US Open 2024 : యూఎస్ ఓపెన్ లో కొకో గాఫ్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈమె డిపెండింగ్ ఛాంపియన్ కూడా. ఈ నేపథ్యంలో ఈసారి కచ్చితంగా టైటిల్ సాధిస్తుందని అందరూ భావించారు. కానీ అనుకోకుండా ప్రి క్వార్టర్స్ లోనే ఓటమిపాలైంది. ఎమ్మా నావరో చేతిలో బొటని పాలైంది. మ్యాచ్ మొత్తం కొకో గాఫ్ అత్యంత దారుణమైన ఆట తీరు ప్రదర్శించింది. ఏకంగా 19 డబుల్ ఫాల్ట్ లు చేసింది. అవి ఆమె విన్నర్ల (14) సంఖ్య కంటే ఎక్కువ ఉండడం విశేషం. 60 అనవసర తప్పిదాలు చేయడంతో కొకో దారుణంగా నిష్క్రమించింది. మరోవైపు నవారో 20 విన్నర్లు కొట్టింది. నాలుగుసార్లు కొకో సర్వీస్ ను ప్రతిఘటించింది. 23 సంవత్సరాల నవారో యూఎస్ ఓపెన్ క్వార్టర్స్ చేరడం ఇది తొలిసారి. గతంలో ఆమె ఎన్నడూ తొలి రౌండ్ దాటలేదు. ఇక రెండవ సీడ్ బెలారస్ ప్రాంతానికి చెందిన సబలెంక క్వార్టర్స్ లోకి దూసుకెళ్లింది. నాలుగో రౌండ్ లో ఆమె మెర్టెన్స్ ను మట్టికరిపించింది. ఏడవ సీడ్ జెంగ్(చైనా) ప్రి క్వార్టర్స్ లో క్రొయేషియాకు చెందిన వెకిచ్ ను ఓడించింది. మరో ప్రి క్వార్టర్స్ పోటీలలో ముచోవా, ఆరో సీడ్ పెగులా విజయం సాధించారు. వీరు షావోలిని, స్నైధర్ పై విజయం సాధించారు.
పురుషుల విభాగంలో
పురుష విభాగంలో అమెరికా ఆటగాడు ఫ్రాన్సిన్ తియో ఫె వరుసగా మూడో ఏడాది కూడా యూఎస్ ఓపెన్ క్వార్టర్స్ ఫైనల్ లో ప్రవేశించాడు 4 రౌండ్లో అతడు అలెక్సి పై విజయం సాధించాడు. మరోవైపు ప్రి క్వార్టర్స్ లో దిమిత్రవ్ రుబ్లేవ్ ను ఓడించాడు. ఎనిమిదవ సీడ్ రూడ్ కూడా ఓటమిపాలయ్యాడు. నాలుగో సీడ్ జ్వె రెవ్ క్వార్టర్స్ లోకి ప్రవేశించాడు. అతడు అమెరికాకు చెందిన నకషిమను ఓడించాడు.
భారత్ కథ ముగిసింది
పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న ఓటమిపాలయ్యాడు మూడవ రౌండ్లో బోపన్న, ఆస్ట్రేలియాకు చెందిన ఎబ్డెవ్ జంట గొంజాలెంజ్, మొల్తేని జంట చేతిలో ఓడిపోయారు. బోపన్న జోడి పరాజయంతో పురుషుల డబుల్స్ విభాగంలో భారత్ పోరాటం ముగిసింది. ఇప్పటికే వేరువేరు భాగస్వామ్యలతో సుమిత్ నగాల్, యూకీ బాంబ్రి, శ్రీరామ్ బాలాజీ ఇప్పటికే ఓటమిపాలయ్యారు. టాప్ సీడ్ ఆటగాళ్లు వెంట వెంటనే నిష్క్రమిస్తున్న నేపథ్యంలో ఈసారి కొత్త ఛాంపియన్ గా ఎవరు ఆవిర్భవిస్తారో అంతు పట్టకుండా ఉంది. అల్కారస్, జకోవిచ్ ఓడిపోవడంతో యూఎస్ ఓపెన్ లో పెను సంచలనాలు నమోదయ్యాయి. అమెరికా కుర్రాడు ఫ్రాన్సిన్ కొత్త ఛాంపియన్ గా అవతరిస్తాడని టెన్నిస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్టుగానే అతడి ఆట తీరు కూడా ఉంది.