https://oktelugu.com/

ఐపీఎల్ వేళాయే.. రేపటి నుంచి క్రికెట్ పండుగ

దేశంలో కరోనా ఎఫెక్ట్.. లాక్డౌన్ కారణంగా అన్నిరంగాలు కుదేలయ్యాయి. క్రీడారంగం కూడా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. కొద్దిరోజులుగా ఆటలన్నీ నిలిచిపోయింది. దీంతో షెడ్యూల్ ప్రకారంగా జరగాల్సిన ఐపీఎల్ కూడా వాయిదా పడింది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఐపీఎల్ తేదిలు వాయిదా పడుతూ వచ్చాయి. దీంతో ఈసారి ఐపీఎల్ ఉంటుందా? ఉండదా? అనే అనుమానాలు క్రికెట్ అభిమానుల్లో నెలకొన్నాయి. అయితే ఎట్టకేలకు బీసీసీఐ ఐపీఎల్ కొత్త తేదిలను ఖరారు చేయడంతో క్రికెట్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. క్రికెట్ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 18, 2020 / 08:34 PM IST
    Follow us on


    దేశంలో కరోనా ఎఫెక్ట్.. లాక్డౌన్ కారణంగా అన్నిరంగాలు కుదేలయ్యాయి. క్రీడారంగం కూడా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. కొద్దిరోజులుగా ఆటలన్నీ నిలిచిపోయింది. దీంతో షెడ్యూల్ ప్రకారంగా జరగాల్సిన ఐపీఎల్ కూడా వాయిదా పడింది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఐపీఎల్ తేదిలు వాయిదా పడుతూ వచ్చాయి. దీంతో ఈసారి ఐపీఎల్ ఉంటుందా? ఉండదా? అనే అనుమానాలు క్రికెట్ అభిమానుల్లో నెలకొన్నాయి. అయితే ఎట్టకేలకు బీసీసీఐ ఐపీఎల్ కొత్త తేదిలను ఖరారు చేయడంతో క్రికెట్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.

    క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఈనెల 19నుంచే ఐపీఎల్ తొలి మ్యాచ్ ప్రారంభం కానుందని బీసీసీఐ ప్రకటించడంతో ఐపీఎల్ నిర్వహణపై ఉత్కంఠత వీడింది. ఐపీఎల్ 13 సీజన్ దాదాపు 46రోజులపాటు సాగనుండటం గమనార్హం. మొత్తం 56 మ్యాచులు నిర్వహించేందుకు నిర్వహాకులు ప్లాన్ చేశారు. అయితే ఫ్లే ఆఫ్ మ్యాచ్‌లతోపాటు ఫైనల్ వేదికలను బీసీసీఐ ఇంకా ప్రకటించాల్సి ఉంది.

    ఐపీఎల్ సంప్రదాయం ప్రకారం గత సీజన్లో విన్నర్.. రన్నరప్ గా నిలిచే జట్ల మధ్య తొలి మ్యాచ్ నిర్వహించేందుకు రెడీ అయింది. ఈనెల 19న డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్.. రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తొలి మ్యాచ్ జరుగనుంది. అబుదాబి వేదికగా తొలి మ్యాచ్ జరుగనుంది. ఎడాది దేశంలోనే మొత్తం మ్యాచులన్నీ నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేసింది. దుబాయ్‌లో 24.. అబుదాబిలో 20, షార్జాలో 12మ్యాచులను నిర్వహించేలా బీసీసీఐ ఏర్పాట్లు చేసింది.

    ఐపీఎల్ లో రెండేసి మ్యాచ్‌లున్న రోజుల్లో తొలి మ్యాచ్ మధ్యాహ్నం 3.30గంటలకు ప్రసారం కానుంది. రాత్రి మ్యాచులు 8గంటలకు బదులుగా 7.30గంటలకే ప్రారంభం కానున్నాయి. తొలి మ్యాచ్ ఈనెల 19న ముంబై ఇండియన్స్-చైన్నె సూపర్ కింగ్స్ మధ్య రాత్రి 7:30గంటలకు ప్రారంభం కానుంది. 20న ఢిల్లీ క్యాపిటల్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. 21న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య హోరాహోరీ ఫైట్ జరుగనుంది. రేపటి నుంచే ఐపీఎల్ ప్రారంభం కానుండటంతో క్రికెట్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.