https://oktelugu.com/

Pak vs Eng: పాక్ కు గురించి చెప్పడానికి ఏముంది? బంగ్లా పై ఓడిన ఆ జట్టుకు.. మరో పరాభవం కాచుకొని ఉంది.

మొన్ననే స్వదేశంలో బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను 2-0 తేడాతో కోల్పోయింది. అనేక విమర్శలను మూటగట్టుకుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టు ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సింది పోయి.. మళ్లీ అవే తప్పులు చేస్తోంది.

Written By:
  • Neelambaram
  • , Updated On : October 10, 2024 / 09:47 PM IST
    Follow us on

    Pak vs Eng: ముల్తాన్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ లో పాకిస్తాన్ జట్టు ఓటమి అంచున నిలిచింది. బంగ్లాదేశ్ జట్టుతో 2-0 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన పాకిస్తాన్.. ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ లోనూ అదే స్థాయిలో ఆటతీరు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే తొలి టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ లో సగానికి పైగా వికెట్లను చేజార్చుకుంది. ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో హ్యారీ బ్రూక్(317), జో రూట్(262) మైదానంలో విధ్వంసాన్ని సృష్టించారు. వీరి బ్యాటింగ్ దూకుడుకు ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ ను 823/7 వద్ద డిక్లేర్ చేసింది.

    ఆ తర్వాత పాకిస్తాన్ జట్టును రెండవ ఇన్నింగ్స్ బ్యాటింగ్ కు ఇంగ్లాండ్ ఆహ్వానించింది.. తొలి ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ జట్టు 556 రన్స్ చేసింది. పాకిస్తాన్ కెప్టెన్ షాన్ మసూద్ (151), అబ్దుల్లా షఫీ(102), సల్మాన్ (104) సెంచరీలతో కదం తొక్కారు. దీంతో పాకిస్తాన్ జట్టు 556 రన్స్ చేసింది.. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు రూట్(262), బ్రూక్(317) ధాటికి 7 వికెట్లు కోల్పోయి 823 పరుగులు చేసింది. భారీ స్కోర్ చేయడంతో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. మైదానం బ్యాటింగ్ కు సహకరించడం.. బజ్ బాల్ ఆటతీరు కొనసాగించడంతో ఇంగ్లాండు భారీ స్కోర్ చేసింది. ముఖ్యంగా బ్రూక్ వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 29 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి..

    తడబడింది

    రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ జట్టు తొలి బంతికే వికెట్ కోల్పోయింది. క్రిస్ వోక్స్ వేసిన తొలి ఓవర్ తొలి బంతికి ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరోవైపు అట్కిన్సన్ తన పేస్ బౌలింగ్ తో షాన్ మసూద్ (25) పెవిలియన్ పంపించాడు. బాబర్ అజాం (5) మరోసారి దారుణమైన ఇన్నింగ్స్ ఆడాడు. భారీగా పరుగులు చేస్తాడని భావిస్తే.. కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇటీవల తన కెప్టెన్సీకి బాబర్ వీడ్కోలు పలికాడు. పూర్తిస్థాయిలో బ్యాటింగ్ పై దృష్టి సారించాలని అతడు పేర్కొన్నాడు. కెప్టెన్సీ ని వదులుకున్నప్పటికీ అతని ఆటతీరులో మార్పు లేదు. పేలవమైన షాట్ ఆడి ఔట్ అయ్యాడు.. మరోవైపు క్రీజ్ లో కాస్త నిలబడిన సాద్ షకీల్ (29) జాక్ లీచ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 82 పరుగులకు చేరుకుంది. కానీ కీలకమైన నాలుగు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో పాకిస్తాన్ జట్టును సల్మాన్ (41), అమర్ జమాల్ (27) ఆదుకునే ప్రయత్నం చేశారు. దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ జట్టు ఆరు వికెట్ల కోల్పోయి 152 పరుగులు చేసింది. సల్మాన్, జమాల్ జిడ్డు బ్యాటింగ్ చేయడంతో ఇంగ్లాండ్ బౌలర్లు పూర్తిగా నిరుత్సాహానికి గురయ్యారు. ఇంగ్లాండ్ కెప్టెన్ బౌలర్లను మార్చి మార్చి బౌలింగ్ వేయించినప్పటికీ.. సల్మాన్, అమర్ జమాల్ వికెట్లను అలాగే అంటి పెట్టుకున్నారు. ఫలితంగా ఇంగ్లాండ్ బౌలర్లు విజయం కోసం మరో రోజు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవేళ జమాల్, సల్మాన్ అలాగే నిలబడి గనుక ఆడితే.. మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేస్తే.. విజయం దక్కుతుంది. మొత్తంగా ఐదో రోజు ఆట సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది.