Nandamuri Balakrishna నందమూరి నటసింహం బాలకృష్ణ అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇస్తున్నారు. ఆయన ప్రముఖ తెలుగు ఓటిటీ సంస్థ ఆహా లో … ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ అనే ప్రొగ్రామ్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దెబ్బకు మారిపోవాలి అంటూ తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ బాలకృష్ణ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తున్నారు. ఈ షో కు మొదటి గెస్ట్ గా మంచు మోహన్ బాబు హాజరయ్యారు. మొదటిసారి హోస్ట్ గా చేసినప్పటికీ బాలయ్య తన పంచులతో అందర్నీ ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు ఈ షో రెండో ఎపిసోడ్ కు నేచురల్ స్టార్ నాని గెస్ట్ గా వస్తున్నట్లు ఆహా బృందం ప్రకటించింది.
ఈ మేరకు తాజాగా అన్ స్టాపబుల్ షో రెండో ఎపిసోడ్ ప్రోమో ను విడుదల చేశారు. ఈ ప్రోమోలో మరోసారి బాలయ్య యాంకరింగ్ లో అదరగొట్టారు అని చెప్పాలి. అలానే బాలయ్య డైలాగ్ లను నాని… నాని డైలాగ్ లను బాలయ్య చెప్పడం ఈ ప్రోమో లో హైలైట్ అని చెప్పుకోవాలి. నానితో కలిసి సరదాగా క్రికెట్ ఆడడం అభిమానులకు బాగా నచ్చుతుంది. ఇంకా నాని తన సినిమాలు ఓటిటీ లో రిలీజ్ అయినప్పుడు డిస్ట్రిబ్యూటర్లతో జరిగిన వివాదం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఇదిలా ఉండగా బాలయ్య ప్రస్తుతం అఖండ అనే సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ఆ తర్వాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాకు బాలయ్య ఒకే చెప్పారు.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Nani got emotional on balayya unstoppable show
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com