తెలంగాణ మహిళలకు కేసీఆర్ సర్ ప్రైజ్

 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వమే బతుకమ్మ, దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతీయేటా ప్రభుత్వం ఆడపడుచులందరికీ బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోంది. కిందటేడాది మాదిరిగానే ఈసారి కూడా సిరిసిల్ల నేతన్నలే బతుకమ్మ చీరలను నేస్తున్నారు. అనుకున్న సమయానికి బతుకమ్మ చీరలను తయారు చేసేందుకు నేతలు రేయింబవళ్లు కష్టపడుతున్నారు. దేశంలో కరోనా ఎఫెక్ట్.. లాక్డౌన్ వల్ల నేతలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ పండుగ సమయానికి బతుకమ్మ చీరలు పూర్తి […]

Written By: NARESH, Updated On : September 18, 2020 8:30 pm
Follow us on

 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వమే బతుకమ్మ, దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతీయేటా ప్రభుత్వం ఆడపడుచులందరికీ బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోంది. కిందటేడాది మాదిరిగానే ఈసారి కూడా సిరిసిల్ల నేతన్నలే బతుకమ్మ చీరలను నేస్తున్నారు. అనుకున్న సమయానికి బతుకమ్మ చీరలను తయారు చేసేందుకు నేతలు రేయింబవళ్లు కష్టపడుతున్నారు.

దేశంలో కరోనా ఎఫెక్ట్.. లాక్డౌన్ వల్ల నేతలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ పండుగ సమయానికి బతుకమ్మ చీరలు పూర్తి చేయాలని లక్ష్యంతో నేతలు పనులు చేస్తున్నారు. ఇప్పటికే 85 లక్షల చీరలను నేతలను నేసి ప్రభుత్వానికి అప్పగించినట్లు సమాచారం. మరో 15 లక్షల చీరలు చివరి దశలో ఉన్నాయి. ఈసారి చీరలకు బంగారం, వెండి రంగుల జరీలను కలుపుతూ క్వాలిటీ చీరలను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు చీరల క్వాలిటీపై నేతన్నలు సూచనలు చేస్తున్నారు.

బతుకమ్మ చీరలు 220 వైరటీల్లో నాణ్యమైన, ఆకర్షణీయమైన రంగుల్లో చీరలు రూపొందుతున్నాయి. వీటిలో 10గజాల చీరలు 10లక్షలు ఉండగా.. మిగిలినవి 5.50మీటర్ల చీరె, 85సెం.మీ జాకెట్ వస్త్రాన్ని ఆడపడచుకులకు ప్రభుత్వం తరఫున అందించనుంది. ఇప్పటికే సుమారుగా 5కోట్ల మీటర్ల వస్త్రాన్ని నేచిన నేతన్నలు వాటిని చీరలుగా మర్చారు. ఇంకా 2కోట్ల మీటర్ల చీరలను సిద్ధం చేస్తున్నారు.

ఇప్పటికే నేతలు సిద్ధం చేసిన బతుకమ్మ చీరలను ప్రభుత్వం అన్ని జిల్లాలకు పంపిణీ చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. సెప్టెంబర్ చివరి నాటిని బతుకమ్మ చీరలను అర్హులైన వారందరికీ అందించనుంది. 18ఏళ్లు నిండి.. తెల్లరేషన్ కార్డు కలిగిన ఆడపచులందరికీ బతుకమ్మ చీరలను పంపిణీ ప్రభుత్వం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.