Suffering from relationship depression: రిలేషన్‌లో ఉన్నప్పుడు చాలా సమస్యలు వస్తాయి. చిన్న గొడవలు, అలకలు, వేరే వారితో మాట్లాడితే ఇష్టం లేకపోవడం ఇలా చాలానే ఉంటాయి. వీటన్నింటిని అర్థం చేసుకుని దాటి ముందుకెళ్లిన వాళ్లు జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు. అదే ఆ చిన్న గొడవలను పట్టుకుని ఉన్నవారు అక్కడే ఆగిపోతారు. రిలేషన్ బ్రేక్ అయ్యి.. గొడవలు, బాధ, కన్నీళ్లతో మిగిలిపోతారు. జీవితంలో ప్రేమ అనేది చాలా ముఖ్యం. ఆ ప్రేమ మిమ్మల్ని ఎంతవరకు అయిన తీసుకెళ్తుంది. ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా సాధించాలన్నా.. ఫెయిల్ కావటంలో ప్రేమ కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. ప్రేమ బంధం సంతోషంగా ఉన్నవారు జీవితంలో ఎన్నో విజయాలను సాధించిన వాళ్లు ఉన్నారు. అదే ఆ బంధంలో ఫెయిల్ అయిన వారి కొందరి జీవితాలు రోడ్డున పడ్డవారు కూడా ఉన్నారు. ఇలా ప్రేమ విషయంలో బాధపడి కొందరు డిప్రెషన్‌లోకి వెళ్తారు. దీనినే రిలేషన్ డిప్రెషన్ అంటారు. భాగస్వామి పక్కనే ఉన్న వారికి ఇబ్బందిగా, బాధగా ఉంటుంది. దీంతో వారు రిలేషన్‌లో ఉన్న ఎప్పుడూ డిప్రెషన్‌లో ఉండటం వల్ల బంధంలో ఇబ్బందులను ఎదుర్కుంటారు.
డిప్రెషన్ అనే పదం అందరికీ తెలిసిందే. ఏ విషయాన్ని గురించి అయిన ఎక్కువగా బాధపడి, ఆలోచించి చివరకు డిప్రెషన్‌లోకి వెళ్తారు. అయితే బంధంలో ఉన్నప్పుడు కూడా సంతోషంగా ఉండకుండా బాధపడుతూ రిలేషన్ డిప్రెషన్‌లోకి వెళ్తారు. దీనివల్ల మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఇది ఒక రకమైన మూడ్ డిజార్డర్. చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. రిలేషన్‌లో ఎంత సంతోషంగా ఉన్నా కూడా వారికి ఎక్కడో ఒక దగ్గర చిన్న బాధ ఉంటుంది. ఏ విషయంలో సంతోషపడరు. రిలేషన్‌లో ప్రతి దాన్ని తప్పు పడతారు. భాగస్వామి తప్పులను వెతుకుతారు. ఒక్కమాటలో చెప్పాలంటే సంతోషాన్నిచ్చే కంటే బాధను ఇచ్చే సంఘటనలను వెతుక్కుంటారు. దీనివల్ల ఎల్లప్పుడు బాధపడుతూ డిప్రెషన్‌లోనే ఉంటారు. ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు.
ఈ రిలేషన్ డిప్రెషన్‌లో ఉన్నవారు భాగస్వామితో సంతోషంగా ఉండరు. ఒంటరిగా వారు మనస్సులో బాధపడుతూ ఏడుస్తూనే ఉంటారు. అయితే ఈ రిలేషన్ డిప్రెషన్ రావడానికి ముఖ్య కారణం భాగస్వామి అనే నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే భాగస్వామి అనుమానించడం, కోపంగా మాట్లాడుకోవడం, ప్రతి విషయంలో తప్పులను వెతకడం, నిందించడం వల్ల రిలేషన్ డిప్రెషన్‌లోకి వెళ్తారు. కొందరు మాత్రం వ్యక్తిగత సమస్యల వల్ల రిలేషన్ డిప్రెషన్‌లోకి వెళ్తారు. దీని నుంచి బయటకు రావాలంటే భాగస్వాముల మధ్య కమ్యూనికేషన్ తప్పనిసరిగా ఉండాలి. కుటుంబ బాధ్యతలు, వర్క్ బిజీలో ఉన్న కూడా ఇద్దరి మధ్య కమ్యునికేషన్ ఉండాలి. భాగస్వామికి కొంత సమయం ఇస్తూ.. అన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. వాళ్ల బాధ ఎందుకు పడుతున్నారో పూర్తిగా తెలుసుకుంటే వారు రిలేషన్ డిప్రెషన్ నుంచి బయటపడవచ్చు. భాగస్వామి సంతోషంలో, మంచి పనుల్లోనే కాకుండా చెడు పనులు, బాధలో కూడా తోడు ఉండాలి. అప్పుడు వాళ్లకి భాగస్వామి మీద నమ్మకం, ప్రేమ పెరిగి డిప్రెషన్ నుంచి కాస్త బయటకు వస్తారు.