Homeజాతీయ వార్తలు5 States Elections 2022: మోగిన నగారా.. ఐదు రాష్ట్రాల ఎన్నికలు..ఎప్పుడంటే?

5 States Elections 2022: మోగిన నగారా.. ఐదు రాష్ట్రాల ఎన్నికలు..ఎప్పుడంటే?

5 States Elections 2022: ఈ ఏడాది జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ఆయా రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఐదు రాష్ట్రాల్లో కలిపి 690 అసెంబ్లీ సీట్లకు ఎలక్షన్స్ కండక్ట్ చేయనున్నారు. ఇందులో గోవాలో 40, పంజాబ్‌లో 117, యూపీలో 403, మణిపూర్‌లో 28, ఉత్తరాఖండ్‌లో 70 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ అసెంబ్లీ స్థానాలకు వివిధ దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇకపోతే ఎలక్షన్స్ నిర్వహణకు వీలుగా ఈసీ(ఎలక్షన్ కమిషన్) షెడ్యూల్ రిలీజ్ చేసింది.

5 States Elections 2022
5 States Elections 2022

దేశంలో రోజురోజుకూ కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు చర్యలు తీసుకోబోతున్నారు అధికారులు. ప్రతీ పోలింగ్ బూత్‌లో ఓటర్ల సంఖ్యను 1,250కి తగ్గిస్తున్నారు.గతంలో ఈ సంఖ్య 1,500గా ఉండగా, ఈ సారి కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తం ఐదు రాష్ట్రాల్లో కలిపి 18.34 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని తమ ప్రభుత్వాలను ఏర్పరుచుకోనున్నారు.

Also Read: ఐదు రాష్ట్రాల ఎన్నికలు: 2024లో బీజేపీ గెలుస్తుందా లేదా తేలబోతోంది?

ఇకపోతే ఈ సారి అభ్యర్థులకు ఆన్ లైన్‌లో నామినేషన్ వేసుకునే ఫెసిలిటీని ఈసీ కల్పించింది. ఇకపోతే అభ్యర్థులపై నమోదైన క్రిమినల్ కేసులను కంపల్సరీగా టీవీ చానళ్లు, పత్రికల్లో బహిర్గతం చేయాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర సూచించారు. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లో ఎన్నికలు ఎనిమిది విడతలుగా జరగనున్నాయి. ఇకపోతే రాజకీయ పార్టీలు కూడా బాధ్యతాయుతంగా ఎన్నికల నిబంధనలు పాటించడంతో కొవిడ్ రూల్స్ పాటించాల్సి ఉంటుంది.

ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చాలా సీరియస్ గా తీసుకుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సంగతులు అలా ఉంచితే.. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల విషయమై ఎన్నికల సంఘం భారీ కసరత్తు చేసింది. జాతీయ కొవిడ్ టాస్క్ ఫోర్స్, కేంద్ర ఆరోగ్య శాఖతో పలు సార్లు సమావేశాలను నిర్వహించింది. ఎన్నికల నిర్వహణపైన రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకుంది. అన్ని పార్టీలు కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరింది.

Also Read: పవన్ కోసం ప్రధాన పార్టీల ఆరాటం.. జనసేనాని ఎవరి వైపు..?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Exit mobile version