What happened to Rohit Sharma: టీమిండియా మెన్స్ క్రికెట్ లో రోహిత్ శర్మకు ప్రత్యేక చరిత్ర ఉంటుంది. ధోని తర్వాత టీమిండియా కు పొట్టి ప్రపంచ కప్ అందించిన ఘనతను అతడు సొంతం చేసుకున్నాడు. అంతేకాదు ఈ ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ని కూడా టీమిండియా కు అందించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అటువంటి ఆటగాడు గత ఏడాది పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. ఇక ఈ ఏడాది సుదీర్ఘ ఫార్మాట్ నుంచి వైదొలిగాడు. ఒక రకంగా ఈ నిర్ణయాలు అతడి అభిమానులకు ఇబ్బంది కలిగించేవే. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో మాత్రమే రోహిత్ కొనసాగుతున్నాడు. ఆ ఫార్మాట్లో భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. వచ్చే వరల్డ్ కప్ దాకా టీమ్ ఇండియాకు ఆస్థానంలో నాయకత్వం వహించి.. ట్రోఫీ అందించాలని రోహిత్ భావిస్తున్నాడు. అయితే అప్పటిదాకా రోహిత్ ను జట్టులో ఉండనిస్తారా? జట్టుకు నాయకుడిగా కొనసాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది.
రోహిత్ అద్భుతమైన బ్యాటర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే అతడు బొద్దుగా ఉంటాడు.. వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీయలేడు. స్లిప్, గల్లీ మినహా లాంగ్ ఆన్ లో ఫీల్డింగ్ చేయలేడు.. ఇవి అతడికి ప్రతిబంధకం. అందువల్లే అతడిని దక్షిణాఫ్రికాలో జరిగే వరల్డ్ కప్ వరకు జట్టు నాయకుడిగా కొనసాగించరని వార్తలు వస్తున్నాయి.. విరాట్ కోహ్లీకి జట్టులో అవకాశం ఉంటుందని.. ఎందుకంటే అతడి శరీర సామర్థ్యం దానికి ఉపకరిస్తుందని నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఫోటో తెగ కనిపిస్తోంది.. ఆ ఫోటో లో రోహిత్ శర్మ సన్నజాజితీగ లాగా దర్శనమిస్తున్నాడు.
ఐపీఎల్ తర్వాత రోహిత్ మైదానంలో కనిపించలేదు. సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకున్న తర్వాత.. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో భారత్ ఆసియా కప్ తర్వాతనే మ్యాచులు ఆడే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ తో సిరీస్ ఉన్నప్పటికీ.. అక్కడ నెలకొన్న పరిస్థితుల వల్ల దానిని వాయిదా వేశారు. దీంతో తన ఫిట్నెస్ పై రోహిత్ దృష్టి సారించాడు. బరువు చాలా వరకు తగ్గాడు. ఒకప్పుడు బొద్దుగా కనిపించిన అతడు.. ఇప్పుడు సన్నజాజి తీగలాగ దర్శనమిస్తున్నాడు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతున్నాయి. బహుశా వరల్డ్ కప్ వరకు రోహిత్ ఇదే స్థాయిలో ఫిట్నెస్ మైంటైన్ చేస్తాడని అతని అభిమానులు అంటున్నారు. అదే గనక జరిగితే టీమ్ ఇండియాకు రోహిత్ నాయకత్వం వహించే అవకాశం ఉంది.