Hardik Pandya: టీమిండియా లోకి ఆ స్టార్ ఆల్ రౌండర్ ఎంట్రీ ఎప్పుడంటే..?

ఇండియన్ టీం లో బెస్ట్ ఆల్ రౌండర్ గా గుర్తింపు పొందిన హార్దిక్ పాండ్య రాబోతున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. వన్డే వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ తో ఆడిన మ్యాచ్ లో హార్దిక్ పాండ్య గాయం కారణంతో వరల్డ్ కప్ నుంచి వైదొలిగాడు.

Written By: Gopi, Updated On : December 25, 2023 10:49 am

Hardik Pandya

Follow us on

Hardik Pandya: ఇండియన్ టీమ్ గత కొన్ని రోజుల నుంచి తమదైన ఇన్నింగ్స్ లను ఆడుతూ వరుస సిరీస్ లను కైవసం చేసుకుంటూ వస్తుంది. ఇక అందులో భాగంగానే జనవరి 11 నుంచి ఆఫ్గానిస్తాన్ తో జరగాల్సిన టి20 సీరీస్ కోసం ఇండియన్ టీం లో బెస్ట్ ఆల్ రౌండర్ గా గుర్తింపు పొందిన హార్దిక్ పాండ్య రాబోతున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. వన్డే వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ తో ఆడిన మ్యాచ్ లో హార్దిక్ పాండ్య గాయం కారణంతో వరల్డ్ కప్ నుంచి వైదొలిగాడు.

ఇక అప్పటినుంచి ఇప్పటివరకు కూడా ఆయన గాయం నుంచి సరిగ్గా కొలుకొకపోవడం లేదు దానివల్లే అతను ఎప్పుడు రికవరీ అయి ఇండియన్ టీం లోకి వస్తాడు అని ఇండియన్ టీం అభిమానులందరూ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే బీసీసీఐ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఆయన ఆఫ్గాన్ తో ఆడే సీరీస్ లో ఇండియన్ టీం లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ ఒక మంచి న్యూస్ చెప్పడంతో హార్దిక్ పాండ్య అభిమానులు అందరూ పండగ చేసుకుంటున్నారు…

ఇక ఇది ఇలా ఉంటే ఐపీఎల్ లో ఇప్పటికే రెండుసార్లు గుజరాత్ టీం ని ఫైనల్ కి తీసుకెళ్లిన హార్దిక్ పాండ్య ఒకసారి ఆ టీం కి కప్పుని తీసుకొచ్చి పెట్టాడు. ఇక ఇప్పుడు హర్ధిక్ పాండ్య ని ట్రేడింగ్ విధానం ద్వారా ముంబై ఇండియన్స్ టీం కొనుగోలు చేసింది. దాంతో ముంబై ఇండియన్స్ టీం కి 2024 సీజన్ నుంచి పాండ్య కెప్టెన్ గా వ్యవహరిస్తాడు అంటూ ముంబై యాజమాన్యం తెలియజేసింది. దాంతో పెద్ద ఎత్తున ముంబై యాజమాన్యం పైన విమర్శలు కూడా వెలువెత్తాయి. ఎందుకంటే రోహిత్ శర్మ లాంటి ఒక దిగ్గజ కెప్టెన్ ని పక్కన పెట్టి హార్దిక్ పాండ్య ని కెప్టెన్ గా చేయడం పట్ల పలువురు క్రికెట్ మేధావులు సైతం ముంబై ఇండియన్స్ టీమ్ పైన నెగిటివ్ కామెంట్స్ చేశారు.

ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా తెలిసిన విషయం ఏంటంటే హార్దిక్ పాండ్య 2024 ఐపీఎల్ కి అందుబాటులో ఉండటం లేదు అనే విషయాలు బాగా ప్రచారం అయ్యాయి.ఇక అందులో ఎంత మాత్రం నిజం లేదు అన్నట్టుగా ప్రస్తుతం ఆయన జనవరి నుంచి ఇండియన్ టీమ్ లో కంటిన్యూ అవ్వబోతున్నాడు అంటూ మరికొన్ని వార్తలైతే వస్తున్నాయి. చూడాలి మరి హార్దిక్ పాండ్య రీ ఎంట్రీ ఇండియన్ టీం లో ఎప్పుడు ఉంటుందో…