Washington Sundar : న్యూజిలాండ్ జట్టుతో జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియా తెగ కసరత్తు చేస్తోంది. 2017 నాటి తప్పును పునరావృతం చేయకుండా జాగ్రత్త పడుతోంది. 2000 సంవత్సరంలో న్యూజిలాండ్ చేతిలో టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీని కోల్పోయింది. 2021 సంవత్సరంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో టీమ్ ఇండియాను న్యూజిలాండ్ ఓడించింది. రెండుసార్లు న్యూజిలాండ్ ఐసిసి టోర్నీలను గెలుచుకుంది. ఆ రెండు సందర్భాల్లో కూడా టీమ్ ఇండియాను న్యూజిలాండ్ ఓడించడం విశేషం. అందువల్లే ఆ ఓటములకు బదులు తీర్చుకోవాలని టీమిండియా బలంగా భావిస్తున్నది. అందువల్లే ప్రత్యర్థి జట్టుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఉండాలని చూస్తోంది. ఇక ప్రస్తుతం టీమిండియాలో కులదీప్ యాదవ్ కీలకమైన బౌలర్ గా ఉన్నప్పటికీ.. అతడు ఆశించిన స్థాయిలో వికెట్లు తీయలేకపోతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో అతడు అంతగా ప్రభావం చూపించలేకపోయాడు. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన లీగ్ మ్యాచ్లో ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. అయితే వాషింగ్టన్ సుందర్ కు న్యూజిలాండ్ జట్టుపై అద్భుతమైన రికార్డు ఉంది. అందువల్లే అతని జట్టులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సుందర్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా చేయగలడు. జట్టు అవసరాలకు ఉపయోగపడగలడు.
Also Read : CT రద్దయితే ఐసిసి ఏం చేస్తుంది? ఛాంపియన్ ను ఎలా నిర్దేశిస్తుంది?
కులదీప్ యాదవ్ స్థానంలో..
ఆదివారం న్యూజిలాండ్ జట్టుతో జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత జట్టులో స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. కులదీప్ యాదవ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ కు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. వాషింగ్టన్ సుందర్ గత ఏడాది అక్టోబర్ – నవంబర్ నెలలో భారత్ వేదికగా న్యూజిలాండ్ – టీమిండియా తలపడ్డాయి. ఈ మూడు టెస్టుల సిరీస్ లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. తొలిసారిగా టీమిండియాను స్వదేశంలోనే క్లీన్ స్వీప్ చేసింది. ఈ టెస్ట్ సిరీస్ లో టీమిండియా బౌలర్ వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన ప్రతిభ చూపించాడు. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ సాధించని ఘనతను అందుకున్నాడు. హైయెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచాడు. వాషింగ్టన్ సుందర్ ఇటీవల తన చివరి వన్డే మ్యాచ్ ను ఇంగ్లాండ్ జట్టుతో ఆడాడు. ఆ మ్యాచ్ లో అతడు 43 పరుగులు ఇచ్చి ఒక వికెట్ కూడా పడగొట్టాడు. ఇక బ్యాటింగ్లో 14 పరుగులు చేశాడు. వాషింగ్టన్ సుందర్ ఇప్పటివరకు 23 వన్డే మ్యాచ్లు ఆడాడు. 24 వికెట్లు పడగొట్టాడు. 329 పరుగులు కూడా చేశాడు.
Also Read: న్యూజిలాండ్ జట్టుతో CT ఫైనల్.. టీమిండియాలో ఆ మ్యాజికల్ బౌలర్ ఆడేది అనుమానమే.. ఎందుకంటే?