Nagarjuna: ఇన్ని కష్టాలు.. కూల్చివేతల తర్వాత ఈ సీజన్ బిగ్ బాస్ షో లో నాగార్జున పూర్వ వైభవం చూపించగలరా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోలకి చాలా మంచి క్రేజ్ ఉంటుంది. వాళ్లకు సంబంధించిన మంచి విషయమైన, చెడు విషయమైన జనాల్లోకి చాలా తొందరగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మంచి చేస్తే పర్లేదు కానీ ఏదైనా చెడు వార్త బయటకు వస్తే మాత్రం ఆ హీరో మీద సగటు ప్రేక్షకులతోపాటు తమ అభిమానుల్లో కూడా భారీ వ్యతిరేకత ఏర్పడే అవకాశాలైతే ఉన్నాయి...

Written By: Gopi, Updated On : August 26, 2024 11:06 am

Nagarjuna(3)

Follow us on

Nagarjuna: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం హైడ్రా పేరుతో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న విషయం మనకు తెలిసిందే… అందులో భాగంగానే మాదాపూర్ లోని తమ్మిడి కుంట చెరువు ను ఆక్రమించి కట్టిన కట్టడాలను కూల్చి వేస్తున్నారు. ముఖ్యంగా హీరోగా నాగార్జున కట్టిన ‘ఎన్ కన్వెన్షన్’ ను కూల్చివేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ విషయం మీద నాగార్జున స్పందిస్తూ తను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని ఏ భూమిని కబ్జా చేయలేదని తన సొంత భూమిలోనే తను కట్టడాలను నిర్వహించానని తెలియజేశాడు. ఇక దీని మీద లీగల్ గా ప్రొసీడ్ అవ్వడానికి తను సిద్ధంగా ఉన్నానని కూడా తెలియజేశాడు. మొత్తానికైతే నాగార్జున ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నాడనే చెప్పాలి. ఇక ఇలాంటి సందర్భంలో సెప్టెంబర్ 1 వ తేదీన బిగ్ బాస్ షో ప్రారంభం కానున్న నేపథ్యంలో దానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున కోర్టు కేసుల్లో చాలా బిజీగా తిరుగుతున్నాడు. అలాగే తను అక్రమ కట్టడాలను కట్టినందు వల్లే ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేశారనే ఒక వార్త అయితే జనాల్లోకి చాలా తొందరగా స్ప్రెడ్ అయింది. కాబట్టి ఇప్పుడు ఆయన బిగ్ బాస్ హోస్ట్ గా కంటెస్టెంట్స్ ను ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది కూడా చాలామందిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

నిజానికి కంటెస్టెంట్స్ తప్పు చేస్తే తప్పు, ఒప్పు చేస్తే ఒప్పు అని చెప్పే కెపాసిటీ ఉన్న నాగార్జున ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకోవడం వల్ల ఆయన మాటకి జనాల్లో ఆదరణ లభిస్తుందా? తనే అక్రమాలకు పాల్పడ్డాడు. కంటెస్టెంట్స్ కి ఏం నీతులు చెబుతున్నాడు అంటూ జనాల నుంచి భారీగా వ్యతిరేకత ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కొన్ని వార్తలైతే తెర మీదికి వస్తున్నాయి.

ఇక ఇప్పటికే ఈ సీజన్ కోసం స్టార్ వాళ్లతో ఒప్పందం కుదుర్చుకున్న నాగార్జున మరి ‘బిగ్ బాస్’ షో కోసం తను ఎలాంటి ప్రణాళికను సిద్ధం చేసుకుంటాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక నాగార్జున కూడా లోపల ఎమోషనల్ బాధని పెట్టుకొని బయటికి ఆహ్లాదంగా మాట్లాడుతూ జనాలని ఎంటర్టైన్ చేయగలరా? అలాగే కంటెస్టెంట్స్ అందరిని ఏకతాటి మీదకు తీసుకు రాగలిగే విధానాన్ని అనుసరించగలడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక మొత్తానికైతే నాగార్జున ప్రస్తుతం ఒక గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడనే చెప్పాలి. ఇంతకుముందు చాలా మంది సీఎంలు ఎన్ కన్వెన్షన్ మీద కొన్ని ఎంక్వయిరీలు వేయించినప్పటికీ ఎవరు కూడా దాన్నైతే పడగొట్టలేదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం పడగొట్టి తన పంతాన్ని నిలుపుకున్నాడని మరి కొంతమంది భావిస్తున్నారు. మరి ఇందులో తప్పు ఎవరిది అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…