Babar Azam: విరాట్ కోహ్లీని మనం పరుగుల యంత్రం అని పిలుచుకుంటాం. ఫార్మాట్ తో సంబంధం లేకుండా అతడు ఆడే ఇన్నింగ్స్ లను కథలు కథలుగా చెప్పుకుంటాం. విరాట్ కోహ్లీకి మన మీడియా ఏ స్థాయిలో ప్రచారం కల్పిస్తుందో తెలుసు కదా.. సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీకి ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. అయితే విరాట్ కోహ్లీ స్టార్ డం చూసి తట్టుకోలేక పాకిస్తాన్ ఒక్కసారిగా బాబర్ అజాం ను పైకి లేపింది. మామూలుగా కాదు.. కిలోమీటర్ల పొడుగున్న జాకీలు పెట్టి లేపింది. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది.
Also Read: 92 పరుగులకే కుప్పకూలింది.. సిరీస్ కోల్పోయింది.. పాక్ ఆట ఈ జన్మలో మారదు..
బాబర్ అజామ్ ఒకప్పుడు పర్వాలేదు అనుకునే స్థాయిలో బ్యాటింగ్ చేసేవాడు. కొన్ని సందర్భాలలో శతకాలు కూడా సాధించాడు. కానీ ఇప్పుడు లయను కోల్పోయి చాలా ఇబ్బంది పడుతున్నాడు. కనీసం తన స్థాయి లో కాకపోయినా ఒక మోస్తరు పరుగులు కూడా చేయలేకపోతున్నాడు. మేటి జట్ల మీద పక్కన పెడితే.. కింది స్థాయి జట్ల మీద కూడా అతడు అదరగొట్టలేకపోతున్నాడు. వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్లో బాబర్ దారుణంగా విఫలమయ్యాడు. మూడు మ్యాచ్లు కలిపి అతడు కేవలం 56 పరుగులు మాత్రమే చేశాడు. తొలి వన్డేలో 47 పరుగులు చేశాడు. అయితే అదే ఊపును కొనసాగించలేకపోయాడు. చివరి వన్డేలో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. 9 పరుగులు చేయడానికి అతడు ఏకంగా 23 బంతులు ఎదుర్కొన్నాడు.
Also Read: 22 సంవత్సరాలకే ఇంత విధ్వంసమా.. కంగారు జట్టుకు చుక్కలు చూపించావు కదరా!
గడచిన 72 ఇన్నింగ్స్ లలో బాబర్ ఒక్క శతకం కూడా సాధించలేకపోయాడు. దీనిని బట్టి అతడి ఫామ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బాబర్ బ్యాట్ నుంచి చెప్పుకునే స్థాయిలో ఇన్నింగ్స్ రాక 715 రోజులు దాటింది. బాబర్ ఫామ్ కోల్పోయిన నేపథ్యంలో సోషల్ మీడియాలో అతడి మీద తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. లయ అందుకున్న తర్వాతే అతడు మళ్ళీ బ్యాట్ పట్టుకోవాలని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.”అతని మీద అంచనాలు ఉన్నాయి. కానీ వాటిని నిజం చేసుకోవడంలో అతడు విఫలమవుతున్నాడు. ఇలా ఆడితే అతడు గొప్ప ఆటగాడు కాలేడు. ఎందుకు ఇంత దారుణంగా ఆడుతున్నాడో అర్థం కావడం లేదు. కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోతున్నాడు.. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడి ఆడాల్సింది పోయి ఇలా అవుట్ కావడం అతడి విఫల బ్యాటింగ్ స్టైల్ ను సూచిస్తోందని” పాకిస్థాన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా వాపోతున్నారు.