https://oktelugu.com/

Paris Olympics 2024 : ఓటముల మీద ఓటములు.. నాలుగో మెడల్ ఎప్పుడు దక్కుతుందో?

ఒలింపిక్స్ లో షూటింగ్ విభాగంలో భారతదేశానికి నాలుగవ మెడల్ కూడా రావాల్సి ఉండేది. అయితే మహేశ్వరి చౌహన్, అనంత్ జీత్ సింగ్ ద్వయం వెంటనే పోగొట్టుకుంది. స్కీట్ మిక్స్ డ్ విభాగంలో కంచు మెడల్ కోసం జరిగిన పోటీలో ఒక్క పాయింట్ తేడాతో ఈ ద్వయం ఓడిపోయింది. నాలుగో స్థానంతో సరిపుచ్చుకుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 6, 2024 / 01:16 PM IST
    Follow us on

    Paris Olympics 2024 : షూటింగ్ లో మను భాకర్, స్వప్నిల్, సరబ్ జ్యోత్ వల్ల మూడు మెడల్స్ వచ్చాయి..మను అద్భుతమైన ప్రతిభ వల్ల భారత్ ఒలింపిక్స్ లో కాస్తలో కాస్త పరువు దక్కించుకుంది. ఇదే సమయంలో మెడల్స్ సాధిస్తారని అంచనాలు వేసుకున్న ఆటగాళ్లు మొత్తం ఓడిపోయి ఇంటి బాట పట్టారు. ఇంకా కొంతమంది మెడల్ కు అడుగు దూరంలో నిలిచిపోయారుఅడుగు దూరంలో నిలిచిపోయారు.. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ నాలుగో మెడల్ ఎప్పుడు సాధిస్తుంది? సాధించేందుకు అర్హత ఉందా? ఎలాంటి క్రీడల్లో మెడల్స్ వస్తాయని భావించవచ్చు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం. వరుసగా నాలుగో రోజు కూడా నిరాశ మిగలడంతో భారత్ నాలుగో పతకం ఎప్పుడు సాధిస్తుందనే ఉత్కంఠ అందరిలోనూ పెరిగిపోయింది. ముఖ్యంగా సోమవారం రెండు మెడల్స్ వెంట్రుక వాసి దూరంలో నిలిచిపోవడంతో అభిమానుల గుండెలు పలికాయి. ఆ మెడల్స్ అందినట్టే అంది చేజారిపోవడంతో ఆటగాళ్ల ఆశలు ఆవిరయ్యాయి.

    నాలుగో పతకం రావాల్సి ఉండె

    ఒలింపిక్స్ లో షూటింగ్ విభాగంలో భారతదేశానికి నాలుగవ మెడల్ కూడా రావాల్సి ఉండేది. అయితే మహేశ్వరి చౌహన్, అనంత్ జీత్ సింగ్ ద్వయం వెంటనే పోగొట్టుకుంది. స్కీట్ మిక్స్ డ్ విభాగంలో కంచు మెడల్ కోసం జరిగిన పోటీలో ఒక్క పాయింట్ తేడాతో ఈ ద్వయం ఓడిపోయింది. నాలుగో స్థానంతో సరిపుచ్చుకుంది. ఈ జంట 43 పాయింట్లు సాధించింది. యితింగ్ జియాంగ్, జియాలిన్ లియు(చైనా) జంట 44.లతో మెడల్ దక్కించుకుంది. ఇటలీ జట్టు గోల్డ్, అమెరికా రజతం మెడల్స్ సాధించాయి.

    టేబుల్ టెన్నిస్

    టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత మహిళల జట్టు ప్రీ క్వార్టర్స్ పోటీల్లో అడుగుపెట్టింది. ప్రీ క్వార్టర్ ఫైనల్ లో రొమేనియా పై గెలుపును దక్కించుకుంది. ఈ గెలుపులో మనిక ముఖ్యపాత్ర పోషించింది. ఆకుల శ్రీజ – అర్చన కామత్ అదినా, సమార జోడి పై విజయం సాధించారు. ప్రీ క్వార్టర్స్ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు అమెరికా లేదా జర్మనితో పోటీ పడుతుంది.

    ఫైనల్ వెళ్ళాడు..

    పురుషుల 300 మీటర్ల స్టీ పుల్ చేజ్ లో భారత జట్టుకు చెందిన అథ్లెట్ అవినాష్ సాబ్లె ఫైనల్ వెళ్ళాడు. హీట్ లో ఎనిమిది నిమిషాల 15.43 సెకండ్లలో లక్ష్యాన్ని పూర్తి చేశాడు. మొత్తానికి ఐదవ స్థానంలో నిలిచాడు. ప్రతి హీట్ లో తొలి 5 స్థానాలలో నిలిచిన అథ్లెట్లు ఫైనల్ వెళ్లేందుకు అర్హత సాధిస్తారు.. ఒలింపిక్స్ స్టీ పుల్ చేజ్ ఫైనల్ వెళ్లిన తొలి భారత ఆటగాడి సాబ్లె ఘనత సృష్టించాడు.

    ఇక 400 మీటర్ల హీట్ లో భారత రన్నర్ కిరణ్ పాహల్ ఏడవ స్థానంలో నిలిచింది. 52.21 సెకండ్లలో ఆమె టార్గెట్ రీచ్ అయింది. కిరణ్ సెమీఫైనల్ లో స్థానాన్ని దక్కించుకునేందుకు రెపి చేజ్ గ్రౌండ్లో పరిగెత్తాల్సి ఉంది. ఇందులో మొత్తం ఆరు హీట్లుండగా.. ఒక్కో హీట్ లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారు ముందడుగు వేస్తారు. మిగతావారు రెపి చేజ్ గ్రౌండ్లో తలపడాల్సి ఉంటుంది.

    రెజ్లింగ్

    రెజ్లింగ్ లో మహిళల 68 కేజీల ఫ్రీ క్వార్టర్స్ విభాగంలో భారత లేయర్ నిషా దహియ గాయం కారణంగా ఓడిపోవాల్సి వచ్చింది. కుడి చేతికి గాయం కావడంతో ఆమె 8-10 తేడాతో ఉత్తరకొరియా రెజ్లర్ చేతిలో ఓడిపోవలసి వచ్చింది. దీంతో నిషా వెక్కివెక్కి ఏడుస్తూ టోర్నీ నుంచి నిష్క్రమించింది. మ్యాచ్ ప్రారంభం నుంచి దూకుడును ప్రదర్శించింది. అయితే ఆట మరో నిమిషం ఉందనగా ఆమె కుడి చేతికి గాయమైంది. నొప్పితో ఇబ్బంది పడుతూనే ఆడింది. చివరికి ఓటమిపాలైంది. ఈ ఓటమితో ఆమె మ్యాట్ పైనే పడిపోయి వ్యక్తి ఏడ్చింది. నిషా గాయపడిన తీరు చూస్తే 2016లో రియో ఒలింపిక్స్ లో గాయంతో నిష్క్రమించిన వినేష్ ఉదంతం విజ్ఞప్తికి వచ్చింది. ఒకవేళ ఉత్తరకొరియా క్రీడాకారిణి ఫైనల్ చేరితే నిషాకు రెపి చేజ్ ఆడే అవకాశం వస్తుంది. ఆమెకు అయిన గాయం నేపథ్యంలో బలిలోకి దిగేది అనుమానంగానే ఉంది.