Chiranjeevi And Pawan Kalyan: 2023 లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు చేసిన మిస్టేక్స్ ఇవే…

2023వ సంవత్సరంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరికీ బ్యాడ్ టైం నడిచిందనే చెప్పాలి. వీళ్ళిద్దరూ ఎంతో ఇష్టంగా ఏరికోరి చేసిన రెండు రీమేక్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలాయి.

Written By: Gopi, Updated On : December 12, 2023 2:20 pm

Chiranjeevi And Pawan Kalyan

Follow us on

Chiranjeevi And Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ మరే ఫ్యామిలీ కి లేదనే చెప్పాలి. ఎందుకంటే దాదాపు అరడజన్ మంది కంటే ఎక్కువ మంది హీరోలు ఉన్నారు. అలాగే చిరంజీవి లాంటి ఒక మెగాస్టార్ చాలా సంవత్సరాల క్రితమే ఇండస్ట్రీకి వచ్చి స్టార్ గా ఎదిగిన తీరు సక్సెస్ లు అన్నీ కూడా మెగా ఫ్యామిలీని ఈరోజు తారస్థాయిలో నిలబెట్టాయి. ఇక అతని నీడలో వచ్చిన ఫ్యామిలీ హీరోలు అందరూ కూడా ఇదే రీతిలో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లు స్టార్ హీరోలు…

అయితే 2023వ సంవత్సరంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరికీ బ్యాడ్ టైం నడిచిందనే చెప్పాలి. వీళ్ళిద్దరూ ఎంతో ఇష్టంగా ఏరికోరి చేసిన రెండు రీమేక్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలాయి.ఇక ముందుగా చిరంజీవి భోళా శంకర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అది భారీ డిజాస్టర్ ని అందుకుంది. ఇక తమిళ్ లో వచ్చిన వీరం సినిమాకి రీమేక్ అవడం అలాగే దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించిన విధానం కూడా ప్రేక్షకులకు బోర్ కొట్టించడం తో ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బ్రో సినిమా కూడా తమిళంలో వచ్చిన వినోదయ సీతంకి రీమేక్ గా రూపొందింది.

ఈ సినిమా కూడా ప్రేక్షకులు ఆశించిన రేంజ్ లో ఆకట్టుకోలేదు ఇకదానితో ఒకే సంవత్సరంలో అన్నాదమ్ములిద్దరికి భారీ నష్టాన్ని మిగిల్చాయనే చెప్పాలి. ఇకదానితో వీళ్ళిద్దరూ కొద్దిరోజుల వరకు రీమేక్ లా జోలికి వెళ్లకూడదని నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ముఖ్యంగా చిరంజీవి అయితే ఇంతకుముందు రీమేక్ చేస్తానని కమిట్ అయిన కొన్ని సినిమాలను కూడా ఇప్పుడు హోల్డ్ లో పెట్టి స్ట్రెయిట్ సినిమాలు మీద ఫోకస్ పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే ఇప్పుడు వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న విశ్వంభర సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తే చిరంజీవి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయి ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

నిజానికి ఈ సినిమా సోషియో ఫాంటసీ సినిమాగా తెరకెక్కుతుంది. ఒకప్పుడు చిరంజీవి హీరోగా వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి టైప్ ఆఫ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న గా తెలుస్తుంది. దాంతో ఈ సినిమా పైన ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి…