https://oktelugu.com/

Pushpa Movie: “పుష్ప” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై కేసు నమోదు… కారణం ఏంటంటే ?

Pushpa Movie: అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా “పుష్ప”. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా సుక్కు – బన్నీ – దేవీశ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తుంది. ఈ మూవీలో బన్నీ సరసన  రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. భారీ స్థాయిలో రెండు భాగాలుగా ఈ సినిమాని రూపొందిస్తుండగా… పుష్ప ది రైజ్ పార్ట్ 1 ను […]

Written By: , Updated On : December 13, 2021 / 06:15 PM IST
Follow us on

Pushpa Movie: అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా “పుష్ప”. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా సుక్కు – బన్నీ – దేవీశ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తుంది. ఈ మూవీలో బన్నీ సరసన  రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. భారీ స్థాయిలో రెండు భాగాలుగా ఈ సినిమాని రూపొందిస్తుండగా… పుష్ప ది రైజ్ పార్ట్ 1 ను డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా 5 భాషలలో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్, పాటలు, వీడియో లకు ప్రేక్షకుల నుంచి విపరీత మైన స్పందన లభించింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్ గా నిర్వహించారు.

police case files on allu arjun pushpa movie pre release event

అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో మేకర్స్‌కు పోలీసులు షాకిచ్చారు. ఏకంగా నాలుగు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. మరో నాలుగు రోజుల్లో పుష్ప పార్ట్ 1 రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్ యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకను శ్రేయాస్ మీడియా ఆర్గనైజ్ చేసింది. వాస్తవంగా ఆర్గనైజర్స్ ముందు గానే అనుమతులు పొందారు. ఆ సమయంలో 5000 పాసెస్ కు మాత్రమే అనుమతి తీసుకున్నారు. కానీ, ఈవెంట్ సమయానికి పరిమితి మించి జనాలు రావడంతో చేసేదేమీ లేక మేకర్స్ జనాలను ఈవెంట్‌లో అనుమతి ఇచ్చారు. ఇదే ఇప్పుడు చిత్రబృందం, ఈవెంట్ ఆర్గనైజర్స్ మీద కేసు ఫైల్ అయ్యేలా చేసింది. కొవిడ్ నిబంధనలను అతిక్రమించిన కారణంగా 143, 341, 336, 290… సెక్షన్ల మీద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరి ఆ తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. ప్రస్తుతం ఈ వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా చర్చించుకుంటున్నారు.