Rohit Sharma: రోహిత్ శర్మ ని రిక్వెస్ట్ చేస్తున్న బిసిసిఐ అసలు కారణం ఏంటంటే..?

రోహిత్ శర్మ వన్డేలు టెస్ట్ ల మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి టి 20 మ్యాచ్ లను ఆడకూడదని నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఇక 2024 లో టి20 వరల్డ్ కప్ ఉండడం వల్ల దీనికోసం ఏ టీమ్ ని వరల్డ్ కప్ కి సెలెక్ట్ చేయాలి అనే దాని మీద ఇప్పటి నుంచే సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Written By: Gopi, Updated On : November 30, 2023 8:45 am

Rohit Sharma

Follow us on

Rohit Sharma: ఇండియన్ టీం కెప్టెన్ గా తనదైన రీతిలో కెప్టెన్సీ చేసి ఇండియన్ టీమ్ కి అద్భుతమైన విజయాలను అందిస్తూ వచ్చిన రోహిత్ శర్మ 2023 వన్డే ప్రపంచ కప్ లో ఇండియన్ టీం ని ఫైనల్ కు చేర్చి ఒక్క అడుగు దూరం లో కప్పును ఇండియన్ టీంకి అందించడంలో తడపడ్డాడు. ఈయన కెప్టెన్సీ మాత్రం చాలా అత్యుత్తమంగా ఉందని ప్రపంచ దేశాలు సైతం ఆయన గురించి చాలా గొప్పగా చెప్పాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం టి20 మ్యాచ్ లో నుంచి రిటైర్ మెంట్ ప్రకటించనున్నట్టుగా చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.

ఎందుకంటే రోహిత్ శర్మ వన్డేలు టెస్ట్ ల మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి టి 20 మ్యాచ్ లను ఆడకూడదని నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఇక 2024 లో టి20 వరల్డ్ కప్ ఉండడం వల్ల దీనికోసం ఏ టీమ్ ని వరల్డ్ కప్ కి సెలెక్ట్ చేయాలి అనే దాని మీద ఇప్పటి నుంచే సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇలాంటి క్రమంలో బీసీసీఐ మాత్రం రోహిత్ శర్మను త్వరలో జరిగే సౌతాఫ్రికా టి20 సిరీస్ కోసం కెప్టెన్ గా బాధ్యతలను స్వీకరించాలని రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రోహిత్ లాంటి సీనియర్ కెప్టెన్ ఈ టీమ్ కి కెప్టెన్ గా వ్యవహరిస్తే బాగుంటుందని బిసిసిఐ అతనికి రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.ఇక టి20 వరల్డ్ కప్ వరకు ప్రత్యేకించి దీనికోసం ఒక కెప్టెన్ ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో బీసీసీఐ ఉన్నప్పటికీ ప్రస్తుతానికి మాత్రం ఇండియన్ టీమ్ కెప్టెన్ గా రోహిత్ ని వ్యవహరించాల్సిందిగా బిసిసిఐ కోరుతుంది.

ఇక ఇప్పటికే ఇండియన్ టీం ఆస్ట్రేలియా తో ఆడుతున్న టి 20 సిరీస్ లో మూడు మ్యాచ్ లు ఆడిన ఇండియన్ టీం 2-1 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇంకో రెండు మ్యాచ్ ల్లో ఒక మ్యాచ్ గెలిచిన కూడా ఇండియన్ టీం కప్ ను దక్కించుకుంటుంది. ఇక ఇప్పుడు ఈ సీరీస్ కి సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు…

నిజానికి ఇండియన్ టీమ్ లో కెప్టెన్ గా వ్యవహరించడానికి హార్ధిక్ పాండ్య ఉన్నప్పటికీ ఆయనకి ప్రస్తుతం గాయం అవ్వడం తో ఇలా కెప్టెన్ల ను మార్చాల్సి వస్తుందని తెలుస్తుంది. ఇక రోహిత్ టి 20 మ్యాచ్ లకి రిటైర్ మెంట్ ప్రకటిస్తే హర్ధిక్ పాండ్య ఫుల్ టైం కెప్టెన్ గా ఉంటాడు…