https://oktelugu.com/

Odi World Cup: 2011 వరల్డ్ కప్ టీమ్ కి ఇప్పుడున్న టీమ్ కి తేడా ఏంటంటే..?

ప్రస్తుతం ఉన్న టీంలో కూడా మంచి ప్లేయర్లు ఉన్నప్పటికీ వీళ్లు కన్సిస్టెన్సీ ని మెయింటేన్ చేయడం లో చాలా వరకు విఫలం అవుతున్నారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 9, 2023 / 02:35 PM IST

    Odi World Cup

    Follow us on

    Odi World Cup: రీసెంట్ గా బిసిసిఐ వరల్డ్ కప్ కి ఒక 15 మంది తో ఉన్న టీం స్క్వాడ్ ని సెలెక్ట్ చేయడం జరిగింది నిజానికి ఈ టీం లో ఉండాల్సిన కొంత మంది కి చోటు దక్కలేదు అయినప్పటికీ ఈ టీం తో అయినా సరే ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే సంతోషం…అయితే బిసిసిఐ ప్రకటించిన వరల్డ్ కప్ టీం లో ఉన్న ప్లేయర్లు ఎవరో ఒకసారి మనం తెలుసుకుందాం.

    ముందుగా ఓపెనర్లు గా శుభమన్ గిల్ రోహిత్ శర్మ లను సెలెక్ట్ చేసారు నెంబర్ త్రి లో విరాట్ కోహ్లీ ఉన్నాడు నెంబర్ ఫోర్ లో శ్రేయాస్ అయ్యర్ నెంబర్ ఫైవ్ లో ఆడటానికి ఇషాన్ కిషన్ లేదా కె ఎల్ రాహుల్ ఇద్దరు ఉన్నారు.నెంబర్ సిక్స్ లో హార్దిక్ పాండ్య నెంబర్ సెవన్ లో రవీంద్ర జడేజా నెంబర్ ఎయిట్ లో శార్దూల్ ఠాకూర్ నెంబర్ నైన్ లో కుల్దీప్ యాదవ్ నెంబర్ టెన్ లో మహమ్మద్ సిరాజ్ నెంబర్ లెవన్ లో జస్ప్రీత్ బుమ్రా లాంటి ప్లేయర్లు ఉన్నారు ఇక వీళ్ళకి బ్యాకప్ లో సూర్యకుమార్ యాదవ్,అక్షర్ పటేల్,మహమ్మద్ షమీ లాంటి వాళ్ళు ఉన్నారు ఇక వికెట్ కీపర్ గా రాహుల్ ఇషాన్ కిషన్ ఇద్దరు ఉన్నారు కాబట్టి వీళిద్దరిలో ఎవరో ఒకరుమాత్రమే టీం లో ఉంటారు…అయితెహ్ మన టీం ఏం చేసిన ఈ ప్లేయర్లతోనే చేయాలి మన టీం కప్ గెలిచినా, ఓడిపోయినా అది వీళ్ల వల్లే సాధ్యం అవుతుంది…అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ టీం లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ ఎక్కువ గా లేరు అనే విమర్శ అయితే మన టీం మీద ఉంది అలాగే ఈ టీం ని సెలెక్ట్ చేసిన బిసిసిఐ మీద కూడా ఉంది.సరే ఇక ఈ విషయాన్నీ పక్కన పెడితే 2011 సంవత్సరం లో వరల్డ్ కప్ కి ఆతిధ్యం ఇచ్చిన దేశం మన ఇండియా నే కావడం విశేషం అయితే ఇప్పుడు దాదాపు 12 సంవత్సరాలకి మళ్లీ ఈసారి జరిగే వరల్డ్ కప్ మన ఇండియా లోనే జరుగుతుంది 2011 లో ఇండియన్ టీం కి ధోని సారధ్యం వహించి ఇండియా కి కప్ వచ్చేలా చేసాడు మరి ఇప్పుడు కూడా ఇండియా లోనే ఆడుతుంది కాబట్టి మన టీం కి కప్పు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి.అయితే 2011 లో టీం లో ఉన్న ప్లేయర్ కి ఇప్పుడు టీం లో ఉన్న ప్లేయర్లకి మధ్య తేడా ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం…

    అప్పుడున్న టీం లో మహేంద్ర సింగ్ ధోని, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, సురేష్ రైనా లాంటి చాలా మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. అలాగే ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్, శ్రీశాంత్ లాంటి బౌలర్లు ఉన్నారు.ఇక స్పిన్ విభాగంలో హర్భజన్, పీయూష్ చావ్లా లు ఉన్నారు…ఓపెనర్ గా సచిన్ చాలా బాగా ఆడి ఆ ఇయర్ వరల్డ్ కప్ లో 9 మ్యాచులు ఆడితే అందులో రెండు సెంచరీ లు, రెండు హాఫ్ సెంచరీ లు చేసి 482 పరుగులు చేసాడు, అలాగే ఆ వరల్డ్ కప్ లో సెకండ్ హైయెస్ట్ రన్స్ చేసిన ప్లేయర్ గా కూడా నిలిచాడు.అప్పట్లో సెహ్వాగ్ కూడా అసలు ఎక్కడ తడబడకుండా దైర్యం గా వచ్చిన ప్రతి బాల్ ని ఎదుర్కొంటు ముందుకు వెళ్ళేవాడు.ఇక సెహ్వాగ్ 8 ఇన్నింగ్స్ ల్లో ఒక సెంచరీ ఒక హాఫ్ సెంచరీ చేసి 380 పరుగులు చేసాడు.ఇక గౌతం గంబీర్ కూడా 9 ఇన్నింగ్స్ ల్లో 393 పరుగులు చేసాడు.అందులో నాలుగు హాఫ్ సెంచరీ లు ఉన్నాయి. ఇక యువ రాజ్ సింగ్ విషయానికి వస్తే ఆయన ఈ టీం లో చాలా పొటెన్షియాలిటీ ఉన్నప్లేయర్ గా చెప్పవచ్చు.యువరాజ్ సింగ్ నెంబర్ ఫోర్ లో వచ్చి బౌలర్లకు చుక్కలు చూపించేవాడు తన మార్క్ ఇన్నింగ్స్ తో అసలు ఎక్కడ తగ్గకుండా చాలా బాగా ఆడుతూ ఉండేవాడు…ఇక ఈయన 8 ఇన్నింగ్స్ ల్లో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీ లు చేసి 362 పరుగులు చేసాడు.ఇక బ్యాట్ తోనే కాకుండా బాల్ తో కూడా మ్యాజిక్ చేస్తూ తాను ఆడిన 9 మ్యాచుల్లో కలిపి 15 వికెట్లు తీసాడు. యువరాజ్ సింగ్ వల్లే మన టీం చాలా మ్యాచులో చాలా ఈజీగా గెలిచింది.ఇక ఆ ఇయర్ వరల్డ్ కప్ లో మ్యాన్ అఫ్ ది టోర్నమెంట్ గా యువరాజ్ సింగ్ నిలిచాడు…అందుకే యువరాజ్ సింగ్ అంటే అందరికి మంచి అభిప్రాయం ఉంటుంది.ఇక వీళ్లందరినీ ఒక తాటి పైకి తీసుకువచ్చి కరెక్ట్ టైం లో కరెక్ట్ డిసీజన్స్ తీసుకుంటూ ధోని టీం ని ముందు ఉండి నడిపించాడు…అలాగే తన నాయకత్వ ప్రతిభ ఏంటో కూడా ప్రపంచానికి తెలియజేసాడు.అవసరం అయినా టైం లో తనుకూడా రన్స్ చేస్తూ చాలా బాగా ఆడాడు…

    ఇక ప్రస్తుతం ఉన్న టీంలో కూడా మంచి ప్లేయర్లు ఉన్నప్పటికీ వీళ్లు కన్సిస్టెన్సీ ని మెయింటేన్ చేయడం లో చాలా వరకు విఫలం అవుతున్నారు. 2011 వరల్డ్ కప్ లో ఉన్న టీం లో సచిన్ కానీ, సెహ్వాగ్ కాని, గంభీర్ కానీ, యువరాజ్ సింగ్ కానీ వీళ్లు చాలా కన్సిస్టెన్సీ తో అన్ని మ్యాచుల్లో చాలా బాగా ఆడారు కాబట్టే మన టీం వరుసగా మ్యాచులు గెలుచుకుంటూ వచ్చింది.అయితే ఇప్పుడున్న టీం లో ఎవరో ఒక ప్లేయర్ యువరాజ్ సింగ్ పాత్ర పోషించాలి లేకపోతే టీం చాలా కష్టాల్లో పడుతుంది.నాకు తెలిసి శ్రేయాస్ అయ్యర్ గాని, ఇషాన్ కిషన్ లేదా కె ఎల్ రాహుల్ వీళ్ళలో ఎవరో ఒకరు 2011 లో యువరాజ్ సింగ్ ఎలాగైతే నెంబర్ ఫోర్ లో వచ్చి మిడిలాడర్ ని స్ట్రాంగ్ గా చేస్తూ మ్యాచ్ ని గెలిపించడానికి చాలా ట్రై చేసాడో ఇప్పుడు కూడా అలాగే వచ్చి ఒక ప్లేయర్ కనక అలాంటి పాత్ర పోషిస్తే ఇప్పుడున్న ఇండియా టీం కూడా వరల్డ్ కప్ లో చాలా మంచి విజయాలను అందుకుంటుంది…ఇక బౌలింగ్ లో జహీర్ ఖాన్ తన మార్క్ పేస్ బౌలింగ్ తో ఇండియా టీం కి విజయాలను అందించాడు.అలాగే ఆ వరల్డ్ కప్ లో 9 మ్యాచుల్లో 21 వికెట్లు తీసుకొని 2011 వరల్డ్ కప్ లోనే హైయెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచాడు…ఇక ఇప్పుడు కూడా జహీర్ ఖాన్ లాంటి బౌలింగ్ తో అదరగొట్టే బౌలర్ కావాలి టీం బాధ్యతని మోసే బౌలర్ కావాలి.నాకు తెలిసి బుమ్రా కానీ, సిరాజ్ కానీ జహీర్ ఖాన్ పాత్రని పోషిస్తారని అర్థం అవుతుంది…

    ఇలా అందరు సమిష్టిగా రాణిస్తేనే మన ఇండియా టీం ఈసారి వరల్డ్ కప్ కొడుతోంది లేకపోతే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్లని ఓడించడం కష్టం అవుతుంది.ఇక ఇండియాలోనే ఆడుతున్నారు కాబట్టి ఇక్కడ మనం కప్పు కొట్టకపోతే మన టీం పరువు పోతుంది. మన దేశానికి వచ్చి వేరే వాళ్ళు వరల్డ్ కప్ తీసుకుపోతున్నారు అంటే అది మనకు సిగ్గుచేటు అనే చెప్పాలి…అందుకే ఈసారి కప్పు కొట్టి మన ఇండియన్ టీం పవర్ ఏంటో మరోసారి ప్రపంచ క్రికెట్ కి తెలియజేయాల్సిన అవసరం ఉంది…