India Vs Sri Lanka Final: ఇండియా శ్రీలంక ఫైనల్ మ్యాచ్ లో ఇండియా ప్లేయింగ్ 11 ఇదే…

ఇండియా విషయానికి వస్తే తొమ్మిది సార్లు ఫైనల్ కి వస్తే అందులో ఏడు సార్లువిజయం సాధించింది. దీంతో ఎనిమిదో సారి టైటిల్ ని దక్కించుకోవాలని ఇండియా చూస్తుంది.

Written By: Gopi, Updated On : September 17, 2023 11:59 am

India Vs Sri Lanka Final

Follow us on

India Vs Sri Lanka Final: రీసెంట్ గా స్టార్ట్ అయిన ఏషియా కప్ సగం మ్యాచ్ లు వర్షం కారణం గా రద్దైనవే ఉన్నాయి ఇక చూస్తుండగానే ఏషియా కప్ ఫైనల్ మ్యాచ్ వచ్చేసింది. ఈరోజు ఇండియా శ్రీలంక జట్ల మధ్య ఫైనల్ జరగుతుంది.ఈ మ్యాచ్ లో ఎలాగైనా ఇండియా గెలిచి తన ఆధిపత్యాన్ని చుపించుకోవాలని చూస్తుంది.ఇక ఇప్పటికే లాస్ట్ టైం డిపెండింగ్ ఛాంపియన్స్ అయినా శ్రీలంక టీం ఇండియాతో పాటు ఫైనల్ లో తల. అయితే లాస్ట్ టైం ఏషియా కప్ t20 ఫార్మాట్లో ఆడారు కాబట్టి అప్పుడు శ్రీలంక విజయం సాధించింది. కానీ ప్రస్తుతం 50 ఓవర్ల మ్యాచ్ కాబట్టి అందులోనూ శ్రీలంక ఆడేది ప్రపంచ క్రికెట్ లోనే టాప్ మోస్ట్ టీమ్ ల్లో ఒకటైన ఇండియా టీం ని ఎదుర్కొంటుంది కాబట్టి శ్రీలంక గెలవాలంటే చాలా జాగ్రత్తగా ఈ మ్యాచ్ ఆడాలి. ఇక డిపెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగుతున్న శ్రీలంక ఇప్పటివరకు పది సార్లు ఫైనల్ కి చేరుకుంది అందులో కేవలం 6 సార్లు మాత్రమే విజయం సాధించింది. అదే ఇండియా విషయానికి వస్తే తొమ్మిది సార్లు ఫైనల్ కి వస్తే అందులో ఏడు సార్లువిజయం సాధించింది. దీంతో ఎనిమిదో సారి టైటిల్ ని దక్కించుకోవాలని ఇండియా చూస్తుంది. అలాగే శ్రీలంక మీద ఇప్పటివరకు ఫైనల్ లో ఇండియా ఐదు సార్లు గెలిస్తే , శ్రీలంక టీమ్ ఇండియా మీద మూడుసార్లు మాత్రమే గెలిచింది. ఈ లెక్కన ఇండియా ఇప్పటివరకు శ్రీలంక మీద ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందనే చెప్పాలి. ఇక ఇండియా తరుపున ఈ మ్యాచ్ లో బరిలోకి దిగే ప్లేయింగ్ 11 ఎవరో ఒకసారి మనం చూద్దాం…

ముందుగా ఓపెనర్లుగా రోహిత్ శర్మ ,శుభమన్ గిల్ ఆడతారు. వీళ్లు చాలా మంచి ప్లేయర్లు ఫాస్ట్ బౌలింగ్ తో పాటు స్పిన్నర్లను కూడా ధాటిగా ఎదుర్కునే సత్తా ఉన్న ప్లేయర్లు ఇక వీళ్ల తర్వాత నెంబర్ త్రీ లో కోహ్లీ ఉన్నాడు, నెంబర్ ఫోర్ లో కెల్ రాహుల్, నెంబర్ ఫైవ్ లో ఇషాన్ కిషన్, నెంబర్ 6 లో హార్దిక్ పాండ్యా, నెంబర్ సెవెన్ లో రవీంద్ర జడేజా, నెంబర్ ఎయిట్ లో శార్దుల్ ఠాకూర్ నెంబర్ నైన్ లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10 లో మహమ్మద్ సిరాజ్ లేదా మహమ్మద్ షమీ ఇద్దరిలో ఒక్కరిని తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే సిరాజ్ ఈ ఏషియా కప్ లో ఇప్పటి వరకు తన మ్యాజిక్ ని రిపీట్ చేయలేకపోతున్నాడు కాబట్టి రోహిత్ శర్మ శమి ని తీసుకునే అవకాశం కూడా ఉంది. నెంబర్ 11 లో జస్ప్రిత్ బూమ్రా ఉన్నాడు. ఈరోజు టీమిండియా ఇదే టీంతో బరిలోకి దిగనుంది…