https://oktelugu.com/

కోహ్లిపై దీపావళి బాంబ్‌ వేసిన ఫ్యాన్స్‌

దీపావళి సందర్భంగా దేశమంతా బాంబుల మోత మోగుతుంటే.. తాజాగా ఇండియా క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చేసిన ట్వీట్‌ మరింత నిప్పును రగిల్చింది. ఫలితంగా నెటిజన్ల నుంచి విరాట్‌కు ఊహించని కౌంటర్‌‌ ఎదురైంది. ఇప్పటికే ఐపీఎల్లో ఓడిపోవడంతో కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తాయి. మున్ముందు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తున్న కోహ్లికి గట్టి షాక్‌ తగిలినట్లైంది. ఏకంగా.. టీమ్‌ ఇండియా కెప్టెన్‌గా కోహ్లి పనికిరాడంటూ కామెంట్లు వచ్చిపడ్డాయి. Also Read: బీహార్‌లో ఎవరు సీఎం.. ఎవరు‌ డిప్యూటీ సీఎం? […]

Written By:
  • NARESH
  • , Updated On : November 15, 2020 / 06:49 PM IST
    Follow us on

    దీపావళి సందర్భంగా దేశమంతా బాంబుల మోత మోగుతుంటే.. తాజాగా ఇండియా క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చేసిన ట్వీట్‌ మరింత నిప్పును రగిల్చింది. ఫలితంగా నెటిజన్ల నుంచి విరాట్‌కు ఊహించని కౌంటర్‌‌ ఎదురైంది. ఇప్పటికే ఐపీఎల్లో ఓడిపోవడంతో కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తాయి. మున్ముందు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తున్న కోహ్లికి గట్టి షాక్‌ తగిలినట్లైంది. ఏకంగా.. టీమ్‌ ఇండియా కెప్టెన్‌గా కోహ్లి పనికిరాడంటూ కామెంట్లు వచ్చిపడ్డాయి.

    Also Read: బీహార్‌లో ఎవరు సీఎం.. ఎవరు‌ డిప్యూటీ సీఎం?

    ఇంతకీ కోహ్లీ పెట్టిన ట్వీట్ ఏంటంటే.. ‘అందరికీ దీపావళి శుభాకాంక్షలు.. పర్యావరణాన్ని కాపాడేందుకు ఈ సారి ఎవరూ క్రాకర్స్ కాల్చకండి’ అని. ఈ ట్విట్‌తో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇటీవల ఐపీఎల్ సీజన్ కొనసాగుతుండగానే కోహ్లీ పుట్టినరోజు జరిగింది. ఈ సందర్భంగా ఆర్సీబీ యజమాన్యం పెద్ద ఎత్తున టపాసులు కాల్చింది. అందుకు సంబంధించిన వీడియోలు కూడా షేర్ చేశారు.

    కోహ్లి పెట్టిన మెస్సేజ్‌కు.. పుట్టిన రోజు నాటి వీడియోను యాడ్‌ చేస్తూ.. ‘నీ పుట్టినరోజుకు టపాసులు కాల్చితే పర్యావరణానికి ఏం హానీ కలగదు. కానీ హిందువులు తమ పండక్కి టపాసులు కాల్చితే ఇబ్బంది వచ్చిందా’ అంటూ కౌంటర్లు వేస్తున్నారు. ‘విరాట్ చెప్పేవి శ్రీరంగనీతులు.. చేసేది చెత్త పనులా’ అంటూ కామెంట్లు విసిరారు.

    Also Read: సీఎం జగన్ ఆ సీనియర్ మంత్రిని దూరం పెడుతున్నారా?

    విరాట్‌ తన 32వ జన్మదిన వేడకలను దుబాయ్‌లో భార్య అనుష్క శర్మ, బెంగళూరు టీమ్‌ మెంబర్స్‌తో కలిసి బోట్‌లో జరుపుకున్న విషయం తెలిసిందే. కోహ్లీకి విషెస్ చెప్తూ ఆర్సీబీ యాజమాన్యం పెద్ద ఎత్తున తారాజువ్వలను, క్రాకర్స్‌ కాల్చింది. ఆ వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారాయి.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్