WI vs SA : దక్షిణాఫ్రికా జట్టుపై 0-1 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన వెస్టిండీస్ జట్టు.. పొట్టి ఫార్మాట్ లో మాత్రం సత్తా చాటింది. ట్రిని డాడ్ వేదికగా జరిగిన రెండవ టి20 మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా పై వెస్టిండీస్ జట్టు 30 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు టి20 మ్యాచ్ ల సిరీస్ 2-0 తేడాతో సొంతం చేసుకుంది. రెండవ మ్యాచ్లో వెస్టిండీస్ అన్ని రంగాలలో ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లను పూర్తిస్థాయిలో ఆడింది. 179 రన్స్ చేసింది. హోప్ 22 బంతుల్లో 41, పావెల్ 22 బంతుల్లో 35, రూథర్ ఫోర్డ్ 18 బంతుల్లో 29 పరుగులతో సత్తా చాటారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో విలియమ్స్ మూడు వికెట్లు సాధించాడు. పాట్రిక్ రెండు వికెట్లు పడగొట్టాడు.
వెస్టిండీస్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసిన సమయంలో శుభారంభం లభించింది. హోప్, అతంజే (28 పరుగులు) తొలి వికెట్ కు 41 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పవర్ ప్లే లో వెస్టిండీస్ జట్టు ఏకంగా 43 రన్స్ చేసింది. ఈ దశలో దక్షిణాఫ్రికా బౌలర్లు సత్తా చాటారు. వెంట వెంటనే వికెట్లు తీశారు. తన చివర్లో పావెల్, రూథర్ఫర్డ్ ధాటిగా ఆడటంతో వెస్టిండీస్ జట్టు మెరుగైన స్కోర్ సాధించింది. అయితే వెస్టిండీస్ విధించిన లక్ష్యాన్ని చేదించే క్రమంలో దక్షిణాఫ్రికా 19.4 ఓవర్లలో 149 రన్స్ కు కుప్ప కూలింది.
దక్షిణాఫ్రికా బ్యాటర్లలో హెండ్రిక్స్ 18 బంతుల్లో 44 రన్స్ కొట్టి హైయెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. స్టబ్స్ 24 బంతుల్లో 28, రికెల్టన్ 13 బంతుల్లో 20 పరుగులు చేసి సత్తా చాటారు.. వెస్టిండీస్ బౌలర్లలో షామర్ జోసెఫ్, షెఫర్డ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. హోస్సెన్ రెండు వికెట్లు సాధించారు. ఒకానొక దశలో హెండ్రిక్స్ విధ్వంసం సృష్టించడంతో సౌత్ఆఫ్రికా పవర్ ప్లే లో ఏకంగా 71 రన్స్ సాధించింది. కానీ అదే దూకుడును చివరి వరకు కొనసాగించలేకపోయింది. అక్రమంగా వికెట్లను పోగొట్టుకుంటూ ఓటమిపాలైంది. కీలక సమయంలో జోషెప్, షెఫార్డ్ దక్షిణాఫ్రికా వికెట్లను పడగొట్టడంతో ఆ జట్టు విజయావకాశాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వరుసగా 2 t20 మ్యాచ్ లు గెలిచి వెస్టిండీస్ జట్టు ట్రోఫీని దక్కించుకుంది. వరుసగా సొంతదేశంలో దక్షిణాఫ్రికాపై మూడవ టోర్నీ సాధించి.. వెస్టిండీస్ అరుదైన ఘనత సొంతం చేసుకుంది.