Balayya: హీరోలూ బాలయ్యను చూసి నేర్చుకోండయ్యా !

Balayya: ఈ రోజు ‘తెలుగు సోషల్ మీడియా’ మొత్తం బాలయ్య వార్తాలతో నిండిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోని థియేట‌ర్ల‌ దగ్గర బాల‌య్య ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకుంటున్నారు. థియేట‌ర్ల వ‌ద్ద బాల‌య్య క‌టౌట్ల‌కు హార‌తులు ఇస్తున్నారు. ఇక వాటికీ తగ్గట్టుగానే ‘అఖండ’ అఖండమైన విజయం సాధించింది. సరే సినిమా సంగతి పక్కన పెడితే.. అసలు బాలయ్య ఏమిటి ? స్క్రీన్ మీద ఉంది నిజంగానే బాలయ్యేనా ? బాలయ్య బాబు సూపర్ హీరో కాదు, కానీ ఏ సూపర్ హీరో […]

Written By: Shiva, Updated On : December 2, 2021 5:47 pm
Follow us on

Balayya: ఈ రోజు ‘తెలుగు సోషల్ మీడియా’ మొత్తం బాలయ్య వార్తాలతో నిండిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోని థియేట‌ర్ల‌ దగ్గర బాల‌య్య ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకుంటున్నారు. థియేట‌ర్ల వ‌ద్ద బాల‌య్య క‌టౌట్ల‌కు హార‌తులు ఇస్తున్నారు. ఇక వాటికీ తగ్గట్టుగానే ‘అఖండ’ అఖండమైన విజయం సాధించింది. సరే సినిమా సంగతి పక్కన పెడితే.. అసలు బాలయ్య ఏమిటి ? స్క్రీన్ మీద ఉంది నిజంగానే బాలయ్యేనా ?

Balayya

బాలయ్య బాబు సూపర్ హీరో కాదు, కానీ ఏ సూపర్ హీరో అయినా బాలయ్యకి పోటీ రాగలడా ?, అలాగే బాలయ్య యంగ్ హీరో కూడా కాదు, కానీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న ఏ యంగ్ హీరో అయినా బాలయ్యతో పోటీ పడగలడా ? సూపర్ మ్యాన్ లా ఆ యాక్షన్ స్పీడ్ ఏమిటి ? బాట్మాన్ లా ఆ యుద్ధం ఏమిటి ? అసలు స్పైడర్ మాన్ లా ఆ విన్యాసాలు ఏమిటి ?

యాక్షన్ సీక్వెన్స్ లో బాలయ్య చేసిన హార్డ్ వర్క్ బహుశా ఇప్పుడు ఉన్న ఏ హీరో చేయలేడు ఏమో. భారీ భారీ ఫైట్స్ లో చేసేటప్పుడు చాలా సమస్యలు వస్తాయి. ఒక్కోసారి పెద్ద ప్రమాదాలు కూడా జరుగుతాయి. ప్రస్తుతం బాలయ్య చేతికి ఉన్న కట్టు.. ఆ ప్రమాదం తాలూకు గుర్తే. అయినా చేస్తోన్న పని కోసం ప్రాణం పెట్టడం అంటే.. ఒక్క బాలయ్యకే చెల్లింది. అన్నట్టు.. ‘అఖండ’లో బాలయ్య ఒక్క యాక్షన్ కే పరిమితం కాలేదు.
Also Read: బాలయ్య ఊపు తెచ్చాడు.. బాక్సాఫీస్ ను ఊపేశాడు !

అదిరిపోయే మాస్ స్టెప్స్ కూడా వేశాడు. అరవై ఏళ్ల వయసులో సినిమా కోసం బాలయ్య పడుతున్న కష్టం చూస్తే.. ఎంతో గొప్పగా అనిపిస్తోంది. యంగ్ హీరోలు పరాయి భాషల వాళ్ళను చూసి మేము ఎంతో నేర్చుకున్నాం అని గొప్పలు చెబుతారు గానీ, వాళ్లంతా బాలయ్య బాబును చూసి నేర్చుకుంటే గొప్ప హీరోలు అవుతారు.

బాలయ్యను చూసి సినిమా కోసం ఎంత కష్టపడాలో నేర్చుకోవచ్చు. డిమాండ్ ఉంది కదా అని.. నిర్మాతల భయపడేలా రెమ్యునరేషన్ ను పెంచకుండా న్యాయంగా ఎలా ఉండాలో నేర్చుకోవచ్చు. షూటింగ్ అంటే రెండు గంటలు లేటుగా వచ్చే హీరోలంతా.. షూటింగ్ కి అర్ధగంట ముందు ఎలా రావాలో నేర్చుకోవచ్చు. అన్నిటికి మించి ఎలా నిబద్దత ఉండాలో.. ఎలా క్రమశిక్షణతో ఉండాలో బాలయ్యను చూసి మరెంతో నేర్చుకోవచ్చు. హీరోలూ బాలయ్య బాబును చూసి నేర్చుకోండి.

Also Read: ‘అఖండ’ విజయం టాలీవుడ్ కి ఊపు తెచ్చిందా?

Tags