CM Chandhrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పాలన ప్రారంభించి దాదాపు రెండు నెలలు అవుతోంది. ఒకవైపు పాలన సాగిస్తూనే సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టింది చంద్రబాబు సర్కార్. అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టింది. కేంద్ర ప్రభుత్వం నుంచి సైతం 15 వేల కోట్ల రూపాయలు రానుంది. రాష్ట్రవ్యాప్తంగా మౌలిక వసతులు కల్పనకు సంబంధించి ప్రత్యేక ప్రాజెక్టులు సైతం మంజూరయ్యాయి. వెనుకబడిన జిల్లాల నిధుల రాక సైతం ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో యంత్రాంగం పాత్ర కీలకంగా మారనుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయంలో చంద్రబాబు సొంత టీం ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో పాటు సీఎంఓలో కీలక అధికారుల భర్తీ జరిగిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చారు. ఈ తరుణంలో అధికారులకు కొత్త టాస్క్ ఇచ్చారు చంద్రబాబు. అయితే గత ఐదేళ్లుగా లేని పరిణామాలు చోటు చేసుకోవడంతో కలెక్టర్లు సైతం ఖుషి అయ్యారు. పాలనలో రాజకీయ జోక్యం లేకుండా చేస్తానని.. కలెక్టర్లకు హామీ ఇచ్చారు చంద్రబాబు. దీంతో వారిలో ఒక రకమైన ఆనందం కనిపిస్తోంది. అయితే తాజాగా చంద్రబాబు కలెక్టర్లను ఉద్దేశించి సుదీర్ఘంగా మాట్లాడారు. ఆయన చెప్పిన విషయాలు విని 26 జిల్లాలకు చెందిన కలెక్టర్లు ఒక్కసారిగా ఆశ్చర్య వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో ఎన్నడూ వినని.. ఎప్పుడూ ఊహించని విధంగా నిర్ణయాలు, సూచనలు, దిశా నిర్దేశాలు ఉండడంతో వారు ఆలోచనలో పడ్డారు.
* చాన్నాళ్లకు ఈ ఆఫ్ డూయింగ్
ప్రధానంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట వినిపించింది. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు తరచూ ఈ పదాన్ని ఎక్కువగా ప్రయోగించేవారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో సీఎంగా ఉన్న జగన్ ఈ తరహా వ్యాఖ్యలు చేయలేదని, ఇటువంటి పదప్రయోగం సైతం చేయలేదని గుర్తు చేస్తున్నారు కలెక్టర్లు. చంద్రబాబు నుంచి ఈ తరహా కామెంట్స్ వినిపించడంతో.. రెట్టింపు ఉత్సాహంతో పని చేయాల్సి ఉంటుందని ఒక అభిప్రాయానికి వచ్చారు.పెట్టుబడులు పెట్టే వారికి డూయింగ్ బిజినెస్ పాలసీని మళ్లీ తీసుకొస్తామని చంద్రబాబు ప్రకటించారు.దీంతో కలెక్టర్లు మరోసారి పాత రోజుల్లోకి వెళ్లిపోయారు. అప్పట్లో చంద్రబాబు వ్యవహార శైలిని గుర్తు చేసుకున్నారు.
* గత ఐదేళ్లుగా అలా
గత ఐదేళ్లలో కలెక్టర్లు అంటే.. తాము చెప్పిన నిర్ణయాలు అమలు చేసేవారన్న రీతిలో వైసీపీ ప్రజాప్రతినిధులు వ్యవహరించేవారు. తమ ఆదేశాలను పాటించే వారికి అందలం ఎక్కించడం.. తప్పు పట్టే వారిని పక్కకు తప్పించడం ఆనవాయితీగా మారింది. అప్పట్లో కలెక్టర్ల పనితీరు పై దృష్టి పెట్టిన వారు కూడా లేరు. ఆ అవసరం కూడా లేదు. కేవలం తమ అస్మదీయులు అయితే నెత్తిన పెట్టుకోవడం.. లేకుంటే పోస్టింగ్ లేకుండా చేయడం అన్నది చేసేవారు. కానీ చంద్రబాబు మాత్రం ఇప్పుడు పనితీరు మదింపు పెడతామని చెబుతుండడాన్ని కలెక్టర్లు ఆహ్వానిస్తున్నారు.
* కలెక్టర్లకు కొత్త భరోసా
కొన్ని విషయాల్లో రాజకీయ జోక్యం లేకుండా చూస్తామని.. పాలన సజావుగా నడిపించే బాధ్యత కలెక్టర్ల దేనని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఈ పరిణామాన్ని సైతం కలెక్టర్లు ఆహ్వానిస్తున్నారు. అయితే చంద్రబాబు తాను మారానని కూడా చెప్పుకొచ్చారు. 1995 నాటి సీఎంను చూస్తారంటూ వ్యాఖ్యానించినప్పుడు ఆశ్చర్యపడ్డారు. పనితీరును ఎప్పటికప్పుడు అంచనా వేయడంలో అప్పట్లో చంద్రబాబు ముందు ఉండేవారు. పనిచేసే కలెక్టర్లకు సైతం అప్పట్లో ప్రత్యేక గుర్తింపు లభించేది. ఇప్పుడు కూడా చంద్రబాబు అదే ఫార్ములాను అనుసరిస్తే కలెక్టర్లు పోటాపోటీగా పోటీ చేసే పరిస్థితి ఉంటుంది.