Free Bus Travel: 6 గ్యారంటీలలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా ఆడవాళ్లు పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం విజయవంతంగా అమలవుతోంది. ఉచితం కావడంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు మహిళలు ఎగబడుతున్నారు. ఫలితంగా బస్సులన్ని రద్దీగా ఉంటున్నాయి. అయితే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో మహిళల స్పందన తెలుసుకునేందుకు కొంతమంది యూట్యూబ్ జర్నలిస్టులు ప్రయత్నం చేశారు. అయితే అందులో ఓ మహిళ చెప్పిన సమాధానం కాంగ్రెస్ నాయకులను కలవరపాటుకు గురిచేసింది.
యూట్యూబ్ ఛానల్ విలేఖరి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళల స్పందన తెలుసుకునేందుకు ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగా ఒక్కొక్క మహిళను ప్రశ్నించడం మొదలుపెట్టాడు. అయితే ఇలా ప్రశ్నిస్తున్న ఆ విలేఖరికి ఆ మహిళ చెప్పిన సమాధానం దిమ్మతిరిగేలా చేసింది. సీట్లో కూర్చున్న ఓ వృద్ధురాలిని అమ్మ ఎక్కడ నుంచి వస్తున్నావ్? ఆర్టీసీలో ఉచిత ప్రయాణం నీకు ఎవరు చెప్పారు? అని అడిగితే కేసీఆర్ అని సమాధానం చెప్పింది. దీంతో ఆ ప్రశ్న అడిగిన విలేఖరికి దిమ్మ తిరిగి పోయినంత పనైంది. అతడు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆ మహిళ వినిపించుకోలేదు. పైగా ఈ బస్సులో దేనికోసం ప్రయాణం చేస్తున్నావని అడిగితే కూర కోసం అని చెప్పడం ఆ విలేకరిని మరింత ఇబ్బంది పెట్టింది.
అయితే ఈ వ్యవహారం మొత్తాన్ని కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. పైగా ఆ ప్రశ్న అడిగిన విలేకరి క్యూ న్యూస్ లో పనిచేస్తుంటాడు. ఆ ఛానల్ తీన్మార్ మల్లన్నది. మొన్నటిదాకా ప్రశ్నించే గొంతుకగా తనను తాను అభివర్ణించుకున్న తీన్మార్ మల్లన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు. అయితే ఆ ఛానల్ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆ వృద్ధురాలు కేసీఆర్ పేరు చెప్పడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసిఆర్ అనే పేరుకున్న ప్రాధాన్యాన్ని గుర్తించాలని కోరుతున్నారు. ఇదే సమయంలో మరి కొంతమంది నెటిజన్లు ఒక అడుగు ముందుకు వేసి బ్రహ్మానందం వీడియోని జత చేశారు. బ్రహ్మానందాన్ని రేవంత్ రెడ్డితో పోల్చి.. అతడి చుట్టూ హేళనగా ఎగురుతున్న వ్యక్తులను తెలంగాణ ప్రజలతో పోల్చుతూ ట్రోల్ చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.