వాళ్లు దరిద్రులంటూ వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కు కాలం కలిసి రావట్లేదు. ఒకవైపు ప్రభుత్వ నిర్ణయాలకు కోర్టుల్లో మొట్టికాయలు తగులుతోంటే మరోవైపు ఏపీలో దేవాలయాలకు రక్షణ లేదంటూ ఇతర పార్టీలకు చెందిన నేతల నుంచి వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతర్వేది ఘటన, విజయవాడ కనకదుర్గమ్మ ఘటన ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం ఎంత సమర్థించుకున్నా ప్రజల్లో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. Also Read : ఈ వైసీపీ ఎంపీ మాటలు భలే ఉన్నాయే..? అయితే వైసీపీ […]

Written By: Navya, Updated On : September 19, 2020 9:38 am
Follow us on

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కు కాలం కలిసి రావట్లేదు. ఒకవైపు ప్రభుత్వ నిర్ణయాలకు కోర్టుల్లో మొట్టికాయలు తగులుతోంటే మరోవైపు ఏపీలో దేవాలయాలకు రక్షణ లేదంటూ ఇతర పార్టీలకు చెందిన నేతల నుంచి వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతర్వేది ఘటన, విజయవాడ కనకదుర్గమ్మ ఘటన ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం ఎంత సమర్థించుకున్నా ప్రజల్లో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Also Read : ఈ వైసీపీ ఎంపీ మాటలు భలే ఉన్నాయే..?

అయితే వైసీపీ నేతలు మాత్రం విమర్శలు చేసిన వాళ్లపై ఎదురుదాడికి దిగుతున్నారు. తాజాగా ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శలు చేసిన వాళ్లపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. దేవుళ్లపై రాజకీయాలు చేయడం ఇతర పార్టీలకు తగదని… దేవుళ్లపై రాజకీయాలు చేసేవాళ్లు దరిద్రులు అని అన్నారు. శ్రీవారి దర్శనం తరువాత జగన్ పాదయాత్ర మొదలైందని… జగన్ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.

జగన్ పాదయాత్ర తరువాత కూడా తిరుమలకు వచ్చారని చెవిరెడ్డి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. జగన్ ఆలయాల విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. టీటీడీ ఆదాయం, ఆస్తుల విషయంలో వైసీపీ పారదర్శకంగా వ్యవహరిస్తోందని… ఇలాంటి పార్టీపై ఆరోపణలు చేయడం తగదని చెవిరెడ్డి అన్నారు. వైవీ సుబ్బారెడ్డికి ఉన్న భక్తిలో దేవుడిపై పది శాతం కూడా చంద్రబాబుకు భక్తి ఉండదని అన్నారు. ఆలయాల ఘటనల విషయంలో దోషులు ఎవరైనా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలదని… తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. దేవుళ్లను అడ్డు పెట్టుకొని దుర్మార్గపు రాజకీయాలు చేయరాదని చెవిరెడ్డి హితవు పలికారు.

Also Read : వైసీపీ ఎమ్మెల్యేకు కోర్టు షాక్… కేసు పెట్టాలని ఆదేశాలు..?