథ్యం వహిస్తున్నాడు. న్యూజిల్యాండ్ తో భారత్ ఆడుతున్న జట్టుకు కోహ్లీనే కెప్టెన్ గా ఉన్నాడు. తొలి టెస్టుకు దూరంగా ఉన్న కోహ్లీ సెకండ్ టెస్టుకు అందుబాటులోకి రానున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరింయట్ పుట్టుకురావడంతో ఆ దేశంతో భారత టీం క్రికెట్ ఆడేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుందా? లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.
భారత టీం రాబోయే ఏడు నెలల్లోగా దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ దేశాలో మూడు చొప్పున ఆరు టెస్ట్ మ్యాచులు, తొమ్మిది వన్డేలు ఆడాల్సి ఉంది. అదేవిధంగా వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ లో పాల్గొననుంది. కొన్ని వన్డే మ్యాచులే ఉన్నందున ఆ జట్టుకు కోహ్లీనే కెప్టెన్సీ గా కొనసాగించాలని బీసీసీఐ భావిస్తుందట. అయితే దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
Also Read:‘అయ్యర్’ కోసం అతడిపై వేటు పడనుందా?
అదేవిధంగా 2023లో వన్డే ప్రపంచ కప్ ఉన్న నేపథ్యంలో రోహిత్ కు కొంచెం సమయం ఇచ్చి శక్తివంతమైన జట్టును తయారు చేయాలని బీసీసీఐ భావిస్తుందని సమాచారం. ఈ నేపథ్యంలోనే త్వరలో జరుగబోయే దక్షిణాఫ్రికా పర్యటనలోనూ కోహ్లీనే కెప్టెన్ గా కొనసాగుతారనే చర్చ నడుస్తోంది. దక్షిణాఫ్రికా పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న బీసీసీఐ భారత ప్రభుత్వం అనుమతిస్తే వెళ్లేందుకుగాను ముందుగానే జట్టును ఎంపిక చేయనుంది.
దీంతో ఈ వారంలోనే సెలక్షన్ కమిటీ భేటి అయి దక్షిణాఫ్రికాకు వెళ్లబోయే జట్టును ప్రకటిస్తుందని తెలుస్తోంది. మరీ ఈ జట్టుకు కోహ్లీ కెప్టెన్ గా ఉంటారా? లేదా అన్నది సస్సెన్స్ గా మారితే.. అసలు భారత ప్రభుత్వం దక్షిణాఫ్రికాకు వెళ్లేందుకు టీంఇండియాకు అనుమతి ఇస్తుందా లేదా అనేది ఉత్కంఠతను రేపుతోంది.
Also Read: కీలక ప్లేయర్ ను ఎందుకు తప్పించినట్లు?