Animal OTT: కొత్త సీన్స్ తో ఓటీటీలో యానిమల్… ఇంకెంత అరాచకం దాగుందో?

యానిమల్ మూవీలో వైలెన్స్, అడల్ట్ కంటెంట్ పరిమితికి మించి ఉంది అన్నది నిజం. యానిమల్ మూవీపై పార్లమెంట్ వేదికగా చర్చ జరిగింది. ఓ మహిళా ఎంపీ యానిమల్ చిత్ర కంటెంట్ ని తీవ్రంగా ఖండించింది.

Written By: NARESH, Updated On : December 25, 2023 10:09 am

Animal OTT

Follow us on

Animal OTT: 2023లో యానిమల్ ఓ సెన్సేషన్. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. రూ. 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే రూ. 800 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ వసూళ్లు రాబట్టింది. టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా ఆడింది. ఈ సినిమా విషయంలో ప్రేక్షకులు, క్రిటిక్స్ రెండు భిన్నాభిప్రాయాలు వెల్లడించారు. ఒకరు అద్భుతంగా ఉంది అంటే… మరొకరు చెత్త సినిమా అన్నారు. ఒక సినిమాపై ఇలాంటి విరుద్ధమైన అభిప్రాయాలు అరుదుగా వినిపిస్తాయి.

యానిమల్ మూవీలో వైలెన్స్, అడల్ట్ కంటెంట్ పరిమితికి మించి ఉంది అన్నది నిజం. యానిమల్ మూవీపై పార్లమెంట్ వేదికగా చర్చ జరిగింది. ఓ మహిళా ఎంపీ యానిమల్ చిత్ర కంటెంట్ ని తీవ్రంగా ఖండించింది. నెగిటివ్ పబ్లిసిటీ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. కాగా యానిమల్ మూవీ ఓటీటీ విడుదలకు రంగం సిద్ధం అవుతుంది. విడుదలై నాలుగు వారాలు ముగియగా, వసూళ్లు కూడా చివరి దశకు చేరుకున్నాయి.

దీంతో ఒప్పందం ప్రకారం యానిమల్ డిజిటల్ స్ట్రీమింగ్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. యానిమల్ చిత్ర డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ భారీ ధర చెల్లించి దక్కించుకున్నట్లు సమాచారం. డిసెంబర్ 26 నుంచి ఓటీటీలో అందుబాటులోకి రానుందట. కాగా యానిమల్ మూవీ పూర్తి నిడివి మూడున్నర గంటలట. 9 నిమిషాలు తగ్గించి థియేటర్స్ లో విడుదల చేశారు. ఇప్పుడు ఎడిట్ చేసిన ఆ సన్నివేశాలు కూడా కలిపి ఓటీటీలో రిలీజ్ చేశారట.

ఎడిట్ చేసి తీసేసిన ఆ సన్నివేశాల్లో ఇంకెంత అరాచకం ఉందో అనే చర్చ నడుస్తుంది. యానిమల్ చిత్రంలో రన్బీర్ కపూర్ వైలెంట్ రోల్ చేశారు. జంటగా రష్మిక మందాన నటించింది. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక రోల్స్ చేశారు. సందీప్ రెడ్డి వంగ ఈ చిత్ర నిర్మాత కూడాను. భూషణ్ కుమార్ కి సందీప్ రెడ్డి నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు.