Warner: మార్చిలో ఐపీఎల్ మ్యాచులు జరగనున్నాయి. ఇందు కోసం ఆటగాళ్ల వేలం జరుగుతోంది. దీంతో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను ఎంచుకుంటున్నాయి. హైదరాబాద్ సన్ రైజర్స్ కెప్టెన్ గా వార్నర్ ను తప్పించడం సంచలనం సృష్టిస్తోంది. 2016లో ఐపీఎల్ సన్ రైజర్స్ ను విజేతగా నిలిపిన వార్నర్ ను జట్టు నుంచి తప్పించడంతో అతడు ఖంగుతిన్నాడు. జట్టు కోసం శ్రమించిన తనను జట్టు నుంచి తొలగించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
గత ఏడాది ఆరు మ్యాచుల్లో ఒక్క విజయమే సొంతం చేసుకోవడంతో వార్నర్ పై వేటు పడిన సంగతి తెలిసిందే. కానీ తనను సంప్రదించకుండానే చర్యలు తీసుకోవడంతో ఆందోళన చెందుతున్నాడు. తాజా పరిణామాలతో వార్నర్ అనుమానాలు వ్యక్తం చేశాడు. జట్టు విజయం కోసం శ్రమించినా తనకు మాట మాత్రమైనా చెప్పకుండా నిర్ణయం తీసుకోవడంపై విచారం వ్యక్తం చేశాడు.
మరోవైపు జట్టు కెప్టెన్ గా విలియమ్సన్ కు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఏవో కొన్ని మ్యాచుల్లో ఫలితం తారుమారైతే జట్టు నుంచి తీసేస్తారా అని వాపోతున్నాడు. నాతో సంప్రదిస్తే తానే స్వయంగా తప్పుకునే వాడినని చెప్పాడు. యాజమాన్యం చర్య బాధించిందని పేర్కొన్నాడు. అభిమానుల అంచనాల మేరకు తన ప్రదర్శన ఉందని అభివర్ణించాడు.
Also Read: IPL 2022: ఐపీఎల్ 2022లో కీలక మార్పులు.. బీసీసీఐ సంచలన నిర్ణయం
దీంతో ఐపీఎల్ లో అద్బుతాలు చేసేందుకు అన్ని జట్టు సిద్ధమవుతున్నాయి. గత అనుభవాలను దృష్టిలో మెరుగైన ఆట తీరు ప్రదర్శించాలని భావిస్తున్నాయి. ట్రోఫీ తీసుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. వేగవంతమైన ఆటతో ఎదుటి జట్టును ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించనున్నాయని తెలుస్తోంది. దీనికి మరికొన్ని రోజులు ఆగాల్సిందే. కరోనా కారణంగా ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణ సాధ్యమయ్యేనా అనే అనుమానాలు కూడా లేకపోలేదు.
Also Read: Ind vs SA: సౌతాఫ్రికాతో టీమిండియా ఫైట్.. గెలుపు డిసైడ్ అయ్యేది నేడే.. ఏం జరుగనుంది?