IPL: టీ 20 ప్రపంచ కప్ లో టీమిండియా ప్రదర్శనపై అందరు పెదవి విరుస్తున్నారు. కోహ్లి సేనపై విమర్శలు చేస్తున్నారు. అత్యంత పేలవ ప్రదర్శనగా అభివర్ణిస్తున్నారు. సెమీస్ కూడా చేరకుండానే వెనుదిరగటం బాధాకరమే. దీనిపై మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ కూడా స్పందించాడు. కోహ్లి సేన ప్రదర్శనపై పెదవివిరిచాడు. గత కొద్ది రోజులుగా ఇలాంటి ప్రదర్శన చూడలేదన్నారు. టీమిండియా అలసత్వంపై తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు.

ఏ కెప్టెన్ కైనా గెలుపోటములు సహజమే. ప్రపంచ కప్ లో సెమీస్ కు కూడ చేరకుండానే వెనుదిరగడం బాధాకరం. టీమిండియాకు విశ్రాంతి అనేది లేకుండా కూడా ఆడించడం సబబు కాదు. అందుకే వారు విఫలమైనట్లు తెలుస్తోంది. కొందరు ఆటగాళ్లు దేశానికంటే ఐపీఎల్ లో ఆడటానికే ఇష్టపడుతుంటారు. కానీ దేశానికి ఆడటానికే ప్రాధాన్యం ఇవ్వాలి. బీసీసీఐ కూడా మ్యాచ్ ల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలి. భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని టోర్నమెంట్లను ఖరారు చేయాల్సి ఉంటుంది.
ఇప్పుడు జరిగిన పరాభవాన్ని గుర్తు చేసుకోకుండా వచ్చే ప్రపంచ కప్ కైనా ఆటగాళ్లను సన్నద్ధం చేయాలి. ఆటగాళ్ల ప్రదర్శనపై మేనేజ్ మెంట్ దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. లక్ష్య సాధనలో వెనుకబడకుండా ప్రతి ఆటగాడు తన ప్రతిభను మెరుగుపరుచుకోవాలి. అప్పుడే సమష్టి నిర్ణయంతో అందరు రాణించి గెలుపు ముంగిట నిలిచే అవకాశం ఉంటుంది.
Also Read: T20 World Cup: వచ్చే టీ 20 ప్రపంచ కప్ నైనా నెగ్గుతుందా?
టాస్ ఓడితే మ్యాచ్ లు ఓడతారా? దీనిపై అందరు స్పందించారు. టాస్ ఓడితే ఓటమే కావడం తప్పని సూచిస్తున్నారు. టాస్ ఓడితేనే పరాజయం పాలైందని వస్తున్న విమర్శలపై సీనియర్ ఆటగాళ్లు తమ మనసులోని మాట వెల్లడించారు. జట్టు ఓటమికి టాస్ ఓడిపోవడం కారణం కాదన్నారు.