Team India: టీమిండియా దక్షిణాఫ్రికా దేశాల మధ్య జరుగుతున్న టీ20 మ్యాచుల్లో టీమిండియాకు చేదు ఫలితమే ఎదురైంది రెండు మ్యాచుల్లో పరాజయం పాలై విమర్శలు మూటగట్టుకుంది. అబిమానుల ఆశలను వమ్ము చేసింది. దీంతో ప్రేక్షకులు టీమిండియాపై సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రికెటర్లు తమ స్థాయికి తగ్గట్లుగా ప్రదర్శనలు చేయడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మూడో టీ20 మ్యాచ్ పై అందరి దృష్టి పడింది. ప్రస్తుతం కచ్చితంగా టీమిండియా గెలిస్తేనే ఈ సిరీస్ లో నిలుస్తుంది. లేదంటే సిరీస్ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి ఎదురు కావడం గమనార్హం. ఇక మూడో మ్యాచ్ లో చావో రేవో విశాక వేదికగా తేల్చుకోనుంది.

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అందుబాటులో లేకపోవడంతో రిషబ్ పంత్ సారథ్యం వహిస్తున్నారు. అయితే అతడి కెప్టెన్సీ సరిగా లేదనే విమర్శలు వస్తున్నాయి. వేగంగా నిర్ణయాలు తీసుకుని ఆటగాళ్లలో స్థైర్యం నింపాల్సిన బాధ్యత కెప్టెన్ దే కావడం గమనార్హం. దీంతోనే రెండు మ్యాచుల్లో ఓటమి పాలైనట్లు తెలుస్తోంది. దీంతో అప్రదిష్ట మూటగట్టుకుంది. ఈ క్రమంలో నేడు విశాఖలో జరగబోయే మ్యాచులో ఎలాగైనా నిలవాలని టీమిండియా భావిస్తోంది.

మిడిలార్డర్ వైఫల్యం కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీంతోనే రెండు మ్యాచుల్లో వరుసగా ఓటమి చవిచూడటం తెలిసిందే. దీంతో టీమిండియా వైఫల్యాలను సమీక్షించుకుని మరో ఓటమికి గురికాకుండా చూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దినేష్ కార్తీక్ ను ముందు బ్యాటింగ్ కు పంపితే ఫలితం మరోలా ఉంటుందని తెలుస్తోంది. అందుకే మిడిలార్డర్ ను సరి చేసుకోవాలి. ఇప్పటికైనా ుణపాఠం నేర్చుకుంటే మంచిది. లేదంటే అనవసర ప్రయోగాలకు పోయి మళ్లీ ఓటమి చెందితే అభిమానుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది.

బౌలింగ్ లో కూడా టీమిండియా మేల్కోవాలి. రెండో మ్యాచ్ లో భువనేశ్వర్ కుమార్ నాలుగు వికెట్లు తీసినా ఫలితం మాత్రం శూన్యం. మరోవైపు స్పిన్నర్లు చాహల్, అక్షర్ పటేల్ 5 ఓవర్లలో 68 పరుగులు ఇచ్చి ఒక వికెట్ మాత్రమే తీయడం వివాదాస్పదమైంది. దీంతో బౌలింగ్ లో కూడా టీమిండియా ఇంకా మెరుగు కావాల్సి ఉంది. బౌలింగ్ లో ఇంకా మెలకువలు పాటించి ప్రత్యర్థి జట్టును ఇబ్బంది పెట్టేలా తయారు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.