Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా రిలీజ్ ల హడావుడి కనిపిస్తుంది. నేటి నుండి మొదలైన పెద్ద సినిమాల రిలీజ్ పరంపర ఇలాగే మరో మూడు నాలుగు నెలల పాటు వరసగా కంటిన్యూ కానుంది. మరో పక్క టాప్ చిత్రాలు అన్నీ విడుదలకు ముస్తాబు అవుతున్నాయి. ఇక ఇప్పటికే విడుదలకు సిద్ధమైన పుష్ప, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ చిత్రాలు ప్రమోషన్స్ వేటలో పడ్డాయి.

ఎలాగూ నేడు అఖండతో టాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ అయింది. జనం జాతరకు వచ్చినట్లు థియేటర్స్ ముందు భారీగా పోటెత్తారు. కాబట్టి.. ఈ జన ప్రభంజనం ఇలాగే కొనసాగనుంది. ఇప్పటికే భారీ చిత్రాలు సంక్రాంతికి రిలీజ్ అవ్వడానికి పీక్స్ అయ్యాయి కాబట్టి.. ఇప్పుడు చిన్నాచితకా సినిమాలను జనవరి ఎండింగ్ లో రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఆ సినిమాల లిస్ట్ లో మీడియం రేంజ్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. మొత్తానికి అఖండ రిజల్ట్ మిగిలిన సినిమా వాళ్లల్లో కూడా ఊపు తీసుకొచ్చింది. ఇక బాలకృష్ణ వన్ మేన్ షోనే ఈ స్థాయిలో ఉంటే.. ఇక ఎన్టీఆర్ – చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా పరిస్థితి ఏమిటి ? అసలుకే రాజమౌళి చూపించే ఎమోషన్స్, విజువల్స్ అద్భుతంగా ఉంటాయి.
అలాగే ఎన్టీఆర్ పలికే సంభాషణలు, చరణ్ చేసే విన్యాసాల గురించి కొత్తగా చెప్పేది ఏముంది ? అందుకే, ఈ సినిమా ప్రమోషన్స్ ను ఓ రేంజ్ లో ప్లాన్ చేయాలని రాజమౌళి గట్టిగా ప్లాన్ చేశారు. ఎలాగూ ఏపీలో టికెట్ రేట్లును దారుణంగా తగ్గించారు కాబట్టి.. అందర్నీ థియేటర్ కి తీసుకొచ్చే బాధ్యతను రాజమౌళి తన తలకెత్తుకున్నాడు.
Also Read: Balayya: బాలయ్య ఊపు తెచ్చాడు.. బాక్సాఫీస్ ను ఊపేశాడు !
ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేయడంతో పాటు బీసీ ఆడియన్స్ కు కూడా సినిమాను చేరువ చేయడానికి రాజమౌళి పర్ఫెక్ట్ బీసీ ఆడియన్స్ కోసం ప్రమోషన్స్ ను డిజైన్ చేశాడు. వచ్చే వారం నుంచి ఆ ప్రమోషన్స్ మొదలు కానున్నాయి. జనవరి 7న ఆర్ఆర్ఆర్ విడుదలకు సిద్ధమవుతోంది. కరెక్ట్ గా నెల రోజులు ఉంది. అందుకే, ఈ నెల రోజులను బాగా వాడుకోవాలన్నదే రాజమౌళి తాపత్రయం.
Also Read: Manchu Vishnu: ఇక్కడే ఏమి చేయలేని విష్ణు ఇక అక్కడేం చేస్తాడు ?