Team India: కొత్త కోచ్ రాహుల్.. కెప్టెన్సీ మార్పు.. సౌతాఫ్రికా పర్యటన నేర్పిన గుణపాఠాలేంటి..?

Team India: కొత్త ద్వయం టీమిండియాను కప్ గెలిచేలా చేస్తుందని అందరూ ఆశలు పెట్టుకున్న వేళ తొలి అడుగే అపశకునంగా మారింది. విరాట్ కోహ్లీ దిగిపోయాక కెప్టెన్సీ మార్పు జరిగాక.. కొత్త కోచ్ రాహుల్ ద్రావిడ్ సారథ్యంలో జరిగిన తొలి పర్యటనలో టీమిండియా దారుణంగా ఓడిపోయింది. పెద్దగా అనుభవం లేని సౌతాఫ్రికా చేతిలో 3-0తో చిత్తు అయ్యింది. ఎన్నో ఆశలతో సౌతాఫ్రికా టూర్ కు వెళ్లిన భారత జట్టు ఒట్టి చేతులతో తిరిగొచ్చింది. అయితే వన్డే క్రికెట్ […]

Written By: NARESH, Updated On : January 25, 2022 12:55 pm
Follow us on

Team India: కొత్త ద్వయం టీమిండియాను కప్ గెలిచేలా చేస్తుందని అందరూ ఆశలు పెట్టుకున్న వేళ తొలి అడుగే అపశకునంగా మారింది. విరాట్ కోహ్లీ దిగిపోయాక కెప్టెన్సీ మార్పు జరిగాక.. కొత్త కోచ్ రాహుల్ ద్రావిడ్ సారథ్యంలో జరిగిన తొలి పర్యటనలో టీమిండియా దారుణంగా ఓడిపోయింది. పెద్దగా అనుభవం లేని సౌతాఫ్రికా చేతిలో 3-0తో చిత్తు అయ్యింది. ఎన్నో ఆశలతో సౌతాఫ్రికా టూర్ కు వెళ్లిన భారత జట్టు ఒట్టి చేతులతో తిరిగొచ్చింది. అయితే వన్డే క్రికెట్ కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లిని తప్పించిన తరువాతే భారత్ కు సందిగ్ధ పరిస్థితి ఏర్పడిందా..? అనే విశ్లేషణలు జరుగుతున్నాయి. విరాట్ కోహ్లిని వన్డే నుంచి తప్పించి బీసీసీఐ చేసిన ప్రయోగాలు బెడిసికొట్టాయా..? అని అనుకుంటున్నారు. అయితే వన్డే క్రికెట్ పరిస్థితి ఇలా ఉంటే టెస్ట్ ఫార్మాట్ నుంచి కూడా కోహ్లి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మరి ఇప్పుడు కోహ్లి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ గాయాల బారినపడుతుండడం.. కేఎల్ రాహుల్ లో నాయకత్వ పటిమ లేకపోవడంతో టీమిండియాలో ఇప్పుడు ఏర్పడిన సమస్య పరిష్కరించకపోతే ముందు ముందు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని క్రికెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

భారత క్రికెట్ కెప్టెన్సీ వివాదం ఇప్పుడు కొత్తది కాదు. గతంలో గంగూలీ కెప్టెన్సీ మార్పు సందర్భంగా పెద్ద వివాదమైంది. ఆ తరువాత ఇప్పటివరకు సవ్యంగా సాగిన ఇండియన్ క్రికెట్ టీంలో ఇప్పుడు మరో సంక్షోభం ఏర్పడింది. టీ20 వరల్డ్ కప్ కు ముందే ఆ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విరాట్ కోహ్లిని ఆ తరువాత బీసీసీఐ వన్డే ఫార్మాట్ నుంచి అనూహ్యంగా తొలగించింది. తనను తొలగించే విషయం గంట ముందే చెప్పారని కోహ్లి మీడియా సమావేశంలో వెల్లడించారు. దీంతో కోహ్లి, బీసీసీఐ మధ్య జరిగిన వివాదం కారణంగా టెస్ట్ ఫార్మాట్ కు కూడా గుబ్ బై చెప్పేశాడు.

Also Read: ఏపీలోని స్కూళ్లలో కొత్త రూల్స్.. ఇక వాటిని పాటించడం కంపల్సరీ..

టీ20 వరల్డ్ కప్ తరువాత న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో రోహిత్ కు పగ్గాలు అప్పజెప్పారు. అయితే తన ఫర్మామెన్స్ తో ఆ సీరిస్ ను గెలుచుకున్నారు. అయితే ఆ తరువాత సౌతాఫ్రికా టూర్ కు వెళ్లే ముందు కోహ్లి వివాదం పెద్ద దుమారం లేపింది. దీంతో సౌతాఫ్రికా వెళ్లిన టీం అటు వన్డే, ఇటు టెస్టును రెండంటిని కోల్పోయింది. వాస్తవానికి కొన్ని రోజుల పాటు టీ20, వన్డేకు ఒక కెప్టెన్.. టెస్టులకు మరో కెప్టెన్ ఉండేలా బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే కోహ్లి టెస్ట్ ఫార్మాట్ నుంచి కూడా తప్పుకున్నట్లు ప్రకటించడం బీసీసీఐకి షాక్ ఇచ్చింది. వన్డే, టీ 20 ఫార్మాట్లను రోహిత్ ఎదుర్కొన్నా.. టెస్టుల్లో ఇంకా పరిణతి సాధించలేదు.

ఇక టెస్టులకు రాహుల్ బెటర్ అని అనుకున్నారు. కానీ టెస్టు మ్యాచ్లో, వన్డే సిరిస్ కెప్టెన్ గా ఆకట్టుకోలేకపోయాడు. శ్రేయస్, పంత్ లాంటి వాళ్లు కెప్టెన్సీని ఆదుకునేంత అనుభవం సాధించలేనట్లు తెలుస్తోంది. దీంతో టీం ఇండియాను సమర్థవంతంగా నడిపించగల సత్తా ఎవరికుందోనని చర్చించుకుంటున్నారు. టీమిండియాకు ధోని కెప్టెన్ గా ఉన్న సమయంలో చాలా ఏళ్ల పాటు మిడిల్ ఆర్డర్ లో బలంగా నిలిచాడు. అయితే తన జోరు తగ్గినప్పటి నుంచి టీమిండియాకు మిడిల్ ఆర్డర్ పెద్ద సమస్యగా మారింది. పంత్, శ్రేయస్, సూర్య కుమార్ అప్పుడప్పుడు కాస్త ప్రతిభ సాధిస్తున్నా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడం లేదు. దక్షిణాఫ్రియా వన్డే సిరీస్లో మూడు మ్యాచుల్లోనే భారత్ గెలిచే అవకాశాలు వచ్చాయి. కానీ మిడిలార్డర్ లోపంతో అ అవకాశాన్ని చేజిక్కించుకోలేకపోయారు.

ఇకప్పుడు స్పిన్ పరంగా భారత్ ముందుండేది. కానీ సౌతాఫ్రికా టూర్లో స్పిన్నర్లు దారుణంగా విఫలమయ్యారు. పిచ్ లు కూడా అనుకూలించే సమయంలో వీరి ప్రతిభ చూపించలేకపోయారు. అలాగని భావించినా ఇదే సమయంలో దక్షిణాఫ్రికా స్పిన్నర్లు షంసి, కేశవ్ మహారాజ్ లాంటి వాళ్లు జోరు చూపించారు. టీమిండియా స్పిన్నర్లు అశ్విన్, చాహల్, జయంత్ యాదవ్ లు 59 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే తీసుకున్నారు.

ఇదిలా ఉండగా కోహ్లి ప్రవర్తనలో పూర్తిగా మార్పు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. సారథ్య బాధ్యతల సమయంలో ఆడినంతా ఇప్పుడు ఆడడం లేదు. రెండు హాఫ్ సెంచరీలతో సరిపెట్టుకోవడంతో టీమిండియా దారుణంగా విఫలమైనట్లు చర్చించుకుంటున్నారు. ముందు ముందు ఇలాంటి పరిస్థితే ఉంటే ఇంతకాలం కాపాడుకున్న క్రేజ్ తగ్గిపోయే ప్రమాదం ఉందని క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: భీమ్లా నాయక్’ రిలీజ్ కి ఏర్పాట్లు చేసేస్తున్నారు !