IPL 2024 Auction: 2024 ఐపీఎల్ లో ఆడడానికి ముందే మినీ వేలాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక ఈ మినీ వేలం డిసెంబర్ 19వ తేదీన దుబాయ్ వేదికగా జరగనుంది. ఇక ఇందులో 1166 మంది ప్లేయర్లు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అయితే అందులో 333 మందితో బీసీసీఐ జాబితాను ఫైనల్ చేసింది. ఒక దీంతో ఐపీఎల్ మినీ వేలం ఎక్కడ జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది.ఒక ప్రాంచైజ్ ఎంతమంది ప్లేయర్లను తీసుకోవచ్చు, అలాగే ఒక టీమ్ ఒక ప్లేయర్ మీద గరిష్టంగా ఎంత డబ్బులు పెట్టడానికి రెడీగా ఉంది.అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
గత సంవత్సరం మెగా వేలం జరిగింది అందులో చాలా మంది ప్లేయర్లను మళ్లీ తీసుకున్నరు. కానీ ఇప్పుడు జరగబోయేది మినీ వేలం కాబట్టి ఇందులో కొంతమంది ప్లేయర్లను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక ప్రాంచైజ్ ఎవరెవరు ప్లేయర్లని రిలీజ్ చేసిందో వాళ్ల ప్లేస్ లో మరి కొంతమంది ప్లేయర్లతో భర్తీ చేయడానికి మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. ప్రాంచైజ్ దగ్గర ఉన్న డబ్బులను బట్టి వాళ్ళు ఎంతమంది ప్లేయర్లను తీసుకోవాలి అనేది వాళ్ళు నిర్ణయించుకొని తీసుకుంటారు.
ఇక ప్రతి ప్రాంచైజ్ దగ్గర పర్స్ వాల్యూ 100 కోట్లు ఉండగా, ప్రస్తుతం లో ఉన్న ప్లేయర్లకి చెల్లించగా, మిగిలిన దాంట్లో మాత్రమే వాళ్ళ టీం తరఫున ప్లేయర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ప్లేయర్లను కలుపుకొని మొత్తం 100 కోట్ల వరకు ఒక ప్రాంచైజ్ ఖర్చు చేయాల్సి ఉంటుంది…
ఇక ఐపీఎల్ మినీ యాక్షన్ కోసం ప్లేయర్లను మూడు కేటగిరీలుగా విభజించడం జరిగింది. ఒకటి క్యాప్డ్ ప్లేయర్, రెండు అన్ క్యాపడ్ ప్లేయర్, మూడు నాన్ ఇండియన్ ప్లేయర్స్ అంటే ఇందులో విదేశీ ప్లేయర్లు, ఓవర్సీస్ ప్లేయర్లు ఉంటారు. ఇక ఇందులో క్యాప్డ్ ప్లేయర్స్ అంటే ఇంటర్నేషనల్ టీం కి సెలెక్ట్ అయి మ్యాచ్ లు ఆడేవాళ్లు అన్ క్యపుడ్ ప్లేయర్లు అంటే ఇంకా ఇంటర్నేషనల్ టీం లోకి సెలెక్ట్ అవకుండా ఉన్నవాళ్లు ఇక మూడో క్యాటగిరిలో క్యపడ్, అన్ క్యాపడ్ విదేశీ ప్లేయర్లు ఉంటారు…
ఇక ఐపీఎల్ లో ఎప్పటిలాగే అర్ టి యం రూల్ కూడా అమలులో ఉందా అనే విషయం తెలియాల్సి ఉంది. ఆర్ టి యం అంటే రైట్ టు మ్యాచ్… దీని అర్థం ఏంటి అంటే గత సీజన్ లో ఒక ప్రాంచైజి కి ఆడిన ప్లేయర్ ఇప్పుడు బయటికి వచ్చి వేలం లో పాల్గొంటే ఆ ప్లేయర్ ని ఈ వేలం లో ఏ టీమ్ అయితే దక్కించుకుంటుందో అంత మొత్తాన్ని ఈ ప్లేయర్ గత సీజన్ లో ఆడిన ప్రాంచైజ్ ఇచ్చి తిరిగి మళ్ళీ తీసుకునే అవకాశం ఉండటాన్నే రైట్ టు మ్యాచ్ రూల్ అంటారు.ఇక ఇలాంటి రూల్ ని ఉపయోగించే 2018 లో చెన్నై డుప్లిసిస్ ని తీసుకుంది. అలాగే ముంబై ఇండియన్స్ టీమ్ పోలార్డ్ ని కూడా తీసుకుంది…ఇలా ఈ రూల్ ఉంటే కొన్ని జట్లకు మంచి మేలు జరిగే అవకాశం కూడా ఉంది…
ఇక ఈ వేలం లో ఒక ప్రాంచైజ్ గరిష్ఠంగా 25 మంది ని తీసుకోవచ్చు అంటే వాళ్ళకి ఉన్న పర్స్ వాల్యూ అంటే 100 కోట్ల లోపు వస్తె 25 మందిని తీసుకోవచ్చు…ఇక అందులో 17 మంది ఇండియన్ ప్లేయర్లు ఉండాలి 8 మంది విదేశీ ప్లేయర్లు ఉండాలి…
ఇక ప్లేయర్ల బేస్ ప్రైజ్ అనేది వాళ్లే నిర్ణయించుకుంటారు కాబట్టి కనిష్టం గా 20 లక్షల బేస్ ప్రైజ్ నిర్ణయించగా,కొందరు 50 లక్షలు, కోటి , 2 కోట్ల వరకు కూడా బేస్ ప్రైజ్ తో వచ్చే ప్లేయర్లు ఉన్నారు…ఇక కనిష్టంగా అయితే 20 లక్షలు, గరిష్ఠంగా అయితే 2 కోట్ల వరకు బేస్ ప్రైజ్ తో వచ్చే అవకాశం అయితే ఉంది..ఇక ఇది ఇలా ఉంటే ఈసారి ఆక్షన్ లో ఇంటర్నేషనల్ టీమ్ కి ఆడిన ముగ్గురు ఇండియన్ బౌలర్లు ఉండటం విశేషం… హర్షల్ పటేల్, శార్దుల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్ లాంటి ప్లేయర్లు 1.5 కోట్ల బేస్ ప్రైజ్ తో బరిలోకి దిగుతున్నారు…
ఐపీఎల్ 2024 వేలం ప్రత్యేకతలు ఏంటి? ఎక్కడ జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది అనే విషయాలు అందరిలో అసక్తిని రేకెత్తిస్తున్నాయి…
భారత్ అవతల జరుగుతున్న తొలి వేలం కావడం తో దీనిమీద అందరి దృష్టి ఉంది. ఇక డిసెంబర్ 19న దుబాయిలోని కోకా కోలా ఏరేనా హోటల్‌లో ఈ వేలం జరగనుంది. ఇక ఇప్పటివరకు జరిగిన ప్రతి వేలం కూడా ఇండియా లోనే జరిగింది. కానీ మొదటిసారి వేరే దేశంలో వేలం జరగబోతోంది. ఇండియన్ టైమింగ్ ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు వేలం ప్రారంభం అవుతుంది. ఒకే రోజులో ఈ వేలం ముగిసిపోతుంది. మినీ వేలం కావడం మళ్ళీ విదేశాల్లో నిర్వహిస్తుండటం వల్ల దీన్ని ఒక్క రోజుకు కుడించినట్టు గా తెలుస్తుంది…
ఇక 2024 ఐపీఎల్ వేలాన్ని ఎక్కడ చూడవచ్చు అంటే స్టార్ స్పోర్ట్స్, జియా సినిమాలో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. ఇక సెల్‌ఫోన్ ద్వారా చూడవచ్చు లేదా టీవీలో అయిన ఈ వేలాన్ని ఉచితంగా చూడవచ్చు. ఇవి ఇండియాలో చూసేవారికి మాత్రమే వర్తిస్తాయి.ఇక వేరే దేశాల్లో వేరే బ్రాడ్ కాస్టర్‌లు ఈ ఈవెంట్‌ను లైవ్ స్ట్రీమింగ్ అందించనున్నాయి. ఇక ఇది ఇలా ఉంటే ఏ టీమ్ అభిమానులు ఆ టీమ్ లోకి ఏ ప్లేయర్ వస్తున్నాడు అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…