Ranam heroine Kamna Jethmalani: మన టాలీవుడ్ లో కొంతమంది హీరోయిన్లు చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఎప్పటికీ అలా ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోతుంటారు. వాళ్ళ కెరీర్ లో ఒకటి రెండు తప్ప పెద్ద సూపర్ హిట్ సినిమాలు కూడా ఉండవు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తు ఉంటారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు కామ్నా జెఠ్మలానీ(Kamna Jethmalani). ఈమె మన టాలీవుడ్ లోకి ప్రేమికులు అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. ఈ సినిమా పెద్దగా సక్సెస్ సాధించకపోయినప్పటికీ ఆమెకు అవకాశాలు బాగానే వచ్చాయి. ఈ చిత్రం తర్వాత తమిళం లో ఒక సినిమా చేసింది కానీ పెద్దగా కలిసి రాలేదు. మళ్లీ టాలీవుడ్ లోకి ఈమె ‘రణం’ చిత్రం తో రీ ఎంట్రీ ఇచ్చింది . ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.
ఇప్పటికీ ఈమెను ‘రణం’ హీరోయిన్ అనే పిలుస్తున్నారంటే ఆ సినిమా ఈమెకు తెచ్చిన గుర్తింపు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా తర్వాత ఆమెకు అవకాశాలు బాగానే వచ్చాయి. కానీ ఆమె కెరీర్ లో మళ్లీ ‘సామాన్యుడు’ ఒక్కటే కమర్షియల్ హిట్ గా నిల్చింది. మిగిలిన సినిమాలేవీ పెద్దగా ఆమెకు వర్కౌట్ అవ్వలేదు. మద్యమద్యలో ఆమె కన్నడ, మలయాళం సినిమాల్లో కూడా నటిస్తుండేది కానీ, రణం రేంజ్ సక్సెస్ ఎక్కడా దొరకలేదు. కెరీర్ బాగా డౌన్ అవ్వడం తో ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేసి 2014 వ సంవత్సరం లో బెంగళూరు కి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సూరజ్ ని పెళ్లాడింది. ఇక అప్పటి నుండి ఫ్యామిలీ లైఫ్ ని సుఖంగా గడుపుతూ వస్తున్న ఈమె 2022 వ సంవత్సరం లో ‘గరుడ’ అనే కన్నడ చిత్రం తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక అవకాశాలు వస్తే వరుసగా సినిమాలు చేస్తుందని అంతా అనుకున్నారు కానీ, రీ ఎంట్రీ లో అవకాశం ఇచ్చేవాళ్ళు కరువు అయ్యారు.

సినిమాల్లో అవకాశాలు కరువు అయినా, ఓటీటీ వెబ్ సిరీస్ లలో మాత్రం ఈమెకు అవకాశాలు బాగానే వస్తున్నాయి. రీసెంట్ గానే ఆహా మీడియా లో స్ట్రీమింగ్ అయిన ‘నెట్వర్క్’ అనే వెబ్ సిరీస్ లో ఈమె కీలక పాత్ర పోషించింది. ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉండే కామ్నా జెఠ్మలానీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలా ఈమెకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారనే విషయం ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారానే తెలిసింది. ఇద్దరూ కూడా చూసేందుకు ఎంతో చక్కగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు పెరిగి పెద్ద అయ్యారు కూడా. ఎలా ఉన్నారో మీరే చూసి చెప్పండి. భవిష్యత్తులో వీళ్ళు పెరిగి పెద్ద అయ్యాక కామ్నా కంటే అందంగా తయారు అయ్యేట్టుగా కనిపిస్తున్నారు.