AP New Districts: ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికల హామీల్లో భాగంగా జిల్లాల పెంపు ప్రతిపాదన కొద్ది రోజులుగా పట్టాలెక్కలేదు. కానీ సీఎం జగన్ మదిలో నూతన జిల్లాల ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలనే ఆలోచన వచ్చిందే తడవుగా కార్యాచరణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఎన్నికల నాటికి ప్రక్రియ మొత్తం పూర్తయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం అన్ని మార్గాలు తెరిచినట్లు సమాచారం. కొద్ది రోజులుగా నానుతున్న కొత్త జిల్లాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపినట్లు చెబుతున్నారు.
రాష్ర్టంలో 26 జిల్లాలుగా ఏర్పాటు చేయాలని తెలుస్తోంది. దీనికి గాను ప్రభుత్వం ఓ విధానం రూపకల్పన చేసింది. బుధవారం నోటిఫికేషన్ కూడా వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పనుల్లో వేగవంతం అయ్యేలా చూస్తున్నారు. ఎట్టకేలకు జిల్లాల ప్రతిపాదనకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు చెబుతున్నారు. దీనికి రెండు మూడు రోజుల్లో అన్ని పనులు ప్రారంభం కానున్నట్లు సమాచారం.
Also Read: Andhra Pradesh: ఎడిటర్స్ వర్షన్ : మొత్తం చేతులారా నాశనం చేసి.. ఇప్పుడు కొత్తగా అరుపులెందుకు..?
మొత్తం పార్లమెంట్ నియోజకవర్గానికో జిల్లా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. భౌగోళికంగా పెద్దగా ఉన్న అరకు నియోజకవర్గాన్ని రెండు జిల్లాలు చేస్తే జిల్లాల సంఖ్య ఇరవై ఆరుకు చేరుతుందని తెలుస్తోంది. దీనికి గాను సమగ్ర ప్రణాళిక రూపొందించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు పనులు కూడా ముందుకు వెళుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
పెరిగిన జనాభాకనుగుణంగా జిల్లాల పెంపు ఉండాలని ఎప్పటి నుంచో వస్తున్నడిమాండ్ల నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. మొత్తానికి వచ్చే ఎన్నికల నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి కావడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. పనుల్లో వేగవంతం ఉండేలా చర్యలు చేపడుతున్నారు.
Also Read: చంద్రబాబులో నిజంగానే మార్పు వచ్చిందా?