Homeక్రీడలుWarner: వార్నర్ ను తప్పించి సన్ రైజర్స్ ఏం సాధించింది

Warner: వార్నర్ ను తప్పించి సన్ రైజర్స్ ఏం సాధించింది

Warner:  మార్చిలో ఐపీఎల్ మ్యాచులు జరగనున్నాయి. ఇందు కోసం ఆటగాళ్ల వేలం జరుగుతోంది. దీంతో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను ఎంచుకుంటున్నాయి. హైదరాబాద్ సన్ రైజర్స్ కెప్టెన్ గా వార్నర్ ను తప్పించడం సంచలనం సృష్టిస్తోంది. 2016లో ఐపీఎల్ సన్ రైజర్స్ ను విజేతగా నిలిపిన వార్నర్ ను జట్టు నుంచి తప్పించడంతో అతడు ఖంగుతిన్నాడు. జట్టు కోసం శ్రమించిన తనను జట్టు నుంచి తొలగించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

warner
warner

గత ఏడాది ఆరు మ్యాచుల్లో ఒక్క విజయమే సొంతం చేసుకోవడంతో వార్నర్ పై వేటు పడిన సంగతి తెలిసిందే. కానీ తనను సంప్రదించకుండానే చర్యలు తీసుకోవడంతో ఆందోళన చెందుతున్నాడు. తాజా పరిణామాలతో వార్నర్ అనుమానాలు వ్యక్తం చేశాడు. జట్టు విజయం కోసం శ్రమించినా తనకు మాట మాత్రమైనా చెప్పకుండా నిర్ణయం తీసుకోవడంపై విచారం వ్యక్తం చేశాడు.

మరోవైపు జట్టు కెప్టెన్ గా విలియమ్సన్ కు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఏవో కొన్ని మ్యాచుల్లో ఫలితం తారుమారైతే జట్టు నుంచి తీసేస్తారా అని వాపోతున్నాడు. నాతో సంప్రదిస్తే తానే స్వయంగా తప్పుకునే వాడినని చెప్పాడు. యాజమాన్యం చర్య బాధించిందని పేర్కొన్నాడు. అభిమానుల అంచనాల మేరకు తన ప్రదర్శన ఉందని అభివర్ణించాడు.

Also Read: IPL 2022: ఐపీఎల్ 2022లో కీలక మార్పులు.. బీసీసీఐ సంచలన నిర్ణయం

దీంతో ఐపీఎల్ లో అద్బుతాలు చేసేందుకు అన్ని జట్టు సిద్ధమవుతున్నాయి. గత అనుభవాలను దృష్టిలో మెరుగైన ఆట తీరు ప్రదర్శించాలని భావిస్తున్నాయి. ట్రోఫీ తీసుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. వేగవంతమైన ఆటతో ఎదుటి జట్టును ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించనున్నాయని తెలుస్తోంది. దీనికి మరికొన్ని రోజులు ఆగాల్సిందే. కరోనా కారణంగా ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణ సాధ్యమయ్యేనా అనే అనుమానాలు కూడా లేకపోలేదు.

Also Read: Ind vs SA: సౌతాఫ్రికాతో టీమిండియా ఫైట్.. గెలుపు డిసైడ్ అయ్యేది నేడే.. ఏం జరుగనుంది?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...

Tollywood Directors: బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేని తెలుగు దర్శకులు వీళ్లే…

Tollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు కొందరు తెలుగు హీరోలు అవకాశం ఇవ్వకపోవడంతో బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా వంశీ పైడిపల్లి తెలుగు స్టార్...

Vemulawada Rajanna Temple: వేములవాడకు తండ్రి 7 లక్షల విరాళం.. తిరిగివ్వాలని కూతుళ్ల పోరాటం.. ఊహించని ట్విస్ట్

Vemulawada Rajanna Temple: తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందింది వేములవాడ రాజేశ్వర ఆలయం. ఇక్కడ స్వామి వారు లింగం రూపంలో ఉంటారు. ఈ ఆలయంలో కోడె మొక్కులను చెల్లించడం...
Oktelugu Epaper
Exit mobile version