West Indies Vs England: ఒక ఓవర్ లో 30 పరుగులా? ఎందుకైనా మంచిది.. నువ్వు రెస్ట్ తీసుకో అన్నా..

అమెరికాతో జరిగిన సూపర్ -8 మ్యాచ్ లో దక్షిణాఫ్రికా గెలిచింది. దక్షిణాఫ్రికా జట్టు ఆటగాడు క్వింటన్ డికాక్ అమెరికా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 40 బంతుల్లో 74 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా గెలిచింది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 20, 2024 2:31 pm

West Indies Vs England

Follow us on

West Indies Vs England: టి20 అంటేనే వేగానికి సిసలైన కొలమానం. దూకుడుకు అసలైన నిర్వచనం. ఇలాంటి పొట్టి క్రికెట్ టోర్నీలో బ్యాటర్లకు ఏ స్థాయిలో అవకాశాలుంటాయో.. బౌలర్లకూ అన్ని సౌలభ్యాలు ఉంటాయి. గత టి20 వరల్డ్ కప్ టోర్నీలలో బ్యాటర్లు పండగ చేసుకోగా.. ఈసారి బౌలర్లు రెచ్చిపోతున్నారు. అమెరికా వేదికగా జరిగిన అన్ని మ్యాచ్ లలో ఆధిపత్యం ప్రదర్శించారు. వైవిధ్యమైన బంతులు వేస్తూ సరికొత్త చరిత్ర సృష్టించారు. అయితే సూపర్ -8 మ్యాచ్ లకు వచ్చేసరికి ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బౌలర్లపై బ్యాటర్ల ఆధిపత్యం మొదలైంది.

అమెరికాతో జరిగిన సూపర్ -8 మ్యాచ్ లో దక్షిణాఫ్రికా గెలిచింది. దక్షిణాఫ్రికా జట్టు ఆటగాడు క్వింటన్ డికాక్ అమెరికా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 40 బంతుల్లో 74 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా గెలిచింది. వాస్తవానికి లీగ్ మ్యాచ్లలో అమెరికా బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేశారు. భారత్ లాంటి జట్టును కూడా ఇబ్బంది పెట్టారు. కానీ సూపర్ -8 కు వచ్చేసరికి తేలిపోయారు. ఇక గురువారం సూపర్ -8 మ్యాచ్ లో భాగంగా వెస్టిండీస్ , ఇంగ్లాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ బౌలర్ రొమారియో షెఫర్డ్ దారుణమైన రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు.

ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు.. 20 ఓవర్లు పూర్తిస్థాయిలో ఆడి.. నాలుగు వికెట్లు కోల్పోయి 180 రన్స్ చేసింది. వెస్టిండీస్ బ్యాటర్లలో చార్లెస్ 38, పావెల్ 36, రూథర్ ఫర్డ్ 28 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో లివింగ్ స్టోన్, ఆర్చర్, మొయిన్ అలీ, ఆదిల్ రషీద్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. వెస్టిండీస్ విధించిన 180 పరుగుల విజయ లక్ష్యాన్ని.. ఇంగ్లాండ్ జట్టు కేవలం 17.3 ఓవర్లలో సాధించింది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 47 బంతుల్లో 87 పరుగులు చేశాడు. వెస్టిండీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. ముఖ్యంగా రొమారియో షెఫర్డ్ వేసిన 16 ఓవర్లో సాల్ట్ రెచ్చిపోయి ఆడాడు . మూడు భారీ సిక్సర్లు, కళ్ళు చెదిరే విధంగా మూడు ఫోర్లు కొట్టి అలరించాడు. తొలి బంతిని ఫోర్ గా, రెండవ బంతిని సిక్సర్, మూడో బంతి ఫోర్, నాలుగో బంతి సిక్సర్, ఐదో బంతి భారీ సిక్సర్, ఆరో బంతిని సులువుగా బౌండరీ కొట్టేసి 30 పరుగులు పిండుకున్నాడు. దీంతో ఒకసారిగా షెఫర్డ్ డీలర్పడ్డాడు. వాస్తవానికి అప్పటిదాకా మ్యాచ్ రెండు జట్లకు సమతూకంగా ఉంది. ఎప్పుడైతే షెఫర్డ్ 16వ ఓవర్ వేయడం మొదలు పెట్టాడో.. అప్పుడే సాల్ట్ దూకుడుగా ఆడటం ప్రారంభించాడు. ఫలితంగా ఇంగ్లాండ్ జట్టు 17.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసుకుంది.

ఒకే ఓవర్ లో 30 పరుగులు ఇవ్వడం ద్వారా.. షెఫర్డ్ అత్యంత చెత్త రికార్డు తన పేరు మీద లిఖించుకున్నాడు. అయితే ఈ జాబితాలో ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఉన్నాడు. 2007లో టి20 వరల్డ్ కప్ లో టీమిండియా ఆటగాడు యువరాజ్ సింగ్ బ్రాడ్ బౌలింగ్ లో 6 బంతులకు, ఆరు సిక్సర్లు కొట్టాడు. బ్రాడ్ తర్వాతి స్థానంలో 36 పరుగులతో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ అజ్మతుల్లా ఓమర్జాయ్ ఉన్నాడు. ఈ జాబితాలో షెఫర్డ్ ఆరవ స్థానంలో ఉన్నప్పటికీ.. చెత్త బౌలింగ్ ద్వారా అపఖ్యాతి మూటగట్టుకున్నాడు. వాస్తవానికి షెఫర్డ్ ఆ ఓవర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఉంటే మ్యాచ్ వెస్టిండీస్ వైపు మొగ్గేది..” ఒక ఓవర్లో 30 పరుగులు సమర్పించుకున్నావు. కొద్దిరోజులు రెస్ట్ తీసుకో అన్నా.. లేకుంటే వెస్టిండీస్ ఇంకా దారుణమైన ఓటములు చవిచూస్తుందని” ఆ దేశ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.