Kamal Hassan : ప్రస్తుతం ఇండియా లో ఉన్న సూపర్ స్టార్స్ లో 60 ఏళ్ళ సుదీర్ఘ నట ప్రస్థానం ఉన్న హీరో కమల్ హాసన్ మాత్రమే. ఆయన అనుభవం అంత వయస్సు కూడా నేటి తరం స్టార్ హీరోలకు లేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు. చిరంజీవి, రజినీకాంత్ వంటి సూపర్ స్టార్స్ కూడా కమల్ హాసన్ కంటే చాలా జూనియర్స్ అని చెప్పొచ్చు. బాలనటుడిగా ఈయన అప్పటి సూపర్ స్టార్స్ ఎంజీఆర్, శివాజీ గణేశన్ సినిమాల్లో నటించేవాడు. వాటిల్లో అద్భుతమైన నటన కనబర్చిన కమల్ హాసన్ ని చూసి అప్పటి రాష్ట్రపతి ప్రశంసల వర్షం కురిపించాడు. అలా బాలనటుడిగా కెరీర్ ని ప్రారంభించిన కమల్ హాసన్ మధ్యలో డ్యాన్స్, ఫైట్స్ కొరియోగ్రాఫర్ గా కూడా పనిచేసాడు. ఆ తర్వాత హీరోగా మారిన ఆయనకు ఎలాంటి అద్భుతమైన పాత్రలు దక్కాయో మన అందరికీ తెలిసిందే. నటనలో ఆయన నేటి తరానికి ఒక నిఘంటువు లాగా మారిపోయాడు.
ఎవరైనా బాగా నటిస్తే కమల్ హాసన్ తో పోల్చి చూడడం ఇటీవల కాలం లో సర్వసాధారణం అయిపోయింది. నటనలో ఆయన ఏర్పాటు చేసిన బెంచ్ మార్క్ అలాంటిది మరి. ఇప్పటికీ కూడా ఆయన సినిమాలు చేస్తూ నేటి తరం స్టార్ హీరోలతో సరిసమానమైన బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని నెలకొల్పుతున్నాడు. ఆయన నటించిన ‘విక్రమ్’ చిత్రం కమర్షియల్ గా ఎలాంటి వసూళ్ల సునామీని సృష్టించిందో మన అందరికీ తెలిసిందే. తెలుగు, తమిళ భాషలకు కలిపి ఈ చిత్రం 450 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అలా కమల్ హాసన్ కేవలం నటుడిగా మాత్రమే కాదు, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, స్క్రీన్ ప్లే రైటర్ గా , గాయకుడిగా, ఇలా ఒక్కటా రెండా, సినిమాలో ఎన్ని క్రాఫ్ట్స్ ఉంటాయో, అన్ని క్రాఫ్ట్స్ లోనూ పట్టు సాధించాడు. ముఖ్యంగా గాయకుడిగా ఆయన ఇది వరకు ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడాడు.
అంతే కాదు కమల్ హాసన్ లో ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉంది. గొంతు మార్చి మాట్లాడడంలో కమల్ హాసన్ ని మించిన వాళ్ళు లేరని ఇండస్ట్రీ లో అందరూ అంటూ ఉంటారు. అప్పట్లో ఈయన ‘భామనే సత్య భామనే’ అనే చిత్రం లో అమ్మాయి గొంతుతో మనకు వినిపించే ‘రుకు రుకు’ అనే పాటను పాడింది లేడీ సింగర్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఆ పాట పాడింది కమల్ హాసన్ అట. అలాగే ‘దశావతారం’ చిత్రం లో ముసలావిడ పాడే పాటను కూడా కమల్ హాసన్ పడ్డాడట. ఇలా గొంతు మార్చి పాడడం ఒక్క ఎస్పీ బాలసుబ్రమణ్యం కి మాత్రమే తెలుసు. ఆయన తర్వాత కమల్ హాసన్ కి మాత్రమే ఈ విద్య తెలుసు, కమల్ హాసన్ – ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రాణ స్నేహితులు కాబట్టి ఎస్పీ బాలసుబ్రమణ్యం కమల్ కి ఈ కల నేర్పించి ఉండొచ్చని అంటున్నారు నెటిజెన్స్.